Tag Archives:

శ్రీ సుబ్రహ్మణ్య మఙ్గళాష్టకం (Sri Subrahmanya Mangalashtakam)

స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Stotram):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Stotram): శ్రీ సుబ్రహ్మణ్య మఙ్గళాష్టకం (Sri Subrahmanya Mangalashtakam)

శివయోస్తనుజాయాస్తు శ్రితమన్దారశాఖినే ।
శిఖివర్యతురంగాయ సుబ్రహ్మణ్యాయ మఙ్గళం.

Śivayōstanujāyāstu śritamandāraśākhinē
śikhivaryaturaṅgāya subrahmaṇyāya maṅgaḷaṁ.   || 1 ||

భక్తాభీష్టప్రదాయాస్తు భవరోగవినాశినే ।
రాజాధిరాజ వన్ద్యాయ రణధీరాయ మఙ్గళం.

Bhaktābhīṣṭapradāyāstu bhavarōgavināśinē
rājādhirāja vandyāya raṇadhīrāya maṅgaḷaṁ.  || 2 ||

శూరపద్మాది దైతేయ తమిస్రకులభానవే ।
తారకాసురకాలాయ బాలకాయాస్తు మఙ్గళం.

Śūrapadmādi daitēya tamisrakulabhānavē
tārakāsurakālāya bālakāyāstu maṅgaḷaṁ.    || 3 ||

వల్లీవదనరాజీవ మధుపాయ మహాత్మనే ।
ఉల్లసన్మణి కోటీర భాసురాయాస్తు మఙ్గళం.

Vallīvadanarājīva madhupāya mahātmanē
ullasanmaṇi kōṭīra bhāsurāyāstu maṅgaḷaṁ.  || 4 ||

కన్దర్పకోటిలావణ్యనిధయే కామదాయినే ।
కులిశాయుధహస్తాయ కుమారాయాస్తు మఙ్గళం.

Kandarpakōṭilāvaṇyanidhayē kāmadāyinē
kuliśāyudhahastāya kumārāyāstu maṅgaḷaṁ.   || 5 ||

ముక్తాహారలసత్కంఠ రాజయే ముక్తిదాయినే ।
దేవసేనాసమేతాయ దైవతాయాస్తు మఙ్గళం.

Muktāhāralasatkaṇṭha rājayē muktidāyinē
dēvasēnāsamētāya daivatāyāstu maṅgaḷaṁ.    || 6 ||

కనకాంబర సంశోభికటయే కలిహారిణే ।
కమలాపతివన్ద్యాయ కార్తికేయాయ మఙ్గళం.

Kanakāmbara sanśōbhikaṭayē kalihāriṇē
kamalāpativandyāya kārtikēyāya maṅgaḷaṁ.    || 7 ||

శరకాననజాతాయ శూరాయ శుభదాయినే ।
శీతాభానుసమాశ్రాయ శరణ్యాయాస్తు మఙ్గళం.

Śarakānanajātāya śūrāya śubhadāyinē।
śītābhānusamāśrāya śaraṇyāyāstu maṅgaḷaṁ.    || 8 ||

****** ఇతి శ్రీ సుబ్రహ్మణ్య మఙ్గళాష్టకం స౦పూర్ణం ******

****** This is the end of Sri Subrahmanya Mangalashtakam ******

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

పరమపావన పుణ్యక్షేత్రం – మోపిదేవి

దక్షిణభారత దేశంలోని షణ్ముఖుని దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా భాసిల్లుతోంది కృష్ణాజిల్లా మోపిదేవి శ్రీవల్లిదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానం. స్కాందపురాణంలోని సహ్యాద్రిఖండంలో కృష్ణానదీ మహాత్మ్యము, ఇతర క్షేత్రములను వివరించు సందర్భంలో ప్రస్తావించబడిన ప్రముఖ క్షేత్రమైన మోపిదేవి క్షేత్ర విశేషాలు …

వారణాసిని వీడిన అగస్త్యుడు:

అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరిస్థితుల్లో లోకక్షేమానికై కాశీని వీడి రావలిసివచ్చింది. వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి, ఆకాశంలోకి చొచ్చుకొని పోయి, సూర్య మండలాన్ని దాటి నిలిచిపోయింది. ఫలితంగా సూర్యగమనం ఆగిపోయి ప్రకృతి స్తంభించిపోయింది. గ్రహసంచారములు నిలిచిపోయాయి. ప్రజలు పీడితులయ్యారు. భూమి చలించిపోయింది. దేవలోకం గడగడలాడింది. ఈ మహోపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్య మహర్షి మాత్రమేనని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్య మహర్షికి, విషయాన్ని వివరించారు.

యోగదృష్టితో సర్వము తిలకించిన మహర్షి తాను ఇప్పుడు కాశీని వీడితే కల్పాంతమైనా తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని తెలిసి కూడా లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరించారు. లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. దారిలో నున్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరించింది. తాను మరలి వచ్చేవరకు అలాగే ఉండమని శాసించి, కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసులో నిలుపుకొని, దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు. మునిశక్తికి పర్వతం బయపడి అలాగే ఉండిపోయింది.

పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరంలోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. కనకదుర్గామాతను, శ్రీకాకుళాంద్ర మహావిష్ణువుని దర్శించుకొని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు.‘వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్‌ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్‌’ అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది. ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయన ననుసరించారు. ఒకపుట్ట నుండి దివ్యతేజస్సుని గమనించి ఇదే సుబ్రమణ్య క్షేత్రమని, ఇది భుక్తి ముక్తి ఫలప్రదమని శిష్యులకు వివరించాడు అగస్త్యుడు. కుమారమూర్తికే సుబ్రమణ్యమనెడి పేరని మాండమ్యడనే శిష్యుని సందేహాన్ని నివృత్తి చేశాడు.

కుమారస్వామి ఉరగరూపంతో తపస్సు:

తెలియక చేసిన అల్పదోష నివారణార్ధం కుమారస్వామి ఉరగరూపం ధరించి తపస్సు చేయవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ కారణాన్ని ఈ విధంగా శిష్యులకు వివరిం చారు అగస్య్త మహర్షి. సనక, సనకస, సనత్కుమార సనత్సు జాతులనెడి దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారు గానే ఉంటారు, పైగా దిగంబరులు. వారు నిరంతరం భగవదారాధనలోనే కాలం గడుపుతుంటారు. వారు ఒక పర్యాయం పరమేశ్వర దర్శనానికి కైలాసం చేరుకున్నారు. ఆ సమయంలో పరమేశ్వరుడు కైలాసంలో లేడు. లోకమాత పార్వతి, కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు.

అదేసమయంలో శచీ, స్వాహా మొదలైన వేల్పు పడుచులు, లక్ష్మీ, సరస్వతులు, పార్వతీదేవి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు రంగు రంగుల వస్త్రాలు ఆభరణాలతో సుందరీమణులను చూచి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోయాడు. పార్వతీదేవి ‘‘కుమారా! ఏల నవ్వుచున్నావు? వారు నేనులా కన్పించలేదా? ఆ తాపసులు మీ తండ్రివలే లేరా? భేదమేమైననూ కన్పించినదా?’’ అని ప్రశ్నించినది. ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన పశ్చాత్తాప పడినాడు. తల్లి పాదాలపైబడి క్షమాపణ కోరుకున్నాడు. తల్లి కాదన్న వినకుండా పాపపరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపంతో తపస్సు ప్రారంభించాడు.

ఈ విషయాన్నంతటిని దివ్యదృష్టితో చూచి శిష్యుల కెరింగించిన అగస్త్యుడు మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. పడగ వలే ఉండే శివలింగాన్ని దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు. ‘అత్రస్నానంతు కుర్యాచ్చేత్కోటి జన్మాఘ నాశనమ్‌’ అని కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్రతో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి. అగస్త్యమహర్షి అంతటి తపస్విచే నిరూపించబడినది కావుననే ఈ ప్రదేశమునకు కుమార క్షేత్రముగా ప్రతీతి చెందినది. ఆ కాలములో మహర్షులెందరో ఈ మూర్తిని ఆరాధించినట్ట్లు చరిత్ర చెబుతోంది. కుమారుడు అనగా చిన్నవాడు. ఆయన రూపం ఎప్పుడు పంచవర్ష ప్రాయం. అట్టి సుబ్రహ్మణ్యమూర్తి నివసించుటచే ఈ క్షేత్రం కుమార క్షేత్రమైనది.

స్థల పురాణం:

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం లోని మూలమూర్తి స్వయంభూలింగం. వీరరపు పర్వతాలు అనే కుమ్మరి శివభక్తుని భక్తికి మెచ్చి శివుడు కలలో కనిపించి మోపిదేవి గ్రామం లోని చీమలపుట్టను త్రవ్వి తన లింగాన్ని బయల్పరచమని ఆదేశించాడు. పర్వతాలు తన కల గురించి గ్రామస్థులకు తెలియజేసి కలలో కనిపించిన ప్రదేశంలో చీమలపుట్టను త్రవ్వి బయల్పడిన లింగాన్ని ఆ చీమలపుట్టపైనే ప్రతిష్ఠించి గ్రామస్తులు పూజించడం ప్రారంభించారు. పర్వతాలు గుఱ్ఱము, నంది, కోడి మరియు గరుత్మంతుని విగ్రహాలను బంకమన్నుతో తయారుచేసాడు. మహాఋషుల విగ్రహాలను కూడా బంకమన్నుతో తయారుచేసి బట్టీలో కాల్చి కలకాలం చెక్కుచెదరకుండా తీర్చిదిద్దాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చల్లపల్లి జమిందారీ కుటుంబం యొక్క ఇలవేల్పు. ఇప్పటికీ వీరి ఆధ్వర్య౦లోనే ఆలయ నిర్వహణ కొనసాగుతున్నది.

క్షేత్ర విశిష్టత:

స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానమట్టం. స్వామికి వేరే పానమట్టం ఉండదు. పానమట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన, అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోయడం జరుగుతుంది. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్టనుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామి వారి ఆలయంలో పుట్టలో పాలుపోయడం విశేషసేవగా భక్తులు భావిస్తారు. సంతానం లేనివారికి సంతానం కలిగించడం, చూపు మందగించిన వారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం, మనోవ్యాధి, చర్మసంబంధ వ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు. స్వామి వారి ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీర్రమొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించుకుంటారు. పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలు.

స్వామి వారికి జరుగు విశేషపూజలు:

స్వామి వారికి పర్వదినాల్లో మహన్యాసపూర్వక రుదభ్రిషేకంతో పాటు ప్రత్యేక అర్చనలు జరుగుతాయి. భక్తులు స్వామివారికి శాంతికళ్యాణం జరిపిస్తారు. స్వామి వారికి వైదిక స్మార్త ఆగమబద్దవిదంగా పూజ విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉగాది పర్వ దినం, శ్రావణార్చనము, దసరాలో శమీపూజ, కార్తీక దీపారాధనలు, ఆరుద్రోత్సవము, నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్టిలకు విశేష అర్చనలు జరుగుతాయి. మాఘమాసంలో కల్యాణమహోత్సవం, రధోత్సవం, వసంతోత్సవం వైభవంగా జరుగుతాయి. రాహుకేతు దోషనివారణకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఎక్కడ ఉన్నది?

రోడ్ మరియు రైలు ద్వారా:

కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండల కేంద్రం మచిలీపట్టణానికి 35 కి.మీ.ల దూరంలోనూ, గుంటూరు జిల్లా రేపల్లెకు 8 కి.మీ.ల దూరంలోనూ, విజయవాడకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అతి సమీపంలోని రైల్వేష్టేషన్‌ రేపల్లె. బస్సులు విజయవాడ, మచిలీపట్టణ౦ మరియు గుంటూరు నుండి అందుబాటులో కలవు. ఇక్కడ ఉండటానికి ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు లేవు. దేవాలయములోనే విశ్రాంతి తీసుకోవాలి. హోటల్స్ కానీ, ఇతర లాడ్జి సౌకర్యంకాని లేవు. గ్రామీణ స్థాయి కాఫీ హోటల్స్ మాత్రమే ఉంటాయి. సమీపంలోని రేపల్లె, అవనిగడ్డ ప్రాంతాల్లో మాత్రమే కొద్దిపాటి లాడ్జీలు కలవు.

గాలి ద్వారా:

దగ్గరి దేశీయ విమానాశ్రయం విజయవాడ. ఇది 63 కిలో మీటర్ల దూరంలో ఉంది.

       ****** శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: మోపిదేవి – శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయం

శ్రీ సుబ్రహ్మణ్య ధ్యానం (Sri Subrahmanya Dhyanam)

పఠనం (Chanting)

స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Dhyanam):

ధ్యానం (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Dhyanam): శ్రీ సుబ్రహ్మణ్య ధ్యానం (Sri Subrahmanya Dhyanam)

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

బిక్కవోలు సుబ్రహ్మణ్య దేవాలయం


1100 సంవత్సలముల చరిత్ర కలిగిన బిక్కవోలు అతి ప్రాచీన శైవ క్షేత్రములలో ఒకటి, గోదావరి తీర మండలం, రాజమహేంద్రవరము, కాకినాడ కెనాల్ రోడ్డు ప్రక్కన ఉన్న బిక్కవోలు గొప్ప ఆధ్యాత్మిక చారిత్రాత్మక విశేషాలతో తూర్పు చాళుక్యల శిల్పకళా వైభవంతో నిర్మించబడిన అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందినది.

ఈ ఆలయాన్ని చాళుక్య రాజులలో ఒకరైన విజయాదిత్య III 849 – 892 సెంచరీ AD లో నిర్మించారు. ఈ క్షేత్రం మొదట చాళుక్య విక్షముని పేరిట విక్షమపురంగాను, కాలగమనంలో బిక్కవోలుగా నామాంతరం చెందినది.

ఈ పవిత్ర దేవాలయము శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయములో ఉన్నది. శ్రీ కుమార సుబ్రాహ్మణ్యస్వామి వారు దక్షిణముగా కొలువుదీరి ఉన్నారు. అలాగే, ఇక్కడ పార్వతి, విజయ గణపతి, భద్రకాళి మరియు వీరభద్ర స్వామి ఆలయాలు గమనించవచ్చు. ఆలయలములో నెమలి వాహనం స్వామి విగ్రహం ముందు ఉంటుంది.

శ్రీ కుమార సుబ్రాహ్మణ్యస్వామి వారు బ్రహ్మచారిగా కొలవబడుచున్నారు. ఈ స్వామి అత్యoత తేజస్సు కలిగి చతుర్భుజుడై అభయ ముద్రలో దర్శనం ఇవ్వడం విశేషం. పై రెండు చేతులలో దండం, పాశం ఉంటాయి. ఇక క్రింద కుడి చేతిలో అభయమిస్తున్న స్వామి ఎడమ చేతిని తన నెమలి వాహనం పై ఉంచడం జరిగినది. స్వామి వారికి కుడి వైపున సహజ సిద్ధమైన పుట్టఉన్నది. ప్రతిరోజు రాత్రి పళ్లెంలో పాలు పోసి ఈ పుట్టవద్ద ఉంచడం ఈ ఆలయ సంప్రదాయం.

శ్రీ కుమార స్వామి పళనిలోవలే దక్షిణ ముఖంగా, బ్రహ్మచారిగా కొలువై ఉన్నందున ఈ స్వామిని దర్శించి అభిషేకములు జరిపించినంతనే విశ్వాధిపతి అయిన స్వామి అనుగ్రహం వలన సకల గ్రహశాంతి కలిగి, కోరిన కోర్కెలు నెరవేరడం ఇక్కడ విశేషం. ప్రత్యేకించి రాహు, కేతు, కుజగ్రహశాంతిని కోరి జరిపించే దోష నివారణ పూజలు వలన అనేక మందికి వివాహ సిద్ధి, సంతానం, నష్టాలు మరియు శారీరక ఈతి బాధల నుండి పరిహారం లభిస్తుంది అని ప్రజల నమ్మకం.

ఈ ఆలయాన్ని దర్శించడం వలన అన్నిoటా విజయం లభిస్తుంది అని భక్తుల ప్రధాన విశ్వాసం. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజున శ్రీ కుమార స్వామి వారి షష్ఠి మహోత్సవములు అత్యంత వైభవముగా జరుపబడతాయి. ఆ రోజున సంతానం లేని మహిళలు పుట్టపై ఉంచిన నాగుల చీర ధరించి స్వామి వారి వైపు శిరస్సు ఉంచి నిద్రించడం వలన సంతానవంతులు అవుతారు అని ప్రగాఢ నమ్మకం.

ఎలా చేరుకోవాలి?

రోడ్డు మార్గము:

1. సామర్లకోట, కాకినాడ, పిఠాపురం, రాజమండ్రి నుండి బస్సులు అందుబాటులో కలవు.

రైలు మార్గము:

1. సామర్లకోట రైల్వే స్టేషన్ నుండి 17 కిలో మీటర్ల దూరంలో ఉంది.
2. కాకినాడ రైల్వే స్టేషన్ నుండి 31 కిలో మీటర్ల దూరంలో ఉంది.
3. పిఠాపురం రైల్వే స్టేషన్ నుండి 31 కిలో మీటర్ల దూరంలో ఉంది.
4. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి 34 కిలో మీటర్ల దూరంలో ఉంది.

విమాన మార్గము:

1. దగ్గరి దేశీయ విమానాశ్రయం రాజమండ్రి. ఇది 40 కిలో మీటర్ల దూరంలో ఉంది.
2. దగ్గరి అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నం. ఇది 173 కిలో మీటర్ల దూరంలో ఉంది.


       ****** శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

బిక్కవోలు సుబ్రమణ్య స్వామి – నిజరూప దర్శనం



శ్రీ సుబ్రహ్మణ్య స్తుతి (Śrī Subrahmaṇya Stuti) II గాంగేయం (gāṅgēyaṁ)

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): గాంగేయం (gāṅgēyaṁ) || Subrahmaṇya Stuti)



గాంగేయం వహ్నిగర్భం శరవణజనితం జ్ఞానశక్తి౦ కుమారం
సుబ్రహ్మణ్యం సురేశం గుహమచలభిదం రుద్రతేజస్వరూపం
సేనాన్యం తారకఘ్నం గజముఖ సహజం కార్తికేయం షడాస్యం
సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథసహితం దేవదేవం నమామి ||

gāṅgēyaṁ vahnigarbhaṁ śaravaṇajanitaṁ jñānaśaktim kumāraṁ
subrahmaṇyaṁ surēśaṁ guhamachalabhidaṁ rudratējasvarūpaṁ
sēnān’yaṁ tārakaghnaṁ gajamukha sahajaṁ kārtikēyaṁ ṣaḍāsyaṁ
subrahmaṇyaṁ mayūradhvaja rathasahitaṁ dēvadēvaṁ namāmi ||


గంగాదేవి శివుని శక్తిని కొంత సేపు మోసి, శక్తిని భరించ లేక రెల్లు గడ్డిలోకి త్రోయటంవలన గాంగేయుడు అని, అగ్ని శివుని శక్తిని తన వద్ద ఉంచుకొని గంగలో విడుచుట వలన అగ్నిగర్భుడని, జ్ఞాన శక్తి పరబ్రహ్మమని, గుహుడని, అమలమైన గుణము కలవాడని, రుద్రుని తేజస్స్వరూపమని, దేవతల సేనాపతియని, తారకాసురిని చంపిన వాడని, జ్ఞానానికి నిధియై గురు స్వరూపమని, అచలమైన బుద్ధి కలవాడని, రెల్లు గడ్డి నందు పుట్టినందువలన శరవణభవుడని, ఆరుముఖములు ఉండుట వలన షడాననుడు అని, నెమలిని అధిరోహించినందువలన మయూరధ్వజుడని, రథముని అధిరోహించిన వాడు అని ఈ ధ్యాన శ్లోకము ద్వారా ప్రార్ధించబడినాడు.

as he carried gangadevi and lord shiva’s power for sometime and then he threw them into kansgrass because he could not bear such power he was called as Gangeya, as he kept the power of Agni Shiva with himself and later left the power in ganga he was called Agnigharbudu, for the power of knowledge he was called Parabrahma, also known by various names as Guhudu, someone whose possessed impeccable character, he is the righteous form of Rudra’s charisma, he is the commander (warlord) of gods, he is the one to end evil Tarakasura, he is the treasure of knowledge and image of guru, he is known for firm wit, as he is born in kansgrass he is called Saravanabhava, he is called Shadanana for his form with six faces, he is known as Mayuradwaja as he climbed on to a peacock thus he is praised and prayed for in this slokha.

        ****** ఇది బిక్కవోలు ఆలయములోని గర్భ గుడి మీద వ్రాసినది. ******
        ****** It is written on the sanctum in the temple of Bikkavol. ******

        ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******