[A rare hymn on Lord Skanda in Shiva Purana (Kailasa Samhita, Chatper 11 titled Vamadeva Brahma Varnanam) created by Sri Vamadeva.]
ఓం నమ: ప్రణవార్థాయ ప్రణవార్థ విధాయినే
ప్రణవాక్షర బీజాయ ప్రణవాయ నమో నమ:
Ōṁ nama: Praṇavārthāya praṇavārtha vidhāyinē
praṇavākṣara bījāya praṇavāya namō nama: || 1 ||
ఓం.ఓంకారము యొక్క అర్థము అయినవాడు, ఓంకారముయొక్క అర్థమును బోధించువాడు, ఓంకారములోని బీజాక్షరస్వరూపుడు, ఓంకారస్వరూపుడు అగు స్కందునకు అనేక నమస్కారములు
Om Salutations to God who is the meaning of Pranava (Om),
To the one who explained the meaning of Pranava,
To the one who is the root of the letters of Pranava,
Salutations and salutations to the Pranava (Om).
వేదాంతార్థ స్వరూపాయ వేదాంతార్థ విధాయినే
వేదాంతార్థవిదే నిత్యం విదితాయ నమో నమ:
Vēdāntārtha svarūpāya vēdāntārtha vidhāyinē
vēdāntārthavidē nityaṁ viditāya namō nama: || 2 ||
వేదాంతముచే తాత్పర్యభూతముగా ప్రతిపాదింపబడే స్వరూపము గల వాడు, వేదాంతతాత్పర్యమును బోధించువాడు, వేదాంతతాత్పర్యమును తెలిసినవాడు, నిత్యము మహాత్ములచే తెలియబడువాడు అగు స్కందునకు అనేకనమస్కారములు
Salutations to God who is the meaning of Vedantha (Philosophy),
To the one who caused Vedantha, Who follows Vedantha,
Salutation and salutations to one who daily understands it.
నమో గుహ్యాయ భూతానాం గుహాసు నిహితాయ చ
గుహ్యాయ గుహ్యరూపాయ, గుహ్యాగమవిదే నమ:
Namō guhyāya bhūtānāṁ guhāsu nihitāya cha
guhyāya guhyarūpāya, guhyāgamavidē nama: || 3 ||
ప్రాణుల బుద్ధియందు చైతన్యరూపముగా విలసిల్లువాడు, సర్వులచే తెలియబడని వాడు, రహస్యమగు స్వరూపము గలవాడు, రహస్యమగు శాస్త్రములనెరింగనవాడు అగు గుహునకు నమస్కారము
Salutations to Guha among all beings,
Who emerged himself from the cave,
Who has form which is hidden and secret of secrets,
And who was the one who explained the hidden Vedas.
అణోరణీయసే తుభ్యం మహతోపి మహీయసే
నమ: పరావ(ప) రజ్ఞాయ పరమాత్మ స్వరూపిణే
Aṇōraṇīyasē tubhyaṁ mahatōpi mahīyasē
nama: Parāva(pa) rajñāya paramātma svarūpiṇē || 4 ||
అతిసూక్ష్మమైన దానికంటె సూక్ష్మమైనవాడు, మిక్కిలి పెద్ద దారికంటె పెద్దవాడు, కార్యకారణములనెరింగినవాడు,పరమాత్మస్వరూపుడు అగు నీకు నమస్కారము
Oh smaller than the smallest, greater than the greatest,
Salutations to him who is known to all and who has the form of divine soul.
స్కందాయ స్కందరూపాయ మహితారుణ తేజసే
నమో మందారమాలోద్యన్ముకుటాది భృతే సదా
Skandāya skandarūpāya mahitāruṇa tējasē
namō mandāramālōdyanmukuṭādi bhr̥tē sadā || 5 ||
సూర్యుని వలె ఎర్రని కాంతి గలవాడు, సర్వదా మందారమాలతో ప్రకాశించే కిరీటము మొదలగు వాటిని ధరించినవాడు అగు స్కందుని రూపములోనున్న శివునకు నమస్కారము
Oh Skanda who has the form of a king, who shines like the sun at dawn,
Salutations to him who wears garland of Mandhara flowers,
And who also wears crown and other ornaments always.
శివశిష్యాయ పుత్రాయ శివస్య శివదాయినే
శివప్రియాయ శివయోరానందనిధయే నమ:
śivaśiṣyāya putrāya śivasya śivadāyinē
śivapriyāya śivayōrānandanidhayē nama: || 6 ||
శివునకు శిష్యుడు, శివుని పుత్రుడు, మంగళములనిచ్చువాడు, శివునకు ప్రియమైనవాడు, పార్వతీపరమేశ్వరులకు ఆనందనిధానమైనవాడు అగు కుమారస్వామికి నమస్కారము
Disciple of Shiva, son of Shiva, One who gave peace to Lord Shiva,
Darling of Shiva, salutation to the treasure of joy of Lord Shiva.
గాంగేయాయ నమస్తుభ్యం కార్తికేయాయ ధీమతే
ఉమాపుత్రాయ మహతే శరకాననశాయినే
Gāṅgēyāya namastubhyaṁ kārtikēyāya dhīmatē
umāputrāya mahatē śarakānanaśāyinē || 7 ||
గంగాపుత్రుడు, కృత్తికల పుత్రుడు, బుద్ధిశాలి, పార్వతీపుత్రుడు, గొప్పవాడు, రెల్లు గడ్డియందు జన్మించినవాడు అగు నీకు నమస్కారము
Salutations to son of Ganga, the very wise Karthikeya,
Son of Parvathi, the great one who rested after removing head of Brahma.
షడక్షర శరీరాయ షడ్విధాధ్వా విధాయినే
షడధ్వాతీత రూపాయ షణ్ముఖాయ నమో నమ:
ṣaḍakṣara śarīrāya ṣaḍvidhādhvā vidhāyinē
ṣaḍadhvātīta rūpāya ṣaṇmukhāya namō nama: || 8 ||
ఆరు అక్షరముల మంత్రమే శరీరముగా గలవాడు, ఆరు విధముల జ్ఞానమును బోధించువాడు, ఆరు మార్గములకు అతీతమైన రూపము గలవాడు, ఆరు ముఖములు గలవాడు అగు కుమారస్వామికి నమస్కారము
Oh Good whose body is made of six letters, Oh God who brought six type of arrangements,
Oh God who was born in six forms, salutations to the six faced one.
ద్వాదశాయుత నేత్రాయ ద్వాదశోద్యత బాహవే
ద్వాదశాయుధధారాయ ద్వాదశాత్మన్నమోస్తుతే
Dvādaśāyuta nētrāya dvādaśōdyata bāhavē
dvādaśāyudhadhārāya dvādaśātmannamōstutē || 9 ||
ద్వాదశాదిత్యుల రూపములో వెలుగొందు వాడా! పన్నెండు నిడివి కన్నులు గలవాడు, పైకి ఎత్తి పెట్టిన పన్నెండు బాహువులలో పన్నెండు ఆయుధములను దాల్చిన వాడు అగు నీకు నమస్కారము అగుగాక!
Oh God with twelve eyes, Oh God with twelve great hands,
Oh God who carries twelve weapons, Salutations to the one who has twelve forms.
చతుర్భుజాయ శాంతాయ శక్తి కుక్కుటధారణే
వరదాయ విహస్తాయ నమో సురవిదారిణే
chaturbhujāya śāntāya śakti kukkuṭadhāraṇē
varadāya vihastāya namō suravidāriṇē || 10 ||
నాలుగు భుజములు గలవాడు, శాంతస్వరూపుడు, రాక్షసులను సంహరించినవాడు అగు కుమారస్వామికి నమస్కారము
Oh God with four hands, Oh God who carries a cock as well as Shakthi,
Oh God who blesses, Oh learned God, salutations to the killer of asuras.
గజవల్లీ కుచాలిప్త కుంకుమాకింత వక్షసే
నమో గజాననానంద మహిమానందితాత్మనే
gajavallī kuchālipta kuṅkumākinta vakṣasē
namō gajānanānanda mahimānanditātmanē || 11 ||
గజవల్లియొక్క కుచములయందలి కుంకుమచే ఎర్రనైన వక్షఃస్థలము గలవాడు, విఘ్నేశ్వరుని మహిమలను మరియు ఆనందమును చూచి ఉప్పొంగే మనస్సు గలవాడు అగు కుమారస్వామికి నమస్కారము
Oh God who joined with Valli due to an elephant, Oh God with saffron coated chest,
Salutations to him who is the soul of joy and fame to the elephant.
బ్రహ్మాది దేవముని కిన్నర గీయమాన
గాధావిశేషశుచి చింతిత కీర్తిధామ్నె
brahmādi dēvamuni kinnara gīyamāna
gādhāviśēṣaśuchi chintita kīrtidhāmne || 12 ||
బ్రహ్మమొదలగు దేవతలు మునులు కిన్నరులు అను వారిచే గానము చేయబడే గాథలయందు విశేషముగా కీర్తింపబడిన పవిత్రత మరియు కీర్తి అను వాటికి నివాసస్థానమైన వాడవు!
Oh God who is sung about by Brahma, devas, sages and Kinnaras,
Oh God who asuras fame to those who greatly think of your stories
బృందారకమల కిరీట విభూషణస్రక్
పూజాభిరామ పదపంకజ తే నమోస్తుతే
Br̥ndārakamala kirīṭa vibhūṣaṇasrak
pūjābhirāma padapaṅkaja tē namōstutē || 13 ||
దేవతల స్వచ్ఛమైన కిరీటములయందలి అలంకారమాలలచే పూజింపబడే సుందరమైన పద్మములవంటి పాదములు గలవాడవు అగు నీకు నమస్కారమగు గాక!
Who decorates himself with groups of lotus as his crown,
We salute your lotus like feet which are worshipful and pretty
ఫలశ్రుతి: ఇతి స్కందస్తవం దివ్యం వామదేవేన భాషితం |
య: పఠేత్శృణుయాద్వాపి స యాతి పరమా౦గతిం ||
మహాప్రజ్ఞాకరం హ్యేతచ్చివభక్తి వివర్దనం |
ఆయురారోగ్య ధనకృత్సర్వ కామప్రదం సదా ||
phalaśruti: Iti skandastavaṁ divyaṁ vāmadēvēna bhāṣitaṁ |
ya: Paṭhētśr̥ṇuyādvāpi sa yāti paramā0gatiṁ ||
mahāprajñākaraṁ hyētacchhivabhakti vivardanaṁ |
āyurārōgya dhanakr̥tsarva kāmapradaṁ sadā ||
వామదేవునిచే పఠింపబడిన ఈ దివ్యమైన స్కందస్తుతిని ఎవడైతే పఠించునో, లేదా వినునో వాడు ఉత్తమగతిని పొందును,ఈ స్తోత్రము గొప్ప బుద్ధి ఒసంగును; శివునియందు భక్తిని వర్ధిల్లజేయును; ఆయుర్దాయమును, ఆరోగ్యమును మరియు ధనమును కలుగజేయును; సర్వకాలములలోకోరికలనన్నింటినీ ఈడేర్చును
If this holy prayer to Skanda composed by Vamadeva,
Is either read or heard then they would attain the ultimate way
It would lead to great wisdom, devotion to Lord Shiva,
Long healthy life and wealth and fulfill all your desires.
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu*****