నాగులాచవితికీ నాగేంద్ర నీకూ (Nāgulācavitikī nāgēndra nīkū)
నాగులాచవితికీ నాగేంద్ర నీకూ, పొట్టనిండా పాలు పోసేము తండ్రి
నీ పుట్ట దరికి మా పాపలోచ్చేరు, పాప పుణ్యమ్ముల వాసనేలేని
బ్రహ్మస్వరూపులోయి పసికూనలోయి, కోపించి బుస్సలు కొట్టబోకోయి || 1 ||
నాగులాచవితికీ నాగేంద్ర నీకూ, పొట్టనిండా పాలు పోసేము తండ్రి
అర్థరాత్రి వేళ అపరాత్రి వేళ, పాపమే ఎరుగని పశులు తిరిగేయి
ధరణికి జీవనాధారాలు సుమ్మా, వాటి నీ రోషాన కాటెయ్యబోకు || 2 ||
నాగులాచవితికీ నాగేంద్ర నీకూ, పొట్టనిండా పాలు పోసేము తండ్రి
పగలనక రేయనక పనిపాటలందు, మునిగితేలేటి నా మోహాలభరిణ
కంచెలు కంపలు నడిచేటి వేళ, కంపచాటున ఉండి కొంపతియ్యకోయి || 3 ||
నాగులాచవితికీ నాగేంద్ర నీకూ, పొట్టనిండా పాలు పోసేము తండ్రి
అటు కొండ ఇటు కొండ ఆ రెంటి నడుమ, నాగుళ్ల కొండలో నాట్యమాడేటి
దివ్య సుందర నాగ దేహిఅన్నాము, కరుణించి మమ్మేప్పుడు కాపాడు తండ్రి || 4 ||
నాగులాచవితికీ నాగేంద్ర నీకూ, పొట్టనిండా పాలు పోసేము తండ్రి, పొట్టనిండా పాలు పోసేము తండ్రి || 5 ||
Nāgulācavitikī nāgēndra nīkū, Poṭṭaniṇḍā pālu pōsēmu taṇḍri
Nī puṭṭa dariki mā pāpalōccēru, pāpa puṇyam’mula vāsanēlēni
Brahmasvarūpulōyi pasikūnalōyi, kōpin̄ci bus’salu koṭṭabōkōyi || 1 ||
Nāgulācavitikī nāgēndra nīkū, Poṭṭaniṇḍā pālu pōsēmu taṇḍri
Artharātri vēḷa aparātri vēḷa, pāpamē erugani paśulu tirigēyi
Dharaṇiki jīvanādhārālu sum’mā, vāṭi nī rōṣāna kāṭeyyabōku || 2 ||
Nāgulācavitikī nāgēndra nīkū, Poṭṭaniṇḍā pālu pōsēmu taṇḍri
Pagalanaka rēyanaka panipāṭalandu, munigitēlēṭi nā mōhālabhariṇa
Kan̄celu kampalu naḍicēṭi vēḷa, kampacāṭuna uṇḍi kompatiyyakōyi || 3 ||
Nāgulācavitikī nāgēndra nīkū, Poṭṭaniṇḍā pālu pōsēmu taṇḍri
Aṭu koṇḍa iṭu koṇḍa ā reṇṭi naḍuma, nāguḷla koṇḍalō nāṭyamāḍēṭi
Divya sundara nāga dēhi’annāmu, karuṇin̄ci mam’mēppuḍu kāpāḍu taṇḍri || 4 ||
Nāgulācavitikī nāgēndra nīkū, Poṭṭaniṇḍā pālu pōsēmu taṇḍri, Poṭṭaniṇḍā pālu pōsēmu taṇḍri || 5 ||
మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”
లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******
My dear ammama ..chakkaga cheppavu manushulaku nagula chaviti tatparyamu ..thank you