Tag Archives:

అరుళ్మిగు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రము తిరుచెందూర్

ఆది దంపతులు పరమేశ్వరుడు, పార్వతీదేవిల రెండో తనయుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. దేవసేనానిగా వ్యవహరించి రాక్షసుడు శూరపద్ముడిని సంహరించాడు. ఈ సంహారం కోసం ఆయన పలు రణశిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. వాటిని ఆరు పడై వీడు అంటారు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే వున్నాయి. అవి స్వామిమలై, పళని, పళముదిర్చోళై, తిరుప్పరన్‌ కుండ్రం, తిరుచెందూర్, తిరుత్తణి. ప్రస్తుతం మనం తిరుచెందూర్ గురించి తెలుసుకుందాము.

తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది. ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, శూరపద్ముడు అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి, పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడు లో తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. సముద్ర కెరటాలు తిన్నగా వచ్చి గుడిని తాకుతుంటాయి. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొండ మీద కొలువై ఉన్నాడు.

స్థల పురాణము…

ఒకానొకప్పుడు, ఈ పవిత్ర స్థలంలో అసురుడైన శూరపద్ముడు తన సోదరులగు సింహముఖుడు మరియు తారకాసురుడితో ముల్లోకాలను ఏలుతుండేవాడు. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు, తిరుచెందూరుకు అసుర సంహారమునకై వచ్చారు. తన శివారాధన నిమిత్తం, మయుడిని రప్పించి ఒక దేవాలయాన్ని నిర్మించమని ఆఙ్ఞాపించారు. ఆ తరువాత స్వామివారు అసురసంహారానికై పూనుకొని, వారితో ఆరు రోజులు ఎడతెఱిపి లేకుండా నేలపైన, సముద్రముపైన, ఆకాశములో యుద్ధం చేశారు. ఆ భీకర యుద్ధంలో శూరపద్ముడు మినహా అందరూ సంహరింపబడ్డారు. శూరపద్ముడు సముద్రానికి దగ్గిరలో ఒక మామిడి చెట్టు రూపంలో ఉద్భవించాడు. స్వామివారు ఇంద్రుడిని తన వాహనముగా చేసుకొని, తన శక్తి ఆయుధంతో రెండు ముక్కలుగా చీల్చి సంహరించారు. కానీ ఆ రెండు ముక్కలు కోడిపుంజు, మగ నెమలి స్వామివారిచే క్షమింపబడి, ఆయన విశ్వరూప దర్శన భాగ్యాన్ని పొందాడు. ఇంద్రుడి బదులు ఆ మగ నెమలిని తన వాహనంగా చేసుకొని, కోడిపుంజును తన పతాక చిహ్నముగా చేసుకున్నారు.

స్కాంద పురాణంలో…

ఈ ఆలయం గురించి స్కాంద పురాణములో చెప్పబడినది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒకసారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అయ్యింది. వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు. ఈ భుజంగ స్తోత్రము ద్వారా, మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించేసే కొన్ని దోషాలు ఉంటాయి, అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి . దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు, ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది, దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు, సంతానము కలుగక పోవడం, కుష్టు రోగం మొదలైనవి. అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు. ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది.

ఈ సంసారము అనే మహా సముద్రము నుండి మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు. అందుకే శంకర భగవత్పాదులు స్వామిని “మహాంబోధితీరే మహాపాపచోరే ….. అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో. అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రమునకు ఉన్నది.

స్వామివారి రూపం…

తిరుచెందూర్ క్షేత్రములో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు. అంత అందంగా ఉంటారు. ఇక్కడ, స్వామి తన ముద్దులొలికే రూపంతో పాటు పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. చాలా చాలా శక్తివంతమైన క్షేత్రము. ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి. సముద్ర తీరంలో శక్తివంతమైన, సుందరమైన దివ్య క్షేత్రం యిది.ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో. అది చూసి తీరాలి. సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూర్ క్షేత్రములో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది.

విభూది మహిమ…

ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన విభూతి తీసుకు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవు. అంతే కాదు, ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మవ్యాధులు నయం అవుతాయి.

ఆలయశోభ…

సమీపిస్తున్న కొద్దీ, భవ్యమైన తొమ్మిదంతస్తుల రాజగోపురం, దాని పైని శూలం కొట్టొచ్చినట్లుగా కనబడుతాయి. దీనిని 300 ఏళ్ళ క్రితమే నిర్మించడం జరిగింది. తిరువాదుథురై మఠ మహాసన్నిధానానికి చెందిన దేశికమూర్తిస్వామివారికి కలలో ఈ నిర్మాణం చేపట్టవలసినదిగా ప్రచోదనమయ్యింది. అయితే అతడు పేదవాడు కావడంవల్ల, గోపుర నిర్మాణానికై వచ్చిన కూలీలకు కూలీ డబ్బులకు బదులుగా స్వామివారి విభూతిని ఇచ్చాడట. ఆ కూలీలు తుండుక్కై వినాయక ఆలయం వద్దనుండి వెళుతున్నపుడు, ఎవరి శ్రమకు తగినట్టుగా వారికి ఆ విభూతి బంగారంగా మారిపోయేదట. ఆరవ అంతస్థు పూర్తికాగానే, ఈ అద్భుతం ఆగిపోయిందట. మరలా సుబ్రహ్మణ్యస్వామివారు కలలో కనిపించి, కల్యాణ పట్టణానికి చెందిన సీతాపతి మరైక్కార్ అను పోషకుడి వద్దనుండి ఒక బుట్ట ఉప్పును పొందమని ఆదేశించారట. ఆ బుట్టతో తిరుచెందూర్ చేరుకోగానే, ఉప్పు కాస్తా బంగారు నాణాలుగా మారి మిగతా మూడంతస్థుల నిర్మాణం పూర్తిగావించడానికి తోడ్పడిందట. అనంతరంతర కాలంలో ఈ ఆలయం అనేక మార్పులకు, చేర్పులకూ గురవుతూ వచ్చింది. ప్రస్తుతమున్న ఈ ఆలయం వంద సంవత్సరాలకు పూర్వం నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది.

షణ్ముఖ విలాసం…

దేవాలయ ప్రధాన మంటపం 124 స్థంబాలతో శోభిస్తూ, దక్షిణాభిముఖంగా ఉంటుంది. దీనిని షణ్ముఖ విలాసం అని పిలుస్తారు. మొదటి ప్రాకారపు దక్షిణ ప్రవేశమార్గానికి పడమటివైపు దక్షిణామూర్తి (శివుడు) కనిపిస్తారు. ఇక్కడే మరో మండపం ఉంది. ఈ మండపంలో ఉత్సవ దేవతా విగ్రహాలు దర్శనమిస్తారు. ఫల్గుణీ మాసంలో ప్రతి ఏటా ఈ మంటపంలో వల్లీ అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. పడమటి ద్వారానికి ఉత్తరాన శూరపద్మునితో పోరాటానికి సిద్ధంగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామివారు, నెమలిపై కూర్చొన్న విగ్రహం కనిపిస్తుంది. అక్కడక్కడా శివలింగాలు కనిపిస్తాయి. ఆ తరువాత, అరుణగిరి నాథర్ ముని విగ్రహం ఉంటుంది. ఈయన స్వామివారిని స్తుతిస్తూ తిరుప్పుగయ్ అనే రచన చేశారు. దీనికి సమీపంలో గణపతిస్వామి మూర్తి ఉంది. ఈయనను ఇక్కడ ‘ముక్కురిణి పిళ్లయర్’అని పిల్వడం జరుగుతోంది. ఉత్తర ద్వారం వద్ద వేంకటేశ్వరస్వామివారి విగ్రహం కనిపిస్తుంది. ఆనుకొనున్న గుహలో గజలక్ష్మి, పరుండిన రంగనాథుడు, శ్రీదేవీ, భూదేవీ, నీలాదేవి దర్శనమిస్తారు.

ఇక్కడే రాతిలో చెక్కిన పన్నెండు ఆళ్వారుల (వైష్ణవ భక్తాగ్రేసరులు) మూర్తులు కూడా దర్శనమిస్తాయి. తూర్పువాకిలి మధ్య భాగాన, తూర్పుగోపురం హద్దుగా తామ్రంతో నిర్మితమైన ధ్వజస్తంభం ఉంది. రెండవ ప్రాకారంలో, కుమార పీటంకార, ఆయన భార్యలు, షణ్ముఖుని ఉత్సవ విగ్రహాలూ ఉంటాయి. దగ్గిరలో 63 నాయన్మార్లు (శైవ భక్తాగ్రేసరులు) వరుసగా దర్శనమిస్తారు. ఉత్తరపు వాకిలిలో, శివాలయాలలో ఉన్నట్టు చిటికెల చండీశ్వరమూర్తి కనిపిస్తారు. అలాగే, తూర్పున నటరాజస్వామి, శనీశ్వరుడు, భైరవ మూర్తులు దర్శనమిస్తాయి. తూర్పు వాకిలి మధ్య భాగంలో, బంగారు ధ్వజ స్థంభం ఉన్నది.

మూల విరాఠ్ – పవిత్ర పూజ్య పీఠం…
పూజ్య పీఠ ప్రవేశ ద్వారం వద్ద వీర బాహు, వీర మహేంద్రులనబడే ద్వార పాలకులు, స్వామివారి రక్షక భటులుగా నిలబడి కనిపిస్తారు. ఒకే ముఖముతో, చతుర్భుజుడై మూలవర్‌ (మూల విరాఠ్) బాల సుబ్రహ్మణ్య స్వామివారిగా దర్శనం ఇస్తారు. ఇది బ్రహ్మచారి స్వరూపం. ఈ క్షేత్ర ప్రాశస్త్యం, వైభవాలు ఎంతగా ప్రభావితం చేసినా, స్వామివారి దర్శనం చేసినపుడు మాత్రం ఒక వింత అనుభవం కలుగకమానదు. భయంకరమైన రక్కసులను సంహరించినా, స్వామివారి సుందర విగ్రహం, ఒక బాలకుడిలా ఎంతో ముద్దుగొలుపుతూ ఉంటుంది. రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టాలనే వాంఛకన్నా, దగ్గిరకెళ్ళి బుగ్గగిల్లాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటారీ స్వామివారు.

ఉత్తరపు దిక్కున ఒక మూలలోగల శివలింగమే, శూరపద్ముని సంహారం తరువాత, సుబ్రహ్మణ్య స్వామివారు పూజించినదని చెబుతారు. స్వామివారి ప్రసాదం విభూతి. ప్రధాన పీఠానికి ఎడమవైపున ఉత్తరాన ఉత్సవ విగ్రహాలైన శెంథిల్ నాయకన్‌, తన భార్యలతో కూడి దర్శనమిస్తారు. ఈ ఉత్సవ మూర్తులకు ఎడమ వైపు బొక్కసం (ఆభరణాలు భద్రపరుచు స్థలం) ఉంటుంది.

మరొక ప్రత్యేక స్థానంలో, దక్షిణాభిముఖంగా షణ్ముఖస్వామి తన భార్యలగు వల్లి, దేవసేనలతో వేంచేసి ఉన్నారు. ఈ అందమైన రాగి విగ్రహం అద్భుతమైన ఆభరణాలతో సుశోభితంగా ఉంటుంది. స్వామివారు పన్నెండు చేతులతో అనేకమైనట్టి ఆయుధాలు చేతబూని ఉంటారు.

పురాణ విగ్రహం…

షణ్ముఖ విగ్రహానికి సంభందించిన చారిత్రక గాధ ఒకటి ఉన్నది. క్రీ.శ. 1648 లో డచ్ దేశస్తులు ఆలయంపై దాడి చేసి, మూలవిరాఠ్, నటరాజ విగ్రహాలను, సంపదనూ దొంగిలించి సముద్ర మార్గంగుండా పారిపోయారు. కానీ ఒక భయంకరమైన తుఫానులో చిక్కుకొని, భయానికిలోనయి ఆ విగ్రహాలను అక్కడే సముద్రంలో జారవిడిచి తోక ముడిచారు. దొంగతనం గురించి తెలుసుకున్న వడమలయప్ప పిల్లయన్, వెంటనే పంచలోహాలతో మునుపటి విగ్రహంలాంటిదే మరొకటి తయారు చేయించారట. ఈయన నాయకన్లచే నియమింపబడిన జమిందారు. కానీ, క్రీ.శ. 1653 లో ఈ నూతన పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించే సమయానికి, ఒకనాడు స్వామివారు ఆయనకు కలలో దర్శనమిచ్చి, సముద్రంలో జారవిడిచిన తన నిజ విగ్రహాన్ని వెతికి తెచ్చి, తిరిగి ప్రతిష్టించమని ఆఙ్ఞాపించారు. సముద్రంలో నిమ్మపండు తేలియాడుతున్నచోట, దానిపై గరుడపక్షి వలయాకారంలో తిరుగుతూ కనిపిస్తుందని ఆనవాళ్ళు తెలిపారు. నిర్దేశం ప్రకారం వెతికి, స్వామివారి నిజమూర్తిని కనుగొని, పునః ప్రతిష్ట గావించారు. కొత్తగా చేయించిన పంచలోహ విగ్రహాన్ని, మురుగన్ కురుచిలో తిరుప్పిరంటీశ్వరాలయంలో ప్రతిష్టించారు. ఇదేదో కట్టు కథ అనుకునేరు! M.Raffel అనే ఫ్రెంచ్ దేశస్తుడు, 1785లో తను ప్రచురించిన పుస్తకంలో, డచ్ సైనికుడు ఒకడు తెలిపిన వివరాలను పొందుపరిచాడు.

నాయిక్కనర్ వింత బావి…

షణ్ముఖ విలాస్ ఎదురుగా, ఒక దారి కనబడుతుంది. ఆ దారిగుండా వెళితే, చివరన ప్రవేశ రుసుము చెల్లించి బావిలోకి దిగే మార్గంగుండా వెళితే, ఈ నాయిక్కనర్ చేరుకుంటాము. సాధారణంగా భక్తులు మొదట సముద్రంలో స్నానం చేసిన తరువాత, ఈ బావిలో స్నానమాచరించి, పొడి బట్టలు ధరించి, స్వామివారి దర్శనానికి వెళుతుంటారు. ఈ కుండాన్ని, తన వేలాయుధంతో సుబ్రహ్మణ్యస్వామివారు స్వయంగా సృష్టించారని ప్రతీతి.

సముద్రాన్ని ఆనుకొని ఉన్నా, నీరు తాగడానికి అనువుగా ఉంటుంది. అంతే కాదు, ఈ బావిలో నీరు – రెండు రకాలుగా ఉంటుంది. మొత్తంగా వ్యాపించి ఉన్న నీరు గంధకం వాసనతో, కాస్తంత ఉప్పగా మురికిగా కనిపిస్తుంది. ఒక మూలకు ఉన్న మరో చిన్ని కుండం 7 అడుగుల లోతు, ఒక అడుగు వేడల్పు కొలతలతో ఉంటుంది. దీనినుండి ఊరే జలం ఉప్పగా ఉండదు. దీనినే నాయిక్కనర్ అంటారు. సరైన నామం స్కంద పుష్కరిణి. ఇందులో స్నానం ముఖ్యంగా పిల్లల స్నానం ఎంతో ప్రసిద్ధి. ఆ చిన్న కుండం నుండి నీరు తోడి భక్తుల స్నానానికి సహాయంగా, ఒక దేవస్థాన ఉద్యోగి ఉంటాడు.
ఆలయంలో ఆర్జిత సేవలు…

స్వామి వారి అభిషేకము కోసం పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈ క్షేత్రము వెడితే ఈ అభిషేకం తప్పక దర్శించగలరు. అద్భుతంగా ఉంటుంది. ఇవి కాక ఇంకా అష్టోత్తర అర్చన, సహస్రనామ అర్చన మొదలైన సేవలు ఉన్నాయి.

బ్రహ్మోత్సవాలు…

ఈ ఆలయంలో ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అందులో ఒకటి తమిళ ఆవణఇ మాసంలో (ఆగస్టు – సెప్టెంబరు), రెండోది మాసి మాసంలో (ఫిబ్రవరి- మార్చి) నిర్వహిస్తారు. అలాగే చిత్తరై మాసంలో (ఏప్రిల్-మే) వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది పది రోజులు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. వైశాఖిలో (మే-జూన్) 12 రోజులు విశాఖ ఉత్సవాలను నిర్వహిస్తారు. శూరసంహారం ముగిసిన అనంతరం, మరుసటిరోజున తిరుకళ్యాణ మంటపంలో దేవయాని తిరుకళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ కావడి పూజలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. తమ కోర్కెలు తీరిన భక్తులు తమ శక్త్యానుసారం పాలకావడి, పన్నీరు కావడి, పుష్పకావడిలు సుదూర ప్రాంతాలనుంచి కాలినడకన తీసుకొచ్చి, స్వామికి సమర్పిస్తారు.

వసతి సదుపాయము…

ఈ క్షేత్రములో ఆలయ దేవస్థానపు వసతి గృహాలు అనేకము గలవు. ఇవి ముందుగా ఆలయం వారి వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇంతే కాక అనేక ప్రైవేటు హోటళ్ళు కూడా ఉన్నాయి.

ఎక్కడ ఉన్నది?

రోడ్ మరియు రైలు ద్వారా:

తిరుచెందూరు పట్టణం తిరునల్వేలి పట్టణానికి రైలు మార్గంలో సుమారు 50 కిలోమీటర్లు దూరంలో ఉంది. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుంచి తిరునల్వేలికి చేరుకుని అక్కడి నుంచి రైలులో గాని, బస్సులో గాని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.

మరిన్ని వివరాలకై ఆలయం వెబ్ సైట్ ఇచ్చట చూడండి: తిరుచెందూరు – అరుళ్మిగు శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయం

మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: ఈటీవి తీర్ధయాత్ర – అరుళ్మిగు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం – తిరుచెందూరు:

****** స్వామి వారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం, శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనము నుంచి…

కుమారస్వామి అపరావతారమైన కుమారిలభట్టు


కుమారిలభట్టు ఏడవ శతాబ్దములోని విద్వాంసులలో మహా విద్వాంసుడుగా నుండెను. ఇతడు జైమిని సూత్రములకు భాష్యమును విరచించెను. ఈ జైమిని సూత్రములలోని మతమునకే పూర్వ మీమాంసమతమని పేరు. ఇది కర్మప్రధానమైన వైదికమతమును బోధించును. కవలుని సాంఖ్యతత్వము నాధారపరుచుకొని హేతువాదికములై నవీనతత్వమార్గముల బోధించుచు కర్మప్రధానమైన వైదికమతము నిరర్థకమైనదని నిరసించెడు జైన,బౌద్ధ మతములను ఖండించి కుమారిలభట్టు కర్మమార్గ ప్రధానమైన వైదిక ధర్మమును ప్రబలజేసెను. ఈ కుమారిలభట్టునకు భట్టపాదుడను మరియొక పేరు గలదు. ఈతడు వంగదేశీయుడని పాశ్చాత్యులు మొదలగువారు కొందరు వ్రాసిరిగాని యితడాంధ్రదేశీయుడని జైనుల గ్రంథమునందు జెప్పబడినది.

ఒకానొక సమయంలో భారతదేశమంతటా బౌద్ధమతము వ్యాప్తి చెందినది. దీనికి సంబంధించి సనాతన ధర్మంలో కొంత ఆందోళన పొందడం జరిగింది. బౌద్ధము వేదమును అంగీకరించదు. వేదము ప్రమాణము కాదు అన్నవారిని నాస్తికుడు అని పిలుస్తారు. వేదప్రమాణమును అంగీకరించనిది నాస్తికము అవుతుంది. బౌద్ధము వైపు వెళ్ళిపోతే నాస్తికులు అయిపోతారని నాస్తిక మతమును ఖండించి తిరిగి ప్రజలలో కర్మ నియతిని ఏర్పరచి, మరల అందరినీ వేదమార్గంలో నడిపించడం కోసమని సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారు కుమారిలభట్టుగా వెలశారు. ఆయన ప్రయాగ క్షేత్రంలో పుట్టారు.

ఏదయినా తెలుసుకోకుండా ఖండిస్తే దానివలన మర్యాద ఉండదు. బాగా తెలుసుకుని ఖండించాలి. అందుకని వారు ఒక బౌద్దారామమునందు చేరారు. అది ఏడు అంతస్తుల ప్రాకారము కలిగినటువంటి ఆరామము. అక్కడ అనేకమంది బౌద్ధులు ఉండేవారు. వేదము కాని, యజ్ఞము కాని, యాగము కాని, ప్రార్థన కాని, స్తోత్రము కాని చేయడం వారు అంగీకరించరు. అక్కడే కూర్చుని గురువుగారు చెప్పేది ఆయన వినేవారు. సనాతన ధర్మమును ఖండించినపుడు వాటి గురించి చెప్పినపుడు కుమారిలభట్టు ఏడుస్తూ ఉండేవారు. ఒకరోజున గురువు ‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగాడు. అపుడు ఆయన ‘సనాతన ధర్మంలోని విషయములను ఎంతో గొప్పగా ఖండించారు. అందుకు సంతోషంతో ఆనంద భాష్పములు కారుస్తున్నాను’ అని ఆయన అబద్ధం చెప్పారు. ఎందుకు? అసలు ఆ మతంలో ఉన్నదేంటో తెలుసుకుంటే తప్ప ఖండించడం కుదరదు.

పూర్వం అంటే అటువంటి కర్మనిష్ఠ ఉండేది. ఇప్పుడు నాలుగు శ్లోకములు, రెండు పద్యములు చదవడం రాకపోయినా అసలు అవతల మతంలో గొప్పతనం ఏమి ఉన్నదో తెలియకపోయినా, అవతల మతం మీద దుమ్మెత్తి పోసెయ్యవచ్చు. అంతటి హీనస్థితికి మనం దిగజారిపోయాము. ఇది కలియుగం కదా! కానీ కుమారిల భట్టు అటువంటి వాడు కారు. విషయమును తెలుసుకుని, ఏది చెడో దానిని మాత్రమే ఖండించాలని అనుకున్నారు. ఇలా అనుకుని గురువుగారి దగ్గర నేర్చుకున్నారు.
బాగా నేర్చుకున్న తర్వాత ఈయన ఉద్దేశ్యమును శిష్యులు, గురువులు కనిపెట్టారు. ‘ఈయన బౌద్ధుడు కాడు. ఈయన బ్రాహ్మణుడు. ఈయన సనాతన ధర్మమునందు మక్కువ ఉన్నవాడు. వేదమంటే చాలా ప్రీతి కలిగిన వాడు. ఈయన కేవలం మన మతం గురించి తెలుసుకోవడానికి మనలో చేరాడు. కుశాగ్రబుద్ధి కనుక ఈవేళో రేపో మనతో వాదానికి దిగుతాడు. అప్పుడు మనం ఈయనను తట్టుకోవడం కష్టం. కాబట్టి ఆయన ఈ స్థితిని పొందకముందే ఈయనను చంపేస్తే గొడవ వదిలిపోతుంది’ అని అనుకున్నారు.

ఆయనను మాటలలో పెట్టి ఏడవ అంతస్తుకి తీసుకువెళ్ళారు. ఒక కిటికీ దగ్గర నిలబెట్టి ఆయనతో మాట్లాడుతుండగా కొందరు వెనకనుంచి వచ్చి ఆయన రెండు కాళ్ళూ ఎత్తేసి, ఆయనను పైనుండి క్రిందికి తోసేశారు. అపుడు కుమారిలభట్టు క్రింద పడిపోతూ ఆయన ఒక శ్లోకం చెప్పారు. ‘వేదమే ప్రమాణం అయితే, సనాతన ధర్మం సత్యం అయితే వేదములలో చెప్పబడినవన్నీ సత్యములే అయితే, అది అనుష్టించవలసిన మతమయితే నేను క్రిందపడినప్పుడు మరణించకుందును గాక’ అని దాని అర్థం. ఏడంతస్తుల నుండి కిందపడిపోయినా ఆయనకు ఏమీ అవలేదు. కానీ కంట్లో ఒకరాయి గుచ్చుకుని నెత్తురు వచ్చింది. ఆయన వెంటనే వేదమాతను ప్రార్థన చేసి ‘నువ్వు ప్రమాణం అయితే నేను మరణించకూడదు అని నేను అన్నాను. ఇపుడు నేను మరణించలేదు. బ్రతికాను. నువ్వు ప్రమాణమని నిరూపించావు. చాలా సంతోషం. కానీ ఈ రాయి నా కంట్లో ఎందుకు గుచ్చుకోవాలి?’ అని అడిగారు.

మనకి పురాణములలో అశరీరవాణి పలికింది అని తరచుగా చెప్తుంటారు. అశరీరవాణి అంటే వేదం. ఇప్పుడు వేదం అశరీరవాణియై పలికింది. వేదమును మొట్టమొదట ఈశ్వరుడు ఋషులకు చెప్పారు. ఏ రూపము లేకుండా వారికి వినపడేటట్లుగా వాళ్ళ చెవిలో చెప్పారు. అది అప్పటినుంచి వినబడుతూ గురువు దగ్గర శిష్యుడు, గురువు దగర శిష్యుడు అలా వింటూ వెళ్ళింది. వింటూ స్వరం తెలుసుకుని పలికారు కనుక దానికి శృతి అని పేరు వచ్చింది. కాబట్టి ‘మనకి శృతి ప్రమాణము. ఇటువంటి శృతి ప్రమాణం అయితే చావకూడదని నేను అనినప్పుడు నేను చావలేదు కానీ నా కంటికి ఎందుకు దెబ్బతగిలింది’ అని ఆయన అడిగారు. అలా అడిగితే అశరీరవాణియైవేదము అంది ‘నీవు పైనుండి క్రింద పడిపోయేటప్పుడు ‘వేదమే ప్రమాణం అయితే’ అంటూ పడ్డావు. ‘వేదము ప్రమాణం కనుక నేను మరణించను’ అని నీవు అనలేదు. చిన్న అనుమానం పెట్టుకున్నావు. అటువంటి అనుమానము నీ శ్లోకమునండు ఉండరాదు. నీవు బ్రతికావు కానీ నీకు ఈ చిన్న అనుమానం ఉండడం వల్ల కంట్లో రాయి గుచ్చుకుంది’ కుమారిల భట్టుకి కంటికి దెబ్బ తగిలింది కానీ వేదము ప్రమాణం అయింది. అప్పటి నుంచి మరల అందరూ కర్మానుష్ఠానం యజ్ఞము, యాగము, దానము ఇవన్నీ మళ్ళీ మొదలుపెట్టారు.

కుమారిలభట్టు కర్మ గురించి వ్యాప్తి చేశారు కనుక జ్ఞానమార్గము గొప్పది అని చెప్పడానికి శంకరాచార్యుల వారు ఆయన దగ్గరకి వచ్చారు. కానీ అప్పటికి కుమారిల భట్ట తుషాగ్ని ప్రవేశం చేసేశారు. తుషాగ్ని అంటే ఊకను పెద్ద రాశిగా పోసుకుని ఆ ఊకను అంటిస్తారు. ఊకకు ఉండే లక్షణం ఏమిటంటే అది గబగబా కాలిపోదు. తుషాగ్నిలో నిప్పు సెగ మెలమెల్లగా క్రిందనుండి అంటుకుంటూ వస్తుంది. ముందు వేడి పుడుతుంది. సెగ పుడుతుంది. ఒళ్ళు ఉడికిపోతుంది. తరువాత కిందకు వస్తుంది. తరువాత పాదములు, మోకాళ్ళు, తొడలు అన్నీ కాలిపోతుంటాయి. ఎంత కాలిపోతుంటే బూదిలోకి అలా దిగిపోతూ ఉంటారు. ఎంత దిగిపోతుంటే అంత కాలుస్తూ ఉంటుంది. కాల్చి కాల్చి చివరకు ప్రధానమయిన అవయవములయిన గుండె మొదలగునవి కాలిపోయేంత వరకు ఆ ఒళ్ళు కాలిపోతున్న బాధ అనుభవించవలసిందే. ఈవిధంగా క్రిందనుండి పైకి కాలుస్తూనే ఉంటుంది. కదలకుండా కూర్చుని తుషాగ్నిలో ఆయన కాలిపోతున్నారు.

ఆ సమయంలో శంకరాచార్యుల వారు వచ్చారు. వచ్చి ‘అయ్యో, మీరు ఎందుకు ఇలా కాలిపోతున్నారు? ఎందుకు మీరు ఈ పని చేయవలసి వచ్చింది? నేను మిమ్మల్ని కర్మ మార్గం నుండి జ్ఞాన మార్గంలోకి తిప్పడానికి వచ్చాను’ అని చెప్పారు. అపుడు కుమారిలభట్టు ‘నేను తెలిసి చేసినా తెలియక చేసినా గురువుల పట్ల అపచారం చేశాను. బౌద్ధము సనాతన ధర్మమును అంగీకరించని నాస్తిక మతం కావచ్చు. కానీ ఇప్పుడు నేను సనాతన ధర్మ ప్రచారం కోసం బౌద్ధమతంలో ఉన్న రహస్యములు తెలుసుకోవడం కోసం వాటిని ఖండించడం కోసం గురువుల దగ్గర శిష్యుడుగా చేసి వాటిని నేర్చుకున్నాను. ఇలా గురువు దగ్గర వినకూడదు. వాటిని విన్నాను కనుక దానికి ఈ శరీరం తుషాగ్నిలో కాలిపోవడం ఒక్కటే సరియైన ప్రాయశ్చిత్తం. అందుచేత దీనిని ఇలా కాల్చేస్తున్నాను’ అన్నారు. ఆయన ఎంతటి మహాత్ములో చూడండి. నిష్ఠతో ఉన్నవారు కాబట్టి ఆ కర్మనిష్ఠకే శరీరమును వదిలేశారు.

సుబ్రహ్మణ్య స్వామీ అవతారములు అన్నీ కూడా అగ్నియందే పర్యవసిస్తాయి. అందుకే అగ్నిహోత్రంలోకే తుషాగ్నిలోకి కుమారిలభట్టు వెళ్ళిపోతూ ‘నా శిష్యుడు మండనమిశ్రుడు’ ఉన్నాడు. ఆయనతో వాదించి ఓడించండి. అపుడు లోకం అంతా కర్మమార్గం నుండి జ్ఞానమార్గంలోకి వెడుతుంది’ అన్నారు. ఏమి చిత్రం జరిగిందంటే అంతకుపూర్వం వరకు పూజలుచేస్తే మీరు ఏ పూజ చేస్తున్నారో ఆ పూజలో స్వామి పేరు చెప్పి ప్రీత్యర్థం అనేమాట చెప్పడం సంకల్పంలో లేదు. ఇది చెప్పకుండా పూజ చేసేవారు. శంకరాచార్యుల వారు మండనమిశ్రుని గెలిచిన తర్వాత కర్మ భాగమునందు ఒక కొత్త విషయం కలిసింది. మీరు ఏది చేసినా సంకల్పంలో….ప్రీత్యర్థం అని దేవత పేరు చెప్పి నీళ్ళు ముట్టుకుంటారు. ‘ఈ కర్మను నేను ఇప్పుడు ఈశ్వరానుగ్రహం కొరకు చేస్తున్నాను’. ఈ కర్మ చేస్తే ఫలితం వచ్చేస్తుందని కాదు. ఈ కర్మ చేస్తే ఈశ్వరుడు ప్రీతిచెంది ఫలితమును ఇవ్వాలి. ఈశ్వర ముఖంగా ఫలితం రావాలన్న జ్ఞానమును అంకురింపచేయడానికి సంకల్పమును శంకరాచార్యుల వారే అక్కడ మార్చారు. మండనమిశ్రుడు ఓడిపోయినతరువాతి నుండి అలా మారింది.

కనుక తుషాగ్నిప్రవేశం చేసిన గొప్ప అవతారం కుమారిలభట్టు అవతారం. ఆయన అవతారం రాబట్టే మనకి సనాతన ధర్మం మరల నిలబడే అవకాశం ఈ లోకమునందు కలిగింది. అంతటి మహోత్కృష్టమయిన అవతారం కుమారిలభట్టు అవతారం. ఎప్పుడెప్పుడు వేదం చేత ప్రతిపాదింపబడిన బ్రహ్మమును గూర్చిన ఆలోచనయందు వైక్లబ్యము కలుగుతుందో, వేదము ప్రమాణము కాదనే ఆలోచనలు ప్రబలుతాయో, అప్పుడు ముందుగా సుబ్రహ్మణ్యుడే అవతరిస్తూ ఉంటారు. రాక్షసులను సంహరించడం ఆయనకేమీ పెద్ద విషయం కాదు. లోకమునకు వైదికమయిన మార్గమును ప్రబోధం చేయవలసి వస్తే ఎప్పుడెప్పుడు ఎంతవరకు సమాజంలో బోధ జరిగితే తప్ప కుదరదో అంత గొప్ప బాధ్యతను ఆయన భుజాల మీదకు ఎత్తుకుంటారు. ఆయన మహాజ్ఞాని. ఆయన జ్ఞాన బోధ చేయగలరు. లోకం అంతాకూడా సనాతన ధర్మమును విడిచిపెట్టి నాస్తికము వైపు నడుస్తున్న రోజులలో ముందు కర్మనిష్ఠను చూపించడం కోసమని ఆయన కుమారిల భట్టు రూపంగా వచ్చారు. అంతే కర్మనిష్ఠతో చిట్టచివరకు ఆయన తుషాగ్ని ప్రవేశం చేసేశారు.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనము నుంచి…       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

పంబన్ స్వామిగళ్ – శ్రీ కుమారస్తవం (Pamban Swamigal – Kumarasthavam)

“పంబన్ గురుదాస స్వామిగళ్”, పంబన్ స్వామిగళ్ అనే పేరుతో ప్రసిద్ధుడు. అతను మహాకవి, శైవ మత గురువు. అతను సుబ్రహ్మణ్య స్వామి మహా భక్తుడు. సుబ్రహ్మణ్య స్వామి పట్ల ఇతని భక్తికి హద్దులు లేవు. అతను సుబ్రహ్మణ్య స్వామి మీద ఎన్నో కీర్తనలు రచించాడు. అందులో ఒకటి కుమారస్తవం.

“Pamban Gurudasa Swamigal”, is known by the name of Pamban Swamigal. He is the Great Saivite Poet. He is one of the greatest devotee of Subrahmanya Swamy. His devotion to Subrahmanya Swamy has knows no bounds. He wrote a number of Keertanas on Subrahmanya Swamy. One of them is Kumarasthavam.

స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click here to listen the Stotram):

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు: పంబన్ స్వామిగళ్ – శ్రీ కుమారస్తవం (Pamban Swamigal – Kumarasthavam)

ఓం షణ్ముఖ పతయే నమో నమః
ఓం షణ్మత పతయే నమో నమః
ఓం షట్-గ్రీవ పతయే నమో నమః
ఓం షట్-క్రీడ పతయే నమో నమః
ఓం షట్కోణ పతయే నమో నమః
ఓం షట్కోశ పతయే నమో నమః
ఓం నవనిధి పతయే నమో నమః
ఓం శుభనిధి పతయే నమో నమః
ఓం నరపతి పతయే నమో నమః
ఓం సురపతి పతయే నమో నమః    || 10 ||
ఓం నటశివ పతయే నమో నమః
ఓం షడక్షర పతయే నమో నమః
ఓం కవిరాజ పతయే నమో నమః
ఓం తపరాజ పతయే నమో నమః
ఓం ఇహపర పతయే నమో నమః
ఓం పుగళ్ముని పతయే నమో నమః
ఓం జయజయ పతయే నమో నమః
ఓం నయనయ పతయే నమో నమః
ఓం మంజుల పతయే నమో నమః
ఓం కుంజరీ పతయే నమో నమః    || 20 ||
ఓం వల్లీ పతయే నమో నమః
ఓం మల్ల పతయే నమో నమః
ఓం అస్త్ర పతయే నమో నమః
ఓం శస్త్ర పతయే నమో నమః
ఓం షష్ఠీ పతయే నమో నమః
ఓం ఇష్టీ పతయే నమో నమః
ఓం అభేద పతయే నమో నమః
ఓం సుభోద పతయే నమో నమః
ఓం వ్యూహ పతయే నమో నమః
ఓం మయూర పతయే నమో నమః    || 30 ||
ఓం భూత పతయే నమో నమః
ఓం వేద పతయే నమో నమః
ఓం పురాణ పతయే నమో నమః
ఓం ప్రాణ పతయే నమో నమః
ఓం భక్త పతయే నమో నమః
ఓం ముక్త పతయే నమో నమః
ఓం అకార పతయే నమో నమః
ఓం ఉకార పతయే నమో నమః
ఓం మకార పతయే నమో నమః
ఓం వికాస పతయే నమో నమః
ఓం ఆది పతయే నమో నమః
ఓం భూతి పతయే నమో నమః
ఓం అమార పతయే నమో నమః
ఓం కుమార పతయే నమో నమః    || 44 ||

Ōṁ ṣaṇmukha patayē namō namaḥ
ōṁ ṣaṇmata patayē namō namaḥ
ōṁ ṣaṭ-grīva patayē namō namaḥ
ōṁ ṣaṭ-krīḍa patayē namō namaḥ
ōṁ ṣaṭkōṇa patayē namō namaḥ
ōṁ ṣaṭkōśa patayē namō namaḥ
ōṁ navanidhi patayē namō namaḥ
ōṁ śubhanidhi patayē namō namaḥ
ōṁ narapati patayē namō namaḥ
ōṁ surapati patayē namō namaḥ    || 10 ||
ōṁ naṭaśiva patayē namō namaḥ
ōṁ ṣaḍakṣara patayē namō namaḥ
ōṁ kavirāja patayē namō namaḥ
ōṁ taparāja patayē namō namaḥ
ōṁ ihapara patayē namō namaḥ
ōṁ pugaḷmuni patayē namō namaḥ
ōṁ jayajaya patayē namō namaḥ
ōṁ nayanaya patayē namō namaḥ
ōṁ man̄jula patayē namō namaḥ
ōṁ kun̄jarī patayē namō namaḥ    || 20 ||
Ōṁ vallī patayē namō namaḥ
ōṁ malla patayē namō namaḥ
ōṁ astra patayē namō namaḥ
ōṁ śastra patayē namō namaḥ
ōṁ ṣaṣṭhī patayē namō namaḥ
ōṁ iṣṭī patayē namō namaḥ
ōṁ abhēda patayē namō namaḥ
ōṁ subhōda patayē namō namaḥ
ōṁ vyūha patayē namō namaḥ
ōṁ mayūra patayē namō namaḥ    || 30 ||
Ōṁ bhūta patayē namō namaḥ
ōṁ vēda patayē namō namaḥ
ōṁ purāṇa patayē namō namaḥ
ōṁ prāṇa patayē namō namaḥ
ōṁ bhakta patayē namō namaḥ
ōṁ mukta patayē namō namaḥ
ōṁ akāra patayē namō namaḥ
ōṁ ukāra patayē namō namaḥ
ōṁ makāra patayē namō namaḥ
ōṁ vikāsa patayē namō namaḥ
ōṁ ādi patayē namō namaḥ
ōṁ bhūti patayē namō namaḥ
ōṁ amāra patayē namō namaḥ
ōṁ kumāra patayē namō namaḥ    || 44 ||

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

www.marvelmurugan.com

శ్రీ స్కందలహరీ – శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతి (Sri Skanda Lahari – Sri Subrahmanya Trishathi)

శ్రీ స్కందలహరీ – శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతి (Sri Skanda Lahari – Sri Subrahmanya Trishathi) (Here is the link to Play MP3 from Raaga): శ్రీ స్కందలహరీ – శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతి (Sri Skanda Lahari – Sri Subrahmanya Trishathi)

శ్రియై భూయాః శ్రీమచ్ఛరవణభస్త్వం శివసుతః
ప్రియప్రాప్త్యై భూయాః ప్రతనగజవక్త్రస్య సహజ |
త్వయి ప్రేమోద్రేకాత్ ప్రకటవచసా స్తోతుమనసా
మయారబ్ధం స్తోతుం తదిదమనుమన్యస్వ భగవన్

Sriyai bhūyāḥ śrīmacchharavaṇabhastvaṁ śivasutaḥ
priyaprāptyai bhūyāḥ pratanagajavaktrasya sahaja |
tvayi prēmōdrēkāt prakaṭavachasā stōtumanasā
mayārabdhaṁ stōtuṁ tadidamanuman’yasva bhagavan     || 1 ||

నిరాబాధం రాజచ్ఛరదుదిత రాకాహిమకర
ప్రరూఢజ్యోత్స్నాభసితవదనషట్క స్త్రిణయనః |
పురః ప్రాదుర్భూయ స్ఫురతు కరుణాపూర్ణహృదయః
కరోతు స్వాస్థ్యం కమలదలబిందూపమహృది

Nirābādhaṁ rājacchharadudita rākāhimakara
prarūḍhajyōtsnābhasitavadanaṣaṭka striṇayanaḥ |
puraḥ prādurbhūya sphuratu karuṇāpūrṇahr̥dayaḥ
karōtu svāsthyaṁ kamaladalabindūpamahr̥di    || 2 |||

న లోకేఽన్యం దేవం నతజనకృతప్రత్యయవిధిం
విలోకే భీతానాం నిఖిలభయభీతైకశరణమ్ |
కలౌ కాలేఽప్యంతర్హరసి తిమిరం భాస్కర ఇవ
ప్రలుబ్ధానాం భోగేష్వపి నిఖిలభోగాన్వితరసి

Na lōkēఽn’yaṁ dēvaṁ natajanakr̥tapratyayavidhiṁ
vilōkē bhītānāṁ nikhilabhayabhītaikaśaraṇam |
kalau kālēఽpyantar’harasi timiraṁ bhāskara iva
pralubdhānāṁ bhōgēṣvapi nikhilabhōgānvitarasi    || 3 ||

శివ స్వామిన్ దేవ శ్రితకలుషనిశ్శేషణగురో
భవధ్వాంతధ్వంసే మిహిరశతకోటిప్రతిభట |
శివప్రాప్త్యై సమ్యక్ఫలితసదుపాయప్రకటన
ధ్రువం తత్కారుణ్యే కలిరపి కృతీ భూతవిభవః

śiva svāmin dēva śritakaluṣaniśśēṣaṇagurō
bhavadhvāntadhvansē mihiraśatakōṭipratibhaṭa |
śivaprāptyai samyakphalitasadupāyaprakaṭana
dhruvaṁ tatkāruṇyē kalirapi kr̥tī bhūtavibhavaḥ    || 4 ||

అశక్తానాం కర్మస్వపి నిఖిలనిశ్శ్రేయసకృతౌ
పశుత్వగ్రస్తానాం పతిరసి విపాశత్వకలనే |
ప్రశస్తానాం భూమ్నాం నిధిరసి నిరోద్ధా నిజశుచా-
మశక్తానాం కర్తా జగతి ధృతశక్తిః కిల భవాన్

Aśaktānāṁ karmasvapi nikhilaniśśrēyasakr̥tau
paśutvagrastānāṁ patirasi vipāśatvakalanē |
praśastānāṁ bhūmnāṁ nidhirasi nirōd’dhā nijaśuchā-
maśaktānāṁ kartā jagati dhr̥taśaktiḥ kila bhavān    || 5 ||

విషార్తానాం హర్తా విషయివిషయాణాం ఘటయితా
తృషార్తానాం కాలే పరమమృతవర్షీ ఘన ఇవ |
మృషాజ్ఞానార్తానాం నిఖిలవిచికిత్సాపరిహరో
విషగ్రస్తానాం త్వం సకలభయహర్తా విలససి

viṣārtānāṁ hartā viṣayiviṣayāṇāṁ ghaṭayitā
tr̥ṣārtānāṁ kālē paramamr̥tavarṣī ghana iva |
mr̥ṣājñānārtānāṁ nikhilavichikitsāpariharō
viṣagrastānāṁ tvaṁ sakalabhayahartā vilasasi    || 6 ||

రసాధిక్యం భక్తేరధికమధికం వర్ధయ విభో
ప్రసీద త్వం భూయః ప్రకటయ చిదానందలహరీమ్ |
అసారే సంసారే సదసతి నలిప్తం మమ మనః
కుసీదం భూయాన్మే కుశలవతి నిశ్శ్రేయసపథి

Rasādhikyaṁ bhaktēradhikamadhikaṁ vardhaya vibhō
prasīda tvaṁ bhūyaḥ prakaṭaya chidānandalaharīm |
asārē sansārē sadasati naliptaṁ mama manaḥ
kusīdaṁ bhūyānmē kuśalavati niśśrēyasapathi    || 7 ||

మహామోహారణ్యే విచరతి మనస్తన్నియమయ-
న్నహంతాం నిశ్శేషీకురు కరుణయా త్వం స్నపయ మామ్ |
మహీయో మాహాత్మ్యం తవ మనసమార్గే స్ఫురతు మే
మహస్త్సోమాకారే త్వయి మతిజుషి స్యాత్క్వను తమః

mahāmōhāraṇyē vicharati manastanniyamaya-
nnahantāṁ niśśēṣīkuru karuṇayā tvaṁ snapaya mām |
mahīyō māhātmyaṁ tava manasamārgē sphuratu mē
mahastsōmākārē tvayi matijuṣi syātkvanu tamaḥ    || 8 ||

వలక్షాభం స్నిగ్ధం వదనకమలేభ్యః ప్రసృమరం
మిలత్కారుణ్యార్ద్రం మృదితభువనార్తిస్మితమిదమ్ |
పులిందాపత్యస్య ప్రకటపులకోద్రేకజనకం
దలద్ధైన్యం భేదం హరతు సతతం నః సురగురోః

Valakṣābhaṁ snigdhaṁ vadanakamalēbhyaḥ prasr̥maraṁ
milatkāruṇyārdraṁ mr̥ditabhuvanārtismitamidam |
pulindāpatyasya prakaṭapulakōdrēkajanakaṁ
dalad’dhain’yaṁ bhēdaṁ haratu satataṁ naḥ suragurōḥ    || 9 ||

అతీతో బ్రహ్మాదీన్ కృతిముఖకృతః కారణపతీన్
క్షితిస్తోయం వహ్నిః మరుదసి వియత్తత్త్వమఖిలమ్ |
పతిః కృత్యానాం త్వం పరిణతచిదాత్మేక్షణవతాం
ధృతిస్త్వం వ్యాప్తస్సన్ దిశసి నిజసాయుజ్యపదవీమ్

Atītō brahmādīn kr̥timukhakr̥taḥ kāraṇapatīn
kṣitistōyaṁ vahniḥ marudasi viyattattvamakhilam |
patiḥ kr̥tyānāṁ tvaṁ pariṇatachidātmēkṣaṇavatāṁ
dhr̥tistvaṁ vyāptas’san diśasi nijasāyujyapadavīm    || 10 ||

సదాత్మా త్వచ్చిత్తః త్వదనుభవబుద్ధిస్మృతిపథః
త్వదాలోకస్సర్వం జగదిదమశేషం స్థిరచరమ్ |
సదా యోగీ సాక్షాద్భజతి తవ సారూప్యమమలం
త్వదాయత్తానాం కిం న హి సులభమష్టౌ చ విభవాః

Sadātmā tvacchhittaḥ tvadanubhavabud’dhismr̥tipathaḥ
tvadālōkas’sarvaṁ jagadidamaśēṣaṁ sthiracharam |
sadā yōgī sākṣādbhajati tava sārūpyamamalaṁ
tvadāyattānāṁ kiṁ na hi sulabhamaṣṭau cha vibhavāḥ    || 11 ||

కతి బ్రహ్మాణో వా కతి కమలనేత్రాః కతి హరాః
కతి బ్రహ్మాండానాం కతి చ శతకోటిష్వధికృతాః |
కృతాజ్ఞాస్సంతస్తే వివిధకృతిరక్షాభృతికరా
అతస్సర్వైశ్వర్యం తవ యదపరిచ్ఛేద్యవిభవమ్

Kati brahmāṇō vā kati kamalanētrāḥ kati harāḥ
kati brahmāṇḍānāṁ kati cha śatakōṭiṣvadhikr̥tāḥ |
kr̥tājñās’santastē vividhakr̥tirakṣābhr̥tikarā
atas’sarvaiśvaryaṁ tava yadaparicchhēdyavibhavam    || 12 ||

నమస్తే స్కందాయ త్రిదశపరిపాలాయ మహతే
నమః క్రౌంచాభిఖ్యాసురదలనదక్షాయ భవతే |
నమశ్శూరక్రూరత్రిదశరిపుదండాధ్వరకృతే
నమో భూయో భూయో నతికృదవనే జాగరవతే

Namastē skandāya tridaśaparipālāya mahatē
namaḥ kraun̄chābhikhyāsuradalanadakṣāya bhavatē |
namaśśūrakrūratridaśaripudaṇḍādhvarakr̥tē
namō bhūyō bhūyō natikr̥davanē jāgaravatē    || 13 ||

శివస్త్వం శక్తిస్త్వం తదుభయతమైక్యం పృథగసి
స్తవే ధ్యానే పూజాజపనియమముఖేష్వభిరతాః |
భువి స్థిత్వా భోగాన్ సుచిరముపభుజ్య ప్రముదితా
భవంతి త్వత్ స్థానే తదను పునరావృత్తివిముఖాః

Sivastvaṁ śaktistvaṁ tadubhayatamaikyaṁ pr̥thagasi
stavē dhyānē pūjājapaniyamamukhēṣvabhiratāḥ |
bhuvi sthitvā bhōgān suchiramupabhujya pramuditā
bhavanti tvat sthānē tadanu punarāvr̥ttivimukhāḥ    || 14 ||

గురోర్విద్యాం లబ్ధ్వా సకలభయహంత్రీం జపపరాః
పురశ్చర్యాముఖ్యక్రమవిధిజుషో ధ్యాననిపుణాః
ప్రతస్థైః కామస్థైరభిలషితవాంఛాం ప్రియభుజ-
శ్చిరం జీవన్ముక్తా జగతి విజయంతే సుకృతినః

Gurōrvidyāṁ labdhvā sakalabhayahantrīṁ japaparāḥ
puraścharyāmukhyakramavidhijuṣō dhyānanipuṇāḥ
pratasthaiḥ kāmasthairabhilaṣitavān̄chhāṁ priyabhuja-
śchiraṁ jīvanmuktā jagati vijayantē sukr̥tinaḥ    || 15 ||

శరజ్జ్యోత్స్నాశుభ్రం స్ఫటికనికురంబాభరుచిరం
స్ఫురన్ముక్తాహారం ధవళవసనం భావయతి వః |
ప్రరోహత్కారుణ్యామృతబహులధారాభిరభిత-
శ్చిరం సిక్తాత్మా వై స భవతి చ విచ్ఛిన్న నిగడః

Sarajjyōtsnāśubhraṁ sphaṭikanikurambābharuchiraṁ
sphuranmuktāhāraṁ dhavaḷavasanaṁ bhāvayati vaḥ |
prarōhatkāruṇyāmr̥tabahuladhārābhirabhita-
śchiraṁ siktātmā vai sa bhavati cha vicchhinna nigaḍaḥ    || 16 ||

వృథా కర్తుం దుష్టాన్వివిధవిషవేగాన్ శమయితుం
సుధారోచిష్కోటిప్రతిభటరుచిం భావయతి యః |
అధః కర్తుం సాక్షాద్భవతి వినతా సూనుమచిరా
ద్విధత్తే సర్పాణాం వివిధవిషదర్పాపహరణమ్

Vr̥thā kartuṁ duṣṭānvividhaviṣavēgān śamayituṁ
sudhārōchiṣkōṭipratibhaṭaruchiṁ bhāvayati yaḥ |
adhaḥ kartuṁ sākṣādbhavati vinatā sūnumachirā
dvidhattē sarpāṇāṁ vividhaviṣadarpāpaharaṇam    || 17 ||

ప్రవాలాభావూరే ప్రసరతి మహస్తే జగదిదం
దివం భూమిం కాష్ఠాస్సకలమపి సంచింతయతి యః |
ద్రవీకుర్యాచ్చేతస్త్రిదశనివహానామపి సుఖా-
ద్భువి స్త్రీణాం పుంసాం వశయతి తిరశ్చామపి మనః

Pravālābhāvūrē prasarati mahastē jagadidaṁ
divaṁ bhūmiṁ kāṣṭhās’sakalamapi san̄chintayati yaḥ |
dravīkuryācchhētastridaśanivahānāmapi sukhā-
dbhuvi strīṇāṁ punsāṁ vaśayati tiraśchāmapi manaḥ    || 18 ||

నవాంభోదశ్యామం మరకతమణిప్రఖ్యమథవా
భవంతం ధ్యాయేద్యో భవతి నిపుణో మోహనవిధౌ |
దివిష్ఠానాం భూమావపి వివిధదేశేషు వసతాం
నృణాం దేవానాం వా వియతి చరతాం పతగఫణినామ్

Navāmbhōdaśyāmaṁ marakatamaṇiprakhyamathavā
bhavantaṁ dhyāyēdyō bhavati nipuṇō mōhanavidhau |
diviṣṭhānāṁ bhūmāvapi vividhadēśēṣu vasatāṁ
nr̥ṇāṁ dēvānāṁ vā viyati charatāṁ patagaphaṇinām    || 19 ||

****** ఇతి స్కందలహరీ (This is the end of Sri Skanda Lahari) ******

        ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శంకర రచనలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు?

ఆదిశంకరుల రచనలను మూడు రకాలుగా విభజించవచ్చును. 1. భాష్యములు, 2. ప్రకరణ గ్రంథాలు, 3. స్తోత్రాలు.

మొదటిది వేదాంత, పురాణం ఇతిహాసాలను వివరించే గ్రంథాలు. ఇవి ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి, బ్రహ్మ విద్యను అభ్యసించాలనే కాంక్ష కలవారికి, సంస్కృత భాష చక్కగా అర్థమయ్యే వారికి అపరిమిత ఆనందాన్ని కలిగించే – ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, శ్రీ విష్ణు సహస్ర నామముల మీద రాసిన భాష్యాలు.

రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. వివేక చూడామణి, ఉపదేశ సాహస్రి, అపరోక్షానుభూతి, ఏక శ్లోకీ, పంచ శ్లోకీ, దశ శ్లోకీ, శత శ్లోకీ, మనీషా పంచకం, యతి పంచకం, సాధన పంచకం, ఆత్మ బోధ, నిర్వాణ శతకం, వాక్య సుధ, వాక్య వృత్తి, తత్త్వబోధ, సిధ్ధాంత తత్త్వబిందు మొదలైనవి. సౌందర్యలహరి, శివానందలహరులను ప్రకరణ గ్రంథాలుగాను చెప్తారు, అద్భుతమైన స్తోత్రాలుగాను చెప్తారు. సాక్షాత్తుగా శివపార్వతులను దర్శించిన తన్మయత్వంతో జగద్గురువుల చేత మనకు అనుగ్రహించబడిన అద్భుత గ్రంథాలివి.

మూడవది దేవతా స్తోత్రాలు. కనకధారా స్తోత్రం, శివ పంచాక్షరీ స్తోత్రం, భజగోవిందము, గోవిందాష్టకము, గణేశ పంచ రత్న స్తోత్రం, పాండురంగాష్టకము, శివ సువర్ణమాలా స్తోత్రము, అర్థనారీశ్వర స్తోత్రము, కాలభైరవాష్టకము, దక్షిణామూర్తి స్తోత్రము, నిర్వాణ షట్కము, అన్నపూర్ణాష్టకము, అచ్యుతాష్టకము, మహిషాసుర మర్దిని స్తోత్రము, శ్రీ త్రిపురసుందరీ స్తోత్రము, మీనాక్షీ పంచరత్న స్తోత్రం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, భవాన్యష్టకము, దేవీనవరత్నమాలికా, విశ్వనాథాష్టకము, ఉమామహేశ్వర స్తోత్రము, గంగాష్టకం, ఇలా ఎన్నో సామాన్య జనులకు జీవన దిశానిర్దేశము చేసే స్తుతులను రచించారు.

శ్రీ శంకరుల కవిత్వంలో భక్తి రసం పొంగుతుంది. వీరు జ్ఞాన,మోక్షాలను భక్తి తో మేళవించి బోధించారు.

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

Powered By Indic IME