సంతానం కోసం శ్రీ షష్ఠీ దేవి స్తోత్రం (Sri Shashthi Devi Stotram)
స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): సంతానం కోసం శ్రీ షష్ఠీ దేవి స్తోత్రం (Sri Shashthi Devi Stotram)
****** ఓం శ్రీ సుబ్రహ్మణ్య కుటుంబిన్యై నమః (ōṁ śrī subrahmaṇya kuṭumbin’yai namaḥ) ******
లక్ష్మీదేవి సంపద నిచ్చే దేవత అయితే భౌతిక అంశాలను అందించే అధిదేవత శ్రీ షష్ఠీదేవి. ఈ ప్రకృతి భౌతిక అంశాల్లో ఆరవ వంతు ఆమెది. ఆరోవంతు భాగం కలిగినది కాబట్టి ఈమెను షష్ఠీ అని పిలుస్తారు. షష్ఠీదేవికి పిల్లలంటే మహాఇష్టం. నిజానికి ఆమె బాలల సంక్షేమ దేవత. ఆమె దీవెనలు, వరాలందించే ఒక అతి సుందరమైన యవ్వన దేవత అని పురాణాలు చెప్తున్నాయి. ఘనమైన కీర్తి కలిగి, ఒంటినిండా ఆభరణాలు ధరించి, ఎప్పుడూ వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. బంగారు మేనిఛాయలో మెరిసిపోయే షష్ఠీదేవి ఇతర దేవతల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఎప్పుడూ చేతిలో పిల్లలతో, తన వాహనమైన పిల్లితో దర్శనమిస్తుంది. పురాణాలలోనూ, జానపద గాథలలోను షష్ఠీదేవి లీలల గురించి ఎన్నో గాథలు వినిపిస్తూ ఉంటాయి. దేవి భాగవతం తొమ్మిదవ స్కందంలో ఈ షష్ఠీదేవి ప్రస్తావన, చరిత్ర ఉన్నది. ఈమెకు మరియొక పేరు దేవసేన. కుమారస్వామి వారి దేవేరి. ఈమె బాలారిష్టముల నుండి శిశువులను రక్షిస్తుంది . అందుకే నిన్నమొన్నటి వరకూ ఉత్తరాదిన ఒడిషా, బెంగాల్ వంటి ప్రా౦తాలలో మాత్రమే ఉన్న షష్ఠీదేవి ఆరాధన నిదానంగా ఇప్పుడు దక్షిణాదిన కూడా గొప్ప ప్రాచుర్యం పొందుతోంది.
Sri Shashthi devi, who was the wife of Lord Subrahmanya called Devayani (Deva Sena) . She is the daughter of Lord Vishnu but brought up by Devendra as his foster daughter. Shashthi devi is a Hindu folk goddess,(six headed) the benefactor and protector of children. She is also the deity of vegetation and reproduction and is believed to bestow children and assist during childbirth. She is often pictured as a motherly figure, riding a cat and nursing one or more infants. She is symbolically represented in a variety of forms, including an earthenware pitcher, a banyan tree or part of it or a red stone beneath such a tree. The worship of Shashthi is prescribed to be done on the sixth day of each lunar month of the Hindu calendar as well as on the sixth day after a child’s birth. Barren women desiring to conceive and mothers seeking to ensure the protection of their children will worship Shashthi and request her blessings and aid. She is especially venerated in eastern India.
శ్రీ షష్ఠీ దేవి ధ్యానం (Sri Shashthi Devi Dhyanam)…
శ్రీమన్మాతరం అంబికాం విధి మనోజాతాం సదాభీష్టదాం |
స్కందేష్టాం చ జగత్ప్రసూం విజయదాం సత్పుత్ర సౌభాగ్యదాం |
సద్రత్నాభరణాన్వితాం సకరుణాం శుభ్రాం శుభాం సుప్రభాం |
షష్ఠా౦శాం ప్రకృతేః పరాం భగవతీం శ్రీ దేవసేనాం భజే ||
śrīmanmātaraṁ ambikāṁ vidhi manōjātāṁ sadābhīṣṭadāṁ |
skandēṣṭāṁ cha jagatprasūṁ vijayadāṁ satputra saubhāgyadāṁ |
sadratnābharaṇānvitāṁ sakaruṇāṁ śubhrāṁ śubhāṁ suprabhāṁ |
ṣaṣṭhā0śāṁ prakr̥tēḥ parāṁ bhagavatīṁ śrī dēvasēnāṁ bhajē ||
షష్ఠా౦శాం ప్రకృతేః శుద్ధాం సుప్రతిష్ఠా౦ చ సువ్రతాం |
సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూం |
శ్వేతచంపక వర్ణాభాం రక్తభూషణ భూషితాం |
పవిత్రరూపాం పరమం దేవసేనాం పరాంభజే ||
ṣaṣṭhā0śāṁ prakr̥tēḥ śud’dhāṁ supratiṣṭhā0 cha suvratāṁ |
suputradāṁ cha śubhadāṁ dayārūpāṁ jagatprasūṁ |
śvētachampaka varṇābhāṁ raktabhūṣaṇa bhūṣitāṁ |
pavitrarūpāṁ paramaṁ dēvasēnāṁ parāmbhajē ||
…శ్రీ షష్ఠీ దేవి స్తోత్రం (Sri Shashthi Devi Stotram)…
నమోదేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః
శుభాయై దేవసేనాయై, షష్ఠీదేవ్యై నమో నమః
namōdēvyai mahādēvyai sid’dhyai śāntyai namō namaḥ
śubhāyai dēvasēnāyai, ṣaṣṭhīdēvyai namō namaḥ || 1 ||
వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః
సుఖదాయై మోక్షదాయై షష్ఠీదేవ్యై నమో నమః
varadāyai putradāyai dhanadāyai namō namaḥ
sukhadāyai mōkṣadāyai ṣaṣṭhīdēvyai namō namaḥ || 2 ||
సృష్ట్యై షష్ఠా౦శరూపాయై సిద్ధాయై చ నమో నమః
మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమో నమః
sr̥ṣṭyai ṣaṣṭhā0śarūpāyai sid’dhāyai cha namō namaḥ
māyāyai sid’dhayōgin’yai ṣaṣṭhīdēvyai namō namaḥ || 3 ||
సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః
బాలాదిష్ఠాతృదేవ్యై చ షష్ఠీదేవ్యై నమో నమః
sārāyai śāradāyai cha parādēvyai namō namaḥ
bālādiṣṭhātr̥dēvyai cha ṣaṣṭhīdēvyai namō namaḥ || 4 ||
కల్యాణదాయై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం
ప్రత్యక్షాయై స్వభక్తానాం షష్ఠీదేవ్యై నమో నమః
Kalyāṇadāyai kaḷyāṇyai phaladāyai cha karmaṇāṁ
pratyakṣāyai svabhaktānāṁ ṣaṣṭhīdēvyai namō namaḥ || 5 ||
పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు
దేవరక్షణకారిణ్యై షష్ఠీదేవ్యై నమో నమః
pūjyāyai skandakāntāyai sarvēṣāṁ sarvakarmasu
dēvarakṣaṇakāriṇyai ṣaṣṭhīdēvyai namō nam || 6 ||
శుద్ధసత్వ స్వరూపాయై వందితాయై నృణాం సదా
హింసాక్రోధవర్జితాయై షష్ఠీదేవ్యై నమో నమః
śud’dhasatva svarūpāyai vanditāyai nr̥ṇāṁ sadā
hinsākrōdhavarjitāyai ṣaṣṭhīdēvyai namō namaḥ || 7 ||
ధనం దేహి ప్రియాం దేహి పుత్రందేహి సురేశ్వరి
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి
ధర్మం దేహి యశోదేహి షష్ఠీదేవ్యై నమో నమః
dhanaṁ dēhi priyāṁ dēhi putrandēhi surēśvari
mānaṁ dēhi jayaṁ dēhi dviṣōjahi mahēśvari
dharmaṁ dēhi yaśōdēhi ṣaṣṭhīdēvyai namō namaḥ || 8 ||
దేహి భూమిం ప్రజాందేహి విద్యాందేహి సుపూజితే
కళ్యాణం చ జయందేహి షష్ఠీదేవ్యై నమో నమః
dēhi bhūmiṁ prajāndēhi vidyāndēhi supūjitē
kaḷyāṇaṁ cha jayandēhi ṣaṣṭhīdēvyai namō namaḥ || 9 ||
ఫలశ్రుతి (Phalaśruti)…
ఇతి దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం
యశస్వినం చ రాజేంద్రం షష్ఠీదేవి ప్రసాదత:
iti dēvīṁ cha sanstutya labhē putraṁ priyavrataṁ
yaśasvinaṁ cha rājēndraṁ ṣaṣṭhīdēvi prasādata: || 10 ||
షష్ఠీస్తోత్రమిదం బ్రహ్మన్ యః శృణోతి వత్సరం
అపుత్రో లభతే పుత్రమ్ వరం సుచిరజీవనం
Ṣaṣṭhīstōtramidaṁ brahman yaḥ śr̥ṇōti vatsaraṁ
aputrō labhatē putram varaṁ suchirajīvanaṁ || 11 ||
వర్షమేకం చ యా భక్త్యా సంస్తుత్యేదం శృణోతి చ
సర్వపాప వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే
varṣamēkaṁ cha yā bhaktyā sanstutyēdaṁ śr̥ṇōti cha
sarvapāpa vinirmuktā mahāvandhyā prasūyatē || 12 ||
వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం
సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః
vīraṁ putraṁ cha guṇinaṁ vidyāvantaṁ yaśasvinaṁ
suchirāyuṣyavantaṁ cha sūtē dēvi prasādataḥ || 13 ||
కాక వంధ్యా చ యా నారీ మృతపత్యా చ యా భవేత్
వర్షం శ్రుత్వా లభేత్పుత్రం షష్ఠీదేవీ ప్రసాదతః
Kāka vandhyā cha yā nārī mr̥tapatyā cha yā bhavēt
varṣaṁ śrutvā labhētputraṁ ṣaṣṭhīdēvī prasādataḥ || 14 ||
రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్
మాసేన ముచ్యతే రోగాన్ షష్ఠీదేవీ ప్రసాదతః
Rōgayuktē cha bālē cha pitāmātā śr̥ṇōti chēt
māsēna muchyatē rōgān ṣaṣṭhīdēvī prasādataḥ || 15 ||
జయదేవి జగన్మాతః జగదానందకారిణి
ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్ఠీదేవ తే
Jayadēvi jaganmātaḥ jagadānandakāriṇi
prasīda mama kalyāṇi namastē ṣaṣṭhīdēva tē || 16 ||
****** ఇతి శ్రీ సుబ్రహ్మణ్య వివృత పురాణే, శ్రీ ప్రియపుత్ర విరచిత శ్రీ షష్ఠీదేవి స్తోత్రం సంపూర్ణం (This is the end of Sri Subrahmanya Vivrta Purane, Sri Priyaputra Virachita Sri Shashthi Devi Stotram ******
సంతానం కోరుకొనే స్త్రీ పురుషులు సంతానం కోరి (పుత్రిక, పుత్రుడు) ఈ షష్ఠీదేవిని భక్తి శ్రద్ధలతో పై స్తోత్రంతో నిత్యం పూజించాలి. ఆ దేవి కరుణా కటాక్షాలతో అందమైన, ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుంది. శుభ లక్షణాలతో పెరిగి ఆరోగ్యవంతులుగా జీవిస్తారు.
****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******
మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”
లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******
Leave a Reply