సుబ్రహ్మణ్య షష్టి రోజు ఇలా చేయండి
మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా ఆచరిస్తారు. ‘సుబ్రహ్మన్యోగ్o ‘ అని వేదం కార్తికేయుని స్తుతించింది. బ్రహ్మవిద్యకు, సంతాన భాగ్యానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు. ‘నీవంటి దైవమును షడానన, నేనెందు కాననురా’ అని త్యాగారాజాదులు ఈ స్వామిని కీర్తించారు. సులభప్రసన్నుడైన కుమారస్వామిని ఈరోజున అర్చించి అభీష్టసిద్ధిని పొందుతారు. సర్పరూపంగా భావించి పుట్టలు పాలు పోయడం కూడా ఈరోజున కొన్నిచోట్ల ఆచారం. ‘షష్ఠి’ కుమారుని జన్మదినం. స్వామికి ప్రీతిపాత్రమైన తిథి. కొందరు ఉపవాసాది నియమాలతో కూడా స్వామివారిని అర్చిస్తారు. ఏ విధంగానైన ఈ రోజు షణ్ముఖుని పూజించడం సర్వోత్తమం. సర్వారిష్ట పరిహారకం.
ప్రశ్న: సుబ్రహ్మణ్య షష్టి రోజు ఏమి చెయ్యాలి?
పూజ్య గురువులు ‘సభా సామ్రాట్’ బ్రహ్మశ్రీ చిర్రావూరి కృష్ణ కిషోర్ శర్మ గారి సమాధానం వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు:
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

Leave a Reply