నాగ పంచమి\గరుడ పంచమి విశిష్టత (Significance of Naga Panchami\Garuda Panchami)
Every festival that the Maha Rishis have established is the spiritual consciousness of Bhagwan along with social consciousness and health system.
కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువలన సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమిని ‘నాగ పంచమి’గా పిలవబడుతోంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక, శ్రావణ శుద్ధ పంచమిని ‘గరుడ పంచమి’ అని కూడా పిలుస్తుంటారు. శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కనుక సర్పభయం లేకుండా వుండటం కోసం ఈ రోజున అంతా నాగపూజ చేస్తుంటారు.
Sage Kashyapa had two wives, Vinata and Kadhruva. Garuda was born to Vinata and the Serpent species were born to Kadhruva. Thus the serpentine born Shravana Suddha Panchami is called ‘Naga Panchami’. On the same day Garuda was born, so Shravana Suddha Panchami is also known as ‘Garuda Panchami’. On the Shravana Panchami day, the serpent is born so to be free of sins and fear due to the serpent naga puja is offered on this day.
అలాగే ‘ గరుడ పంచమిగా చెప్పుకునే ఈ రోజున, గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు. అయితే సోదరులు వున్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం వుంది. సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది. విశేషమైనదిగా చెప్పబడుతోన్న ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి, ఆ తరువాత ఉద్యాపన చెసుకోవలసి వుంటుంది. సాధారణంగా ఏ తల్లి అయినా తన కొడుకు తాను గర్వించేలా లోకం మెచ్చేలా వుండాలని అనుకుంటుంది. అలా తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు. అందుకోసం దేవేంద్రుడితోనే పోరాడాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అభినందనలను అందుకుని ఆయన వాహనంగా ఉండిపోయాడు. అలాంటి ఈ రోజున గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం వలన, ఆరోగ్యవంతులైన, ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది
Also as this day is known as ‘garuda panchami’ puja is offered to Garuda to be blessed with a child like him as he known for his love and respect towards his mother. But there is a rule that only women with the brothers practice this verse. Besides prosperity one who offers this puja will be blessed with a chlid and goddess Gauri Devi receives all the prayers offered in this puja. Known for being remarkable this verse should be practiced for ten years and is then required to be stopped with certain closing rituals. Generally, every mother wants her child to be praised by the world and make her proud. So to get rid of her mother from bondage Garuda brought amritha kalasam from deva lokam. He fought against Devendra for that. He was praised and congratulated by Lord Vishnu for this act and then Garuda stayed as Vishnu’s chariot. It is said that on this day one who practices the verse (puja) of garuda panchami will be blessed with a healthy, courageous child.
అనేక కారణాలతో నాగ దేవతలు ఈ పంచమి తిదికి అధిష్ఠాన దేవతలు అయ్యాయి. అందులో కొన్ని:
1. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవసేన అమ్మ వారిని పెళ్లి చేసుకోవడానికి భూలోకమునకు వచ్చింది ఈరోజు.
2. వాసుకిని శ్రీ పరమ శివుడు కళాభరణముగా చేసుకొన్న రోజు.
3. శ్రీమన్నారాయునికి ఆదిశేషుడు పాన్పుగా మారిన రోజు.
4. శ్రీకృష్ణుడు యమునా నదిలోని కాళీయుడిని అణచి వేసి కాళీయ మర్దన చేసిన రోజు.
For many reasons the Naga deities are supreme deities (Lord Shiva\Vishnu\Subrahmanya) on this Panchami. Some of things happened are:
1. Lord Subrahmanya came to the earth to marry Devasana Ammavaru on this day.
2. Lord Shiva took Vasuki as kalabharanam on this day.
3. Aadi Sheshu became the bed of lord Vishnu on this day.
4. Lord Krishna suppressed Kaliyudu in the river Yamuna and did kaliya mardana on this day.
వ్యవహార పరంగా కూడా చూస్తే శ్రావణ మాసం వర్షాకాలం కనుక, వర్షపు నీరు పుట్టలోకి ప్రవేశించినప్పుడు, అన్ని పాములు వారి బొరియలు నుండి బయటకు వస్తాయి. అలాగే రైతులు పొలం దున్ని, పంటలు వేసే కాలం. ఈ పంటలను ఎలుకలు, పందికొక్కులు వంటి జంతువులు వచ్చి నాశనం చేయకుండా వాటిని భక్షిస్తూ పొలంలో రైతుల పంటను పాములు కాపాడుతాయి. వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి, రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంట పొలాలకు శత్రువులు ఎలుకలు. వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే, మానవాళి మనుగడకే ప్రమాదం. అందుకే శ్రావణ మాసంలో ‘నాగ పంచమి’ పేరుతో పండుగ చేసుకుంటారు. ఆనాడు నాగలితో పొలం దున్నరు, పొలంలో పొగబెట్టడం,గోతులు తవ్వడం, మొక్కలు పీకడం మొదలైనవి చెయ్యరు.
Also the month of Sravana is rainy season. So when rain water enters into the burrows, all snakes come out of it. Farmers plough the feild and raise crops in this season. These crops are destroyed by animals like mice, bandicoot and Snakes protect farmers’ farm by killing such animals. In the rainy season snakes come out of the burrows and wander around. Due to the burrows (spaces under soil ) moisture in the soil increases. This is very important for crops. Since snakes are the source of crops, farmers consider them to be gods. Rats are enemies for crop fields. The snakes help farmers by eliminating rats. If snakes are nearing to extinction, then it is a dangerous treat to human survival. So, in the month of Sravana, the festival called ‘Naga Panchami’ is celebrated. Hence on this day the fields were not ploughed, plants are not plucked and pits are not dug as a sign to not harm snakes.
ఒక విధంగా చూస్తే, పాము ‘కుండలినికి’ సంకేతం. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. ఎన్నో విధాలుగా జీవ ప్రేరేపణకు కారణం అదే. మరో అంశం ఏమిటంటే పాములు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి. ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింప బడుతుంటాయో అక్కడికి పాములు ఆకర్షింపబడతాయి. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ‘వెన్నుబాము’ అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో “పాము” ఆకారమువలెనే వుంటుందని “యోగశాస్త్రం” చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ‘ సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుందని పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు.
In a way, there is a resemblance to snake and Kundalini (Kundalini in Hinduism refers to a form of primal energy said to be located at the base of the spine) in matters such as nature, motion, and stagnation the snake is seen as a sign of kundalini. The activation of the kundalini is signified by the coiled serpent rising up from the root chakra or the mooladhara chakra to high up. As the mediator/ Sadhak evolve spiritually, and as the energy rises up opening up more and more energy centre, snakes appear in their visions signifying their spiritual progress. Another factor is that the snakes respond to some types of forces. Snakes are attracted to places where there is favor of meditation or the welfare of the pilgrims. Astrologically too, the horoscopes which are generally in the grasp of the Rahu and Ketu nodes commonly known as the Kal Sarp Dosha has a lot of importance on this day. The head of the snake is Rahu and its tail is Ketu and when the planets fall in between them they are considered to be in their grip. It is believed that they negate the impacts of other planets for these planets are relatively imprisoned by their energies. Therefore anyone who has been suffering from this dosha also does special prayers to the Lord Shiva\Vishnu\Subrahmanya.
స్కంద పురాణంలో నాగ పంచమి విశిష్టతను సాక్షాత్ పరమ శివుడే పురాణాల్లో వివరించి వున్నాడు. నాగ పంచమి పూజ అత్యంత విశిష్టమైనది. సత్ సంతానం కలగాలన్న, కుజదోషం పోవాలన్న నాగ దేవత అనుగ్రహం ఉండాలి. ‘నాగ పంచమి’ నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు, చలిమిడి, నువ్వులతో, బెల్లంతో చేసిన పదార్థములు సమర్పణ చేయుచూ ” తోకతొక్కితే తొలగిపో, నడుంతొక్కితే నావాడనుకో, పడగతొక్కితే పారిపో” అని తెలిసి తెలియక మేము చేసే తప్పుల నుంచి మన్నించి మమల్ని కాపాడు తండ్రి అని ప్రార్థిస్తారు. ఈ రోజు నూనె తగలని ఆహార పదార్థాలు స్వీకరిస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతలను పూజించినవారికి విష భాధలు ఉండవు. సర్ప స్తోత్రాన్ని నాగ పంచమి రోజున చదివిన వారికి ఇంద్రియాలచే ఏర్పడే రోగాలుండవు. సంతానం కలుగుతుంది. వంశాభివృద్ధి చేకూరుతుంది. కార్యసిద్ధి జరుగుతుంది. అన్ని కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాలసర్పదోషాలు, నాగదోషాలు తొలగిపోతాయి.
The excellence of Naga Panchami in the Skanda Purana is illustrated in mythology by Lord Shiva. The Naga Panchami Puja is the most unique. On the day of ‘Naga Panchami’, worship the goddess Naga and offer milk along with items made of sesame seeds, jaggery and chalimidi (a ladoo made of soaked rice, coconut, sugar and elachi) to the burrows or ant hills in which snakes live praying to forgive and forget our sins of harming a snake without our conscious and knowledge. On this day usually people eat food that does not contain any oil. Those worshiping the Naga dieties on this day protects a person from unnecessary fears in life and brings about good health, wealth, peace and prosperity in life. Sarpa stōtrā is read on the day of Naga Panchami. They will be blessed with children. Their Dynasty will cherish and have prosperity. Their wishes will be fulfilled. All their tasks will be accomplished without hurdles. They will be free of Kalasarpadoshas and Nagadoshas.
గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకొంటారు. ఇంటి ద్వారానికి రెండువైపులా సర్పాల ఆకృతులను వేస్తారు. పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకిస్తారు. అలాగే పసుపు రంగు దారాలను చేతికి కడతారు. కొందరు వెండి, రాగి, రాతి, చెక్కలతో నాగదేవత బొమ్మలను తయారు చేసి పూజలు చేస్తారు. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేసి పెరుగును, గోధుమతో చేసిన పాయశాన్ని నైవేద్యముగా పెడతారు. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇస్తారు. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి అని నమ్ముతారు. తమను ఆరాధించిన వారికి ఎటువంటి హాని కల్గించకుండా వారిని నాగులు సంరక్షిస్తాయని అగ్ని పురాణం, స్కంద పురాణం, నారద పురాణాలలో ఉన్న నాగ విశిష్టత తెలుపుతోంది.
On this day of Naga panchami it is advised to wake up before sunrise, take a bath and clean the house. On either side of the house’s entrance snake shaped designs are drawn with chalk. The room in which puja is offered is decorated with tumeric, kumkum and flowers. And yellow coloured threads are tied to the hand. Some make the idols of naga dieties with silver, copper, stone, wood and offer puja. Abishekam with milk and ghee is offered to the idols of naga dieties and sweet made of wheat and curd are offered as naivedyam. After puja, tambulam, panakam (sugar syrup with elachi), and soaked moong dal mixed with sugar are offered along with the idol to a brahmin. On this day fast is done during the day and stay awake at night. According to mythology, whoever does this on naga panchami are blessed by the naga dieties. Also it is believed that they will be free of sins and fear of serpents. It is written in Agni puranam, Skanda puranam and Narada puranam that whoever believes and worship the naga dieties on this day are always blessed and saved from any harm.
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******
నాగ పంచమి సందర్భంగా కుక్కే సుబ్రహ్మణ్యం స్వామి వారి విశేష అలంకరణ (Kukke Subrahmanya decoration on Naga Panchami day):
Leave a Reply