https://www.clickmagick.com/share/1485142037427

శ్రీ సుబ్రహ్మణ్య పంచకం (Sri Subrahmanya Panchakam)

“శ్రీ సుబ్రహ్మణ్య పంచకం (Sri Subrahmanya Panchakam)” వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Stotram):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): శ్రీ సుబ్రహ్మణ్య పంచకం (Sri Subrahmanya Panchakam)


****** శ్రీ సుబ్రహ్మణ్య పంచకం (Sri Subrahmanya Panchakam) ******


అద్రిజాసుత నాయకం శివ వానరం య షడాననం
వందనీ కృత సుందరానన శంఖ దోషిత దింమయం
శూరపద్మ వినాశనం గజ సుందరీ ప్రియ షణ్ముఖం
వల్లీనాయక మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 1 ||

పంచ శాసన పుత్రరత్న పదాంబుజద్వయ శోభితం
ఫాలలోచన వహ్ని జాతక వారిజాక్ష స్మితాననం
రత్నయుక్త కిరీటినమ్ రవి భాసురం సుర వందితం
వల్లీనాయక మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 2 ||

మత్త వారణ వక్త్ర సోదర శైలజా సుత సుందరం
భక్త పూజిత ముక్తి దాయక కుక్కుట ధ్వజ వీజితం
దేవ శృంఖము నీశ్వ రాదిత హైమ కాంతి శరీరిణామ్‌
వల్లీనాయక మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 3 ||

వ్యాధ రాజస కం శివజాక్షజ పూరుషం శర జన్మకం
శైల దేశస సదా పరిస్థిత చారు హాసస సుఖస్థితం
చిత్ర రత్న కిరీటినమ్ వర సర్ప శృంగ విభూషణం
వల్లీనాయక మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 4 ||

వీరబాహు గణాశ్రిత ప్రద ముఖ్య భూసుర వందితం
వామదేవన కాత్మజా సుత భూపతిమ్ శివ షణ్ముఖం
తారకాసుర శంఖ నాశన దేవ యూధ సమావృతం
వల్లీనాయక మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 5 ||


  ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
  ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రమణ్య చాలీసా (Sri Subrahmanya Chalisa)

చాలీసా (Chalisa)

పాట (Song) : శ్రీ సుబ్రమణ్య చాలీసా (Sri Subrahmanyaswami Chalisa)
రచన (Lyrics): రాయంచ (Rayancha)
స్వరకర్త (Composer): శ్రీ ధనంజయ (Sri Baggam Dhananjaya)
పాడిన వారు (Sung By): శ్రీ అఖిల (Sri Akhila)

శ్రీ సుబ్రమణ్య చాలీసా (Sri Subrahmanya Chalisa) వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click here to listen the Sri Subrahmanya Chalisa): శ్రీ సుబ్రమణ్య చాలీసా (Sri Subrahmanya Chalisa)

శ్రీ సుబ్రమణ్య చాలీసా (Sri Subrahmanya Chalisa)(MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Sri Subrahmanya Chalisa): శ్రీ సుబ్రమణ్య చాలీసా (Sri Subrahmanya Chalisa)



       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య స్తుతి (Sri Kumara Stuti)

“శ్రీ సుబ్రహ్మణ్య స్తుతి (Sri Kumara Stuti)” వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Stotram):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): శ్రీ సుబ్రహ్మణ్య స్తుతి (Sri Kumara Stuti)


****** శ్రీ సుబ్రహ్మణ్య స్తుతి (Sri Kumara Stuti) ******


విప్ర ఉవాచ |

శృణు స్వామిన్‌ వచో మేద్య కష్టం మే వినివారయ | సర్వబ్రహ్మాండ నాథస్త్వ మతస్తే శరణం గతః
ఓ స్వామీ! నా మాటను వినుము. నాకిపుడు కలిగిన కష్టమును తొలగించుము. బ్రహ్మాండములన్నింటికీ ప్రభువు నీవే. అందువలననే నిన్ను శరణు జొచ్చితిని. || 1 ||

అజమేధాధ్వరం కర్తు మారంభం కృతవానహమ్‌ | సోజో గతో గృహాన్మే హి త్రోటయిత్వా స్వబంధనమ్‌

నేను వైదిక కర్మను చేయ నారంభించితిని. నా ఇంటి వద్ద నున్న మేక త్రాటిని తెంపుకొని పారిపోయినది. || 2 ||

న జానే స గతః కుత్రాన్వేషణం తత్కృతం బహు | న ప్రాప్తోతస్స బలవాన్‌ భంగో భవతి మే క్రతోః

అది ఎచటకు పోయినదో తెలియకున్నది. నేను చాలా వెదికితిని. కాని దొరకలేదు. దీనివలన నా క్రతువునకు పెద్ద ఆటంకము వాటిల్లినది. || 3 ||

త్వయి నాథే సతి విభో యజ్ఞభంగః కథం భవేత్‌ | విచార్యైవాఖిలేశాన కామం పూర్ణం కురుష్వమే

విభూ! నీవు ప్రభువై యుండగా యజ్ఞము భగ్నమగుట ఎట్లు సంభవము? ఓ అఖిలేశ్వరా! నీవు ఆలోచించి నా కోర్కెను పరిపూర్ణము చేయుము. || 4 ||

త్వాం విహాయ శరణ్యం కం యాయాం శివసుత ప్రభో | సర్వబ్రహ్మాండనాథం హి సర్వామరసుసేవితమ్‌

ఓ శివపుత్రా! ప్రభూ! బ్రహ్మాండములన్నింటికీ ప్రభువు, దేవతలందరిచే సేవింపబడువాడు అగు నిన్ను విడిచి నేను ఎవరిని శరణు పొందగలను?|| 5 ||

దీన బంధుర్దయాసింధుస్సుసేవ్యో భక్తవత్సలః | హరిబ్రహ్మాది దేవైశ్చ సుస్తుతః పరమేశ్వరః

నీవు దీనబంధుడవు. దయాసముద్రుడవు. సేవింపదగిన వాడవు. భక్తుల యందు ప్రేమ గలవాడవు. విష్ణుబ్రహ్మాది దేవతలచే స్తుతింపబడే పరమేశ్వరుడవు. || 6 ||

పార్వతీనందనస్స్కందః పరమేకః పరంతపః | పరమాత్మాత్మదస్స్వామీ సతాం చ శరణార్ధినామ్‌

పార్వతీ తనయుడవగు స్కందుడవు. అద్వయుడవు. శత్రువులను తపింప జేయువాడవు. పరమాత్మవు. శరణు గోరు సత్పురుషుల ఆత్మను రక్షించు స్వామివి. || 7 ||

దీనానాథ మహేశ శంకరసుత త్రైలోక్యనాథ ప్రభో మాయాధీశ సమాగతోస్మి శరణం మాం పాహి విప్రప్రియ | త్వం సర్వప్రభుప్రియాఖిల విద్‌ బ్రహ్మాది దేవైస్త్సు తః త్వం మాయాకృతి రాత్మ భక్త సుఖదో రక్షాపరో మాయికః

దీనుల ప్రభువగు మహేశ్వరా! శివపుత్రా! ముల్లోకములకు తండ్రియగు ప్రభూ! మాయను వశము చేసుకున్న వాడా! నిన్ను శరణు పొందితిని . విప్రులు నీకు ప్రియమైన వారు. నన్ను రక్షించుము. నీవు అందరికీ ప్రియుడగు ప్రభుడవు. నీవు సర్వజ్ఞుడవు. బ్రహ్మాది దేవతలు నిన్ను స్తుతించెదరు. మాయకు అధీశ్వరుడవగు నీవు మాయచే ఆకారమును దాల్చి, నీ భక్తులను రక్షించి సుఖముల నిచ్చుచున్నావు. || 8 ||

భక్తప్రాణగుణాకరస్త్రిగుణతో భిన్నోసి శంభుప్రియః శంభుశ్శంభు సుతః ప్రసన్నసుఖదస్సచ్చిత్స్వరూపో మహాన్‌ |
సర్వజ్ఞస్త్రి పురఘ్న శంకరసుతస్సత్ప్రేమవశ్యస్సదా షడ్వక్త్రః ప్రియసాధు రానతప్రియ స్సర్వేశ్వరశ్శంకరః ||
సాధుద్రోహకరఘ్న శంకరగురో బ్రహ్మాండనాథో ప్రభుః సర్వేషామమరాదిసేవితపదో మాంపాహి సేవాప్రియ

భక్తుల ప్రాణప్రియులైన వాడా! సద్గుణ నిలయుడవగు నీవు త్రిగుణాతీతుడవు. శంభునకు ప్రియచసుతుడవగు నీవు శంభు స్వరూపడవు. సచ్చిదానందరూపుడవగు నీవు ప్రసన్నుడవై సుఖములనిచ్చెదవు. త్రిపురారి యగు శంకరుని కుమారుడవగు నీవు సర్వము తెలిసిన వాడవు. పవిత్ర ప్రేమకు నీవు సర్వదా వశుడవై యుందువు. ఆరు మోములు గల నీకు సాధువులు, భక్తులు ప్రీతి పాత్రులు. సర్వేశ్వరుడవగు నీవు సుఖముల నిచ్చెదవు. సాధవులకు ద్రోహము చేయువారిని నీవు సంహరించెదవు. శంకరుడు నీ తండ్రి. నీవు బ్రహ్మాండములను పాలించు ప్రభుడవు. దేవతలు మొదలగు వారందరు నీ పాదములను సేవించెదరు. నీకు సేవ ప్రియమైనది. నన్ను రక్షించుము. || 9 ||

వైరిభయంకర శంకర జనశరణస్య వందే తవ పాదపద్మం సుఖకరణస్య | విజ్ఞప్తిం మమ కర్ణే స్కంద నిధేహి నిజభక్తిం జన చేతసి సదా విధేహి

శత్రువులకు భయమును కలిగించువాడా! శంకర స్వరూపా! జనులకు శరణునొసగి సుఖములనిచ్చే నీ పాదపద్మములకు నమస్కరించు చున్నాను. ఓ స్కందా! నా విన్నపమును నీ చెవిలో వేసుకొనుము. జనుల మనస్సులో నీ భక్తి సర్వదా ఉండునట్లు చేయుము. || 10 ||

కరోతి కిం తస్య బలీ విపక్షో దక్షోపి పక్షోభయపార్శ్వగుప్తః | కిం తక్షకోప్యామిష భక్తకో వా త్వం రక్షకో యస్య సదక్ష మానః

సర్వసమర్ధుడవగు నీవు ఎవనికి రక్షకుడవో, వానిని బలవంతుడు, సమర్ధుడు, రెండు పార్శ్యములయందు దృఢమగు రక్షణ నేర్పరుచుకున్నవాడు అగు శత్రువైననూ, తక్షకుడే అయిననూ, రాక్షసుడైననూ ఏమి చేయగలడు?.|| 11 ||

వివిధ గురురపి త్వాం స్తోతుమీశో నహి స్యాత్‌ కథమహం స్యాం మందబుద్ధి ర్వరార్చ్య | శుచిరశుచిరనార్యో యాదృశస్తాదృశో వా పదకమల పరాగం స్కంద తే ప్రార్థయామి
అనేక గురువులను శుశ్రూష చేసినవాడైననూ నిన్ను స్తుతింప సమర్ధుడు గాడు. మంద బుద్ది అగు నేను ఎట్లు స్తుతించగలను? గొప్ప వారిచే పూజింపబడే ఓ స్కందా! నేను శుచియైననూ, కాక పోయిననూ, ఎట్లున్ననూ, నీ పాదపద్మముల పరాగమును ప్రార్థించుచున్నాను. || 12 ||


హే సర్వేశ్వర భక్తవత్సల కృపాసింధో త్వదీయోస్మ్యహం భృత్యస్స్వస్య న సేవకస్య గణయస్యాగశ్శతం సత్ర్పభో| భక్తిం క్వాపి కృతాం మనాగపి విభో జానాసి భృత్యార్తిహా త్వత్తో నాస్త్యపరోవితా న భగవాన్‌ మత్తో నరః పామరః

ఓ సర్వేశ్వరా! భక్తవత్సలా! కరుణా సముద్రా! నేను నీ వాడను. సేవకుడను. ఓ మహాప్రభూ! నీ సేవకుని వంద తప్పులనైననూ నీవు లెక్కించవు. ఓ విభూ! భక్తుని అల్పమగు భక్తిని కూడా నీవు గుర్తించెదవు. నీవు భృత్యుల దుఃఖములను పోగొట్టెదవు. ఓ భగవాన్‌! నీ కంటె వేరుగా రక్షకుడు లేడు. నా కంటె ఎక్కువ మూర్ఖుడగు మానవుడు లేడు. || 13 ||


కల్యాణ కర్తా కలికల్మషఘ్నః కుబేర బంధుః కరుణార్ద్ర చిత్తః | త్రిషట్క నేత్రో రస వక్త్ర శోభీ యజ్ఞం ప్రపూర్ణం కురమే గుహ త్వమ్‌

ఓ గుహా! నీవు కల్యాణములనిచ్చి కలి దోషములను పోగొట్టెదవు. కుబేరుని బంధువగు నీ మనస్సు కరుణార్ద్రమై యుండును. మూడు ఆరుల నేత్రములతో, ఆరు ముఖములతో ప్రకాశించు నీవు నా యజ్ఞమును పూర్ణము చేయుము. || 14 ||


రక్షకస్త్వం త్రిలోకస్య శరణాగతవత్సలః | యజ్ఞ కర్తా యజ్ఞ భర్తా హరసే విఘ్న కారిణామ్‌

ముల్లోకములను రక్షించువాడువు, శరణుజొచ్చిన వారిని ప్రేమించువాడవు, యజ్ఞ కర్తవు, యజ్ఞమును రక్షించు వాడవు అగు నీవు యజ్ఞమునకు విఘ్నమును కలిగించు వారిని సంహరించెదవు. || 15 ||


విఘ్నవారణ సాధూనాం సర్గకారణ సర్వతః | పూర్ణం కురు మమేశాన సుత యజ్ఞ నమోస్తుతే

సాధువుల విఘ్నములను నివారించు వాడా! సర్వ సృష్టికి కారణమైనవాడా! ఈశాన పుత్రా! నా యజ్ఞమును పూర్ణము చేయుము. నీకు నమస్కారమగు గాక!.|| 16 ||


సర్వత్రాతా స్కంద హి త్వం సర్వ జ్ఞాతా త్వమేవ హి | సర్వేశ్వరస్త్వమీశానో నివేశసకలావనః

ఓ స్కందా! సర్వులను రక్షించునది నీవే. సర్వజ్ఞుడవు నీవే. సర్వేశ్వరుడవు నీవే. బ్రహ్మాండముల నన్నిటినీ పాలించునది నీవే. || 17 ||


సంగీతజ్ఞ స్త్వమేవాసి వేదవిజ్ఞః పరః ప్రభుః | సర్వస్థాతా విధాతా త్వం దేవదేవస్సతాం గతిః

సర్వమును సృష్టించి రక్షించునది నీవే. దేవ దేవుడవగు నీవే సత్పురుషులకు గతి. || 18 ||


భవాని నందన శ్శంభు తనయో వయునస్స్వరాట్‌ | ధ్యాతధ్యేయః పితౄణాం హి పితా యోనిస్సదాత్మనామ్‌

పార్వతీ పరమేశ్వరుల పుత్రుడవగు నీవు సర్వజ్ఞుడవు, ముల్లోకమలు కధిపతివి. ధ్యానము చేయువాడవు నీవే. ధ్యానింపబడేది నీవే. నీవు తండ్రులకు తండ్రివి. సత్పురుషులకు శరణ్యస్థానము నీవే. || 19 ||


ఇతి శ్రీ శివమహాపురాణే ద్వితియాయం రుద్ర సంహితాయాం చతుర్థే కుమారఖండే కుమారాద్భుత చరిత వర్ణణాం నామ షష్ఠోధ్యాయాంతర్గతం శ్రీ కుమార స్తుతి సంపూర్ణం.


       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

పఠన౦ (chanting) II ఓం ఓం శ్రీం హ్రీం వ్రీం సౌమ్ శరవణభవ (OM Shreem Hreem Vreem Soum Sharavanabhava)

పఠనం (Chanting)

మంత్రం (Mantram) – ఓం శ్రీం హ్రీం వ్రీం సౌమ్ శరవణభవ (OM Shreem Hreem Vreem Soum Sharavanabhava


“పఠన౦ (chanting) వినుటకు, మరియు డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి (Please click here to Listen & Download the MP3): ఓం ఓం శ్రీం హ్రీం వ్రీం సౌమ్ శరవణభవ (OM Shreem Hreem Vreem Soum Sharavanabhava:

Recent Posts

Archives

Categories

Recent Comments