Tag Archives:

స్వయంభువు సుబ్రహ్మణ్యుడి దర్శనభాగ్యం II నడిపూడి

తూర్పుగోదావరి జిల్లా అమాలాపురానికి సమీపంలోని నడిపూడిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రం ఉన్నది. ప్రాచీనకాలం నుంచి ఇక్కడ స్వయంభువు సుబ్రహ్మణ్య స్వామి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. గోదావరి నదీతీరంలో గల ఈ క్షేత్రానికి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామివారికి పూజాభిషేకాలు జరిపించి తరిస్తుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ క్షేత్రంలో తప్పనిసరిగా ఒక సర్పం భక్తులకు దర్శనమిస్తుందని చెబుతుంటారు.

ఆ రోజున తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్న భక్తులకు శిఖరంపై సర్పం దర్శనమిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు. స్వామియే సర్పరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నట్టుగా వాళ్లు విశ్వసిస్తుంటారు. ఇక్కడి స్వామిని దర్శించడం వలన సమస్త దోషాలు నశించి సకల శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. ఆ రోజున ఈ క్షేత్రంలో స్వామికి మొక్కుబడులు చెల్లించేవాళ్లను చూస్తే, స్వామి ఎంతటి మహిమాన్వితుడో అర్థమైపోతుంది. ఈ క్షేత్రంలో అడుగుపెట్టినవాళ్లు స్వామి అనుగ్రహాన్ని పొందకుండా వెనుదిరగరని స్పష్టమైపోతుంది.

స్థల పురాణం…

దక్షిణాపదములో వశిష్ట గోదావరీ నదీ తీరములో శతాబ్దాల క్రితం అనగా బ్రిటీష్ ప్రభుత్వంలో కాటన్ దొర బ్యారేజి కట్టని క్రితం ఈ ప్రదేశంలో వశిష్ట గోదావరీ నది పరవళ్లు త్రొక్కుతూ ప్రవహిస్తూ ఉండేది. పురాణ ప్రసిద్ధి చెందిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు నాశికా త్రయంబకం నుండి గోదావరీ నదిలో ప్రయాణం చేస్తూ ఋషుల తపస్సులు, పండితుల వేదం ఘోషలతో నిత్యము విరాజిల్లుతున్న ఈ గోదావరీ నది ఒడ్డుకు స్వామి వారు చేరుకున్నారు. పిదప శ్రీ స్వామి వారు ఒక భక్తునికి స్వప్నములో కనిపించి తనకి గ్రామోత్సవము జరిపించి, గ్రామోత్సవము జరిపించిన ఆ పల్లకి ఎక్కడ స్థిరముగా ఆగిపోతుందో అక్కడ తనని ప్రతిష్టించమని ఆజ్ఞాపించారు. స్వామి వారి కోరిక ప్రకారం అరటి దొప్పలతో పల్లకి తయారు చేసి స్వామి వారిని గ్రామములో ఉరేగించి, పల్లకి ఆగిన చోట ఆలయలము గ్రామస్తులు నిర్మించారు. అప్పటి నుండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు స్వయంభువునిగా ఈ ఆలయం నందు కొలువై ఉన్నారు.

భక్తులు కోరినంత మాత్రమునే వారికి ఆయు ఆరోగ్యములు, సంతతి, సకల ఐశ్వర్యములు కలుగజేయును. సంతానలేమితో బాధపడుతోన్నవారికీ, చర్మసంబంధమైన వ్యాధులతో సతమతమైపోతున్నవారికీ, నాగదోషాలతోను, గ్రహ సంబంధమైన దోషాలతోను బాధలుపడుతోన్నవారికి, విద్యలో అభివృద్ధిని సాధించలేకపోతున్నవారికి కూడా శ్రీ స్వామి వారిని దర్శించి పూజించినంత మాత్రమునే వారి దోషములు అన్నియు తొలగిపోతాయి. ఇది అంతయూ స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్ర మహత్యం.

స్వయంభువుగా వెలసిన స్వామి క్షేత్రం లోక ప్రసిద్ధి చెందినది. స్వామి వారికి తూర్పు వైపున ద్వారబందము లోపల స్వామి పుట్ట ఉన్నది. ఇది ఎవరు నిర్మాణము చేసినది కాదు. స్వామి వారు ఈ పుట్టలో నిత్యము ఉంటారని భక్తుల నమ్మకం. ఈ పుట్టను దర్శనము చేసుకొనుటకు అద్దము ఏర్పాటు చేయబడినది. ప్రతి సంవత్సరం వచ్చే గోదావరీ నది ప్రవాహ వేగమునకు నది-పూడి ఏర్పడిన ఈ గ్రామము కాలక్రమేణా నడుపూడిగా వ్యవహారములోనికి వచ్చియున్నది. 1973 సంవత్సరంలో ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమము, శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట జరిగినది.

శ్రీ స్వామి వారికి జరుగు విశేష కార్యక్రములు…

1. నిత్యము స్వామి వారికి అభిషేకము, కళ్యాణము జరుగును.
2. మార్గశిర శుద్ధ పంచమి రోజు రాత్రి స్వామి వారి కళ్యాణం.
3. మార్గశిర శుద్ధ షష్ఠి రోజు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి, రధోత్సవం, తిరునాళ్లు జరుగును.
4. మార్గశిర శుద్ధ సప్తమి రోజు రాత్రి స్వామి వారి కళ్యాణం.
5. మార్గశిర శుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజు స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం.
6. ఆషాడ మాస శుద్ధ షష్ఠి రోజు కుమార షష్ఠి.
7. మాఘ శుద్ధ షష్ఠి రోజు స్వామి వారికి విశేష అభిషేకములు జరుగును.
8. కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి రోజు స్వామి వారికి పాలాభిషేకములు జరుగును.
9. కార్తీక శుద్ధ షష్ఠి, స్కంద షష్ఠి రోజు స్వామి వారికి విశేష అభిషేకములు జరుగును.

ఎక్కడ ఉన్నది?

1. నడిపూడికి రావులపాలెం, పెనుగొండ, తణుకు నుంచి బస్సు మరియు ఆటో సౌకర్యం ఉంది.
2. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లు: తణుకు , తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, రాజమండ్రి.
3. దగ్గరలో దేశీయ విమానాశ్రయము రాజమండ్రి.

       ****** శ్రీ స్వామి వారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

ప్రణవం


వేదాలకు పునాది అనాది ప్రణవనాదం. లోకాలన్నీ ప్రణవం నుంచే ప్రభవించాయంటారు. పరమేశ్వరుడు ప్రణవ మంత్రాసీనుడై భాసిస్తుంటాడని, సంసార సముద్రాన్ని దాటించగల ఏకైకనాదం ప్రణవమని చెబుతారు. ‘ఓంకారం ఎప్పటికీ నశించని నాదం. ఓంకారమే ఈ సకల విశ్వం. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఓంకారమే. కాల తీరాలకు ఆవల కూడా నిత్యమై ధ్వనించేది ఓంకారమే. ఈ విశ్వమంతా పరబ్రహ్మ స్వరూపమే. మనలోని పరమాత్మ ప్రణవనాదమే’ అని మాండూక్యోపనిషత్తు విస్పష్టంగా ప్రవచించింది.

ఆద్య మంత్రం ఓంకారం బ్రహ్మానికి ప్రతీక. ఓంకారంపై ధ్యానం చేస్తే అంతిమ సత్య సాక్షాత్కారం సాధ్యమవుతుందని పెద్దల మాట. ప్రణవ ధ్యానం ఒక అవిచ్ఛిన్న కాంతిధారగా పరాత్పరుడివైపు ప్రసరిస్తుంది. ఓంకారాన్ని జపించడంవల్ల మృణ్మయ శరీర భూమిక నుంచి ఆత్మ పరమోన్నత లక్ష్యంవైపు ప్రయాణిస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు బోధించాడు.

ఒకసారి ‘ప్రణవ మంత్రానికి అర్థం నాకు తెలియదు’ అని బ్రహ్మ అన్నప్పుడు అక్కడే ఉన్న షణ్ముఖుడు ఆయన్ని కటకటాల వెనక బంధించాడు. తనకు వేదాల్లోని జ్ఞానమంతా తెలుసు, కాని ప్రణవ మంత్రానికి పరిపూర్ణ అర్థం తెలియదని బ్రహ్మ అన్నాడు సవినయంగా. మహోన్నత జ్ఞానసిద్ధిని పొందినవారు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు కొంతవరకు.

బ్రహ్మను కారాగారంలో బంధించి షణ్ముఖుడు సృష్టి చేయడానికి ఉపక్రమిస్తాడు. శివుడు షణ్ముఖుణ్ని వారించి, ఎక్కువ కాలం బ్రహ్మను కారాగారంలో ఉంచరాదని, విడుదల చేయాలని నచ్చజెప్పాడు. ‘కారాగారం గోడల మధ్య ఎలాంటి భావాలు నీకు కలిగాయి’ అని శివుడు బ్రహ్మను అడుగుతాడు. కారాగారం తపస్సు చేయడానికి అనువైన చోటుగా భావించానని బ్రహ్మ సమాధానం ఇస్తాడు. శివుడు షణ్ముఖుణ్ని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ‘ప్రణవమంటే అర్థం ఏమిటో నువ్వు చెప్పు’ అని అడుగుతాడు. ‘నీకు రహస్యంగా చెవిలో చెబుతాను’ అని షణ్ముఖుడు అంటాడు.

‘ప్రణవం మహిమ వర్ణనాతీతం. కర్మబంధాల నుంచి విముక్తం పొందడానికే ఆత్మలు భూమిపై జన్మలు ఎత్తుతున్నాయి. ఈ జీవన చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. చివరికి భగవంతుణ్ని తెలుసుకుని ముక్తి పొందేవారు జీవులు. దైవం ప్రణయానంతరం సృష్టి చేయాలని సంకల్పించినప్పుడు, ఓంకారం వినిపిస్తుందంటారు. సమస్త దేవతలకు, లోకాలకు, ఆత్మలకు మూలం ప్రణవమే!’

ప్రణవనాద సుధారసమే భువనమోహనమైన రామావతారమై దిగివచ్చిందని త్యాగయ్య గానం చేశాడు. ‘నాదాల్లో ప్రణవనాదాన్ని నేను’ అని శ్రీకృష్ణుడు తెలియజెప్పాడు. గణపతి ఓంకార రూపంతో ప్రకాశిస్తాడు. ‘ప్రణవమే ధనుస్సు. ఆత్మే బాణం. బ్రహ్మమే లక్ష్యం. గురి తప్పకుండా ఆత్మ లక్ష్యాన్ని చేరాలి. బాణం లక్ష్యాన్ని ఛేదించినట్లు ఆత్మ బ్రహ్మంలో లీనం కావాలి’ అని ఒక ఉపనిషత్తు గానం చేసింది.

భూమాత గర్భంనుంచి, తల్లి గర్భం నుంచి జన్మించానని భావిస్తున్న జీవాత్మ మొదట పరమాత్మనుంచే ప్రభవించింది. ఆత్మ ఆది ప్రణవమే. అది నిత్య కాంతి ధామం. యుగాల పరిణామం అనంతరం అటువైపే ఆత్మ మహాప్రస్థానం.

సంకష్టహరుడు…

పరబ్రహ్మ సంకల్పం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడు విఘ్నాలొచ్చాయి. మామూలుగా ఏ పని చేసినా విఘ్నాలు వస్తాయి. అలాంటిది సృష్టిరచన వంటి గొప్ప పనికి విఘ్నాలు రాకుండా ఉంటాయా? విఘ్నాలు వచ్చాయి. ఆ విఘ్నాలు వచ్చినపుడు ఏం చేయాలో తెలియలేదు బ్రహ్మదేవుడికి. అప్పుడాయన తనకు కూడా మూలకారణమైన పరమాత్మని ధ్యానం చేశాడు. ఆ పరమాత్మని తెలియచేసే నాదం ఓంకారం. ఆ ఓంకారాన్ని జపిస్తూ పరమాత్మని ధ్యానం చేయగా..ఆ ఓంకార వాచ్యమైన పరమాత్మ…ఓ రూపం ధరించి బ్రహ్మదేవుడికి సాక్షాత్కరించాడు. ఓంకారమే రూపం ధరించి కనపడిన రూపం ఎలా ఉన్నదీ అంటే ఏనుగు ముఖంతో ప్రకాశిస్తూ ఎర్రని కాంతులతో ఉన్నదట. ఆ రూపం బ్రహ్మదేవుడికి సాక్షాత్కరించి ఓ మంత్రం ఉపదేశించింది.ఆ మంత్రం పేరు ‘వక్రతుండ మంత్రం. ‘వక్రతుండ’ అంటే వంకర తుండం కలిగినవాడు. స్వామి రూపం అలా ఉంది కనుక స్వామి మంత్రం ‘వక్రతుండ మంత్రం’అయింది. ఈ మంత్రం జపం చేశాడు బ్రహ్మదేవుడు. అపుడు ఏం జరిగింది అంటే విఘ్నాలు అన్నీ తొలగిపోయాయి.బ్రహ్మదేవుడి సృష్టిరచన సమర్థంగా సాగింది.

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

శ్రీ సుబ్రహ్మణ్య మంగళ స్తోత్రం (Sri Subrahmanya Mangala stotram)

“శ్రీ సుబ్రహ్మణ్య మంగళ స్తోత్రమ్” వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click here to listen the Stotram):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): శ్రీ సుబ్రహ్మణ్య మంగళ స్తోత్రమ్ (Sri Subrahmanya Mangala stotram)


ఓం మంగళం దేవదేవాయ రాజరాజాయ మంగళం
మంగళం నాథనాథాయ కాలకాలాయ మంగళం.

Ōṁ maṅgaḷaṁ dēvadēvāya rājarājāya maṅgaḷaṁ
maṅgaḷaṁ nāthanāthāya kālakālāya maṅgaḷaṁ.    || 1 ||

మంగళం కార్తికేయాయ గంగాపుత్రాయ మంగళం
మంగళం జిష్ణుజేశాయ వల్లీనాథాయ మంగళం.

maṅgaḷaṁ kārtikēyāya gaṅgaputrāya maṅgaḷaṁ
maṅgaḷaṁ jiṣṇujēśāya vallīnāthāya maṅgaḷaṁ.    || 2 ||

మంగళం శంభుపుత్రాయ జయంతీశాయ మంగళం
మంగళం సుకుమారాయ సుబ్రహ్మణ్యాయ మంగళం.

maṅgaḷaṁ śambhuputrāya jayantīśāya maṅgaḷaṁ
maṅgaḷaṁ sukumārāya subrahmaṇyāya maṅgaḷaṁ.  || 3 ||

మంగళం తారకజితే గణనాథాయ మంగళం
మంగళం శక్తిహస్తాయ వహ్నిజాతాయ మంగళం.

maṅgaḷaṁ tārakajitē gaṇanāthāya maṅgaḷaṁ
maṅgaḷaṁ śaktihastāya vahnijātāya maṅgaḷaṁ.  || 4 ||

మంగళం బాహులేయాయ మహాసేనాయ మంగళం
మంగళం స్వామినాథాయ మంగళం శరజన్మనే.

maṅgaḷaṁ bāhulēyāya mahāsēnāya maṅgaḷaṁ
maṅgaḷaṁ svāmināthāya maṅgaḷaṁ śarajanmanē.    || 5 ||

అష్టనేత్రపురీశాయ షణ్ముఖాయాస్తు మంగళం
కమలాసనవాగీశ వరదాయాస్తు మంగళం.

Aṣṭanētrapurīśāya ṣaṇmukhāyāstu maṅgaḷaṁ
kamalāsanavāgīśa varadāyāstu maṅgaḷaṁ.    || 6 ||

శ్రీ గౌరీగర్భజాతాయ శ్రీకంఠ తనయాయచ
శ్రీ కాంత భాగినేయాయ శ్రీ మత్ స్కందాయ మంగళం.

śrī gaurīgarbhajātāya śrīkaṇṭha tanayāya
śrī kānta bhāginēyāya śrī mat skandāya maṅgaḷaṁ.  || 7 ||

శ్రీ వల్లీ రమణాపాద శ్రీ కుమారాయ మంగళం
శ్రీ దేవసేనా కాంతాయ శ్రీ విశాఖాయ మంగళం.

śrī vallī ramaṇāyātha śrī kumārāya maṅgaḷaṁ
śrī dēvasēnā kāntāya śrī viśākhāya maṅgaḷaṁ.    || 8 ||

మంగళం పుణ్యరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం
మంగళం పుణ్యయశసే మంగళం పుణ్యతేజసే.
maṅgaḷaṁ puṇyarūpāya puṇyaślōkāya maṅgaḷaṁ
maṅgaḷaṁ puṇyayaśasē maṅgaḷaṁ puṇyatējasē.    || 9 ||

      ****** ఇతి శ్రీ సుబ్రహ్మణ్య మంగళ స్తోత్రం సంపూర్ణం (This is the end of Sri Subrahmanya Mangala stotram) ******

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

       ****** sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ శివ ప్రదక్షిణ విధానము?

మీరు శివాలయంకి వెళ్ళినపుడు అన్ని ఆలయాలకి చేసిన విధంగానే ప్రదక్షిణ చేస్తున్నారా? ఇకపై అలా చేయకండి…

శివుడికి ప్రదక్షిణ చేయటం అంటే ప్రణవం చేయటం లాంటిది. అత్యంత విశిష్టమయినది. శివ మహా పురాణంలో శివుడికి అభిషేకం చేసి, మహా నివేదన చేసి , హారతి ఇచ్చిన తరువాత అపరాదాన్ని క్షమించమని ప్రదక్షిణ చేయాలి. 108 సార్లు ప్రదక్షిణ చేస్తే శివుడు సంతుష్టుడు అవుతాడు. సకల పాపాల్ని తుడిచేయగల ఫలితం ప్రదక్షిణ ఇస్తుంది. ప్రణవం చేయటం వలన , ఓంకారం చేయటం వలన ఎలాంటి పుణ్యం వస్తుందో అలాంటి పుణ్యం కేవలం శివుడికి ప్రదక్షిణ వలన వస్తుంది. శివుడికి ప్రదక్షిణ చేయటం వలన షోడసోపచార పూజ చేసిన పుణ్యం వస్తుంది. సకల పూజ చేయలేని వారు శివుడికి ప్రదక్షిణ చేయడం వలన అనంతమయిన పుణ్యం వస్తుంది.

అలాగే చాలా మంది ఏ దేవాలయంలో అయిన తెలియక చేసే పొరపాటు గర్భగుడి వెనుక భాగాన్ని తాకి నమస్కారం చేస్తారు. అలా చేయకూడదు. గర్భగుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారు వారిని నిద్ర లేపినట్లు అవుతుంది తాకితే. మరో విషయం ఏమిటంటే, విగ్రహనికి ఎదురుగా నిలబడి ఏ దేవుడు లేదా దేవత దర్శనం చేసుకోకూడదు. ఎందుకంటే విగ్రహం నుండి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి. వాటి శక్తి మనం భరించలేం కనుక ప్రక్కన నిలబడి దర్శనం చేసుకోవాలని పెద్దలు చెప్తారు.

ప్రాణ కళారూప ధరుడు పశుపతి. ఆయన “నీలలోహితుడు” అని తాంత్రికం చెబుతోంది. అంటే, ప్రాణరూపమైన పాశంతో జీవుల్ని కట్టివేస్తున్నవాడు. పశుపతి పంచ ముఖుడు. నాలుగు ముఖాలు నాలుగు దిక్కుల్లో ఉంటాయి. అయిదోది ఆ నాలుగింటి పైనా ఉంటుంది. తూర్పు ముఖం తత్పురుషం. పశ్చిమ ముఖం సద్యోజాతం. ఉత్తర ముఖం వామదేవం. దక్షిణంలో ఉండేది అఘోరం. పైన కనిపించేది ఈశానం. శ్రీదక్షిణామూర్తి విజ్ఞానమయ రూపుడు. కళారూపమైన వాక్కుకు ఆ భూతేశుడే ఆధారప్రాయుడు.

శివాలయంలో గృహస్తు ప్రదక్షిణ ఏవిదంగా చేయాలి?…



1. శివాలయంలో ధ్వజస్థంభం వద్ద ప్రదక్షిణ ప్రారంభించి, ధ్వజస్థంభం నుండి చండీశ్వరుని వరకూ ప్రదక్షిణ చేసి చండీశ్వరుని వద్దకు వెళ్ళి నమస్కరించవలెను.
2. అక్కడ నుండి మళ్లీ వెనక్కి తిరిగి ధ్వజస్థంభం దగ్గరకు వచ్చి ఒక్క క్షణం ఆగి మరలా ప్రదక్షిణ మొదలు పెట్టి సోమసూత్రం (అభిషేక జలం బయటకు పోవు దారి) వరకు వరకు వెళ్ళవలెను.
3. తిరిగి ధ్వజస్థంభం దగ్గరకు వద్దకు వచ్చి నమస్కరించుకొని (అలా వస్తే ఒక్క ప్రదక్షిణ పూర్తి అవుతుంది) చండీశ్వరుని చేరవలెను.
4. మరల ధ్వజస్తంభము మీదుగా (మధ్యలో ఆగకుండా) సోమసూత్రమును చేరవలెను.
5. అదే విధంగా, ధ్వజస్తంభము మీదుగా (మధ్యలో ఆగకుండా) చండీశ్వరుని చేరి నమస్కరించవలెను.
6. మరల, ధ్వజస్తంభము వద్దకు వచ్చి నమస్కరించుకోనిన ప్రదక్షిణ పూర్తి యగును.
ధ్వజస్తంభము లేని యడల, నందీశ్వరుని నుండి ఈ ప్రదక్షిణ చేయవచ్చును. ఈవిదంగా చేసే ప్రదక్షిణకే చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని పేరు.

శివ ప్రదక్షిణలో సోమసూత్రం దాటరాదు ఎందుకంటే ఆయనకు అభిషేకం చేసిన జలం సోమసూత్రం నుండి పోతుంది. అంతేకాక అక్కడ ప్రమధగణాలు కొలువై ఉంటారు. అందుకే వారిని దాటితే శివుని కోపానికి గురి అవుతారు. ఈ విధంగా చేసే ప్రదక్షిణం సాధారణంగా చేసే పది వేల ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడింది. ఇలా మూడు ప్రదక్షిణలు చేయాలి. అయితే నందికి శివునికి మధ్యలో నడవకూడదు ఎందుకంటే సదా ఆయన చూపులు శివుని మీదే ఉంటాయి. ఏ పూజలు చేయలేనివారు ఎన్ని ప్రదక్షిణలు చేస్తే అంత పాపాలని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఈ జన్మలో పూర్వజన్మలో చేసిన పాపాలని కూడా మనం ప్రదక్షిణలు చేయడం ద్వారా పరిహరించుకోవచ్చు. ప్రదక్షిణ చేసేటప్పుడు మన అడుగుల చప్పుడు వినపడకూడదు, అంత నెమ్మదిగా చెయ్యాలి.

శివాలయంలో బ్రహ్మచారి ప్రదక్షిణ ఏవిదంగా చేయాలి?…

బ్రహ్మచారి సోమసూత్రం దాటవచ్చును కాబట్టి ఎడమ ప్రక్కన నుంచి మొదలు పెట్టి గుండ్రంగా ప్రదక్షిణ చేసి శివునికి ఎదురుగా రావాలి.

శివాలయంలో సన్యాసి ప్రదక్షిణ ఏవిదంగా చేయాలి?…

సన్యాసి కుడి ప్రక్కనుంచి మొదలు పెట్టి పూర్ణ ప్రదిక్షణ చెయ్యాలి.

పురాణగాథ…

పుష్పదంతుడు అనబడే ఒక గంధర్వుడు ఉండేవాడు. ఆయనకు ఒక అలవాటు ఉండేది. రోజూ ఈశ్వరుడిని అనేక రకాల పువ్వులతో పూజించేవాడు. ఆయన వేరువేరు తోటల నుంచి పువ్వులును దొంగతనంగా సేకరించేవాడు. అలా రోజూ ఒక రాజుగారి తోటలోని పూలను దొంగతనంగా కోసుకుని వెళ్ళేవాడు. ఆ రాజు ఎలా అయినా దొంగని పట్టుకోవాలి అనుకున్నాడు. తోటకి కాపలాగా భటులను పెట్టాడు. రాత్రిపూట వాళ్ళు చూస్తుండగానే పువ్వులు మాయమయ్యేవి. ఆ విషయం భటులు రాజుగారికి చెప్పారు, అదివిన్న రాజు ఇది ఖచ్చితంగా మానవుల పనికాదని ఎవరో “మాయావి” కావాలని చేస్తున్న పని అని అర్ధమైనది. “శివనిర్మాల్యం తొక్కితే ఎంతటి దివ్యశక్తి అయినా నశించిపోతుంది” అని తెలిసిన ఆ రాజు శివునికి పూజ చేసిన పువ్వులను తెప్పించి, ఆ తోట మొత్తం చల్లించాడు.

అది తెలియక పుష్పదంతుడు యధావిధిగా పువ్వుల కోసం తోటలోకి వెళ్ళాడు. అక్కడ చల్లిన శివ- నిర్మాల్యాన్ని తెలియక తొక్కాడు. అప్పుడు ఆయనకు ఉన్న దివ్యత్వం పోయి సాధారణ మానవునిగా భటుల కళ్ళకు కనిపించాడు. పుష్పదంతుడిని బంధించి రాజుగారి దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అప్పుడు పుష్పదంతుడు ఎంతో గొప్పది, శక్తివంతమైన “శివమహిమ్న స్తోత్రము” చేశాడు. విశేష ప్రాచుర్యం పొందిన శివస్త్రోత్రాల్లో శివ మహిమ్నస్తోత్రమ్ ఒకటి. అప్పుడు పుష్పదంతుడి దివ్యత్వం తిరిగివచ్చి గంధర్వుడిగా మారి రాజుని క్షమాపణ కోరి తనలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. శివమహిమ్న స్తోత్రమ్ 31 శ్లోకాల చిన్న స్తోత్రమే కానీ, చాలా ప్రసిద్ధి పొందింది. ‘మహిమ్నః’ అనే శ్లోకంలో మొదలవుతుంది కనుక, దీన్ని శివమహిమ్న స్తోత్రం అని అంటారు.

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనము నుంచి…

video
play-sharp-fill

శ్రీ రమణ మహర్షి ఉపదేశ సారము (Sri Ramana Maharshi Upadesa Saram)

భగవాన్ రమణులు స్వహస్తాలతో తెలుగులోకి అనువదించిన “ఉపదేశ సారం” ఎందరో ముముక్షువులకు మార్గదర్శకము. అంతర్ముఖులై నివృత్తి మార్గములో ప్రయాణిస్తున్న సాధకులకు అనేక మార్గాలుగా కనిపించే ఉపదేశాల సారాన్ని కరుణామూర్తి రమణ మహర్షి ఉపదేశ సారః అని సంస్కృతంలో 30 లలిత వృత్తాల్లో చెప్పి దానినే తెలుగు లోకి అనుభూతి సారం గా అనువదించారు.

Sri Ramana’s Upadesa Saram providing a ‘modern day’ document of benefit to all spiritual seekers. Upadesa Saram was chosen as the first book to be updated because of its important signifigance and its clear explanation of Ramana Maharishi’s core teachings. The story of Upadesa Saram originates with the famous Tamil poet, Muruganar. Muruganar was composing a poem about a group of ancient ascetics who were performing rituals in the Daruka Forest in order to obtain special powers to fulfill their worldly desires. They believed that Karma Yoga was the highest path towards liberation. Lord Shiva, seeing their ignorance, manifested in Daruka Forest to offer them the right instruction (upadesa) in order to achieve liberation. Once Muruganar reached this point in his poem, he realized that he did not possess the knowledge to explain Lord Shiva’s teaching to the ascetics. Only Muruganar’s guru, Sri Ramana, possessed that knowledge being himself an embodiment of Lord Shiva. Muruganar then prayed to Sri Ramana to reveal the essence of the teachings that he had himself given to the ascetics in Daruka Forest. In response, Sri Ramana produced the Tamil text Upadesa Unidyar, which he then translated into Sanskrit as Upadesa Saram.

స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click here to listen the Stotram):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): శ్రీ రమణ మహర్షి ఉపదేశ సారము (Sri Ramana Maharshi Upadesa Saram)

UPADESA SARAM II SRI RAMANA MAHARSHI II PDF

UPADESA SARAM ENG II SRI RAMANA MAHARSHI

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** ఓం సర్వం శ్రీ రమణార్పణమస్తు ******

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******