శ్రీ సుబ్రహ్మణ్య శ్లోకం (MURUGA SHLOKA)

స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Stotram):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Stotram): శ్రీ సుబ్రహ్మణ్య శ్లోకం (MURUGA SHLOKA)


నమస్తే నమస్తే మహాశక్తిపాణే – నమస్తే నమస్తే లసద్వజ్రపాణే । నమస్తే నమస్తే కటిన్యస్తపాణే – నమస్తే నమస్తే సదాభీష్టపాణే


Namastē namastē mahāśaktipāṇē – namastē namastē lasadvajrapāṇē। namastē namastē kaṭin’yastapāṇē – namastē namastē sadābhīṣṭapāṇē


MEANING: Our salutations are to Lord Murugan, the wielder of the Mahaasakti and the Vajra of immense brilliance and the giver of boons and desires at all times.


****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******


సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర భక్తులు మిరియాలు, ఉప్పు ఎందుకు ఉంచుతారు?

మిరియాలు అంటే కారం. ఉప్పు, కారం మన నాలుకను ఆకర్షించే ప్రధానమైన రుచులు. యోగసాధనలో రుచులపై మమకారం వదులుకోవటం ఒక భాగం. సుబ్రహ్మణ్యుడు కుండలినీ స్వరూపుడు. అందుకు సంకేతంగానే సర్పాకారంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఆ యోగమూర్తి సన్నిధిలో రుచులపై మోహం వదులుకుంటున్నామని, యోగమార్గంలోకి వస్తున్నామని తెలియచేయటానికి ఉప్పు, మిరియాలు ఉంచుతుంటారు.


ధ్వజస్తంభ పీఠాన్ని.. బలిపీఠంగా భావిస్తారు. పక్షుల కోసం అర్చకులు అక్కడ అన్నం ఉంచడం ఆలయ సంప్రదాయం. ఆ పీఠం దగ్గర ఉప్పుకారాలు వదలడం రుచులపై ఆసక్తిని వదిలిపెట్టడమన్నమాట.


మరో కోణంలో చూస్తే.. సుబ్రహ్మణ్యుడు బ్రహ్మచారి, జ్ఞానమూర్తి. ఉపనయన క్రతువులో నాందీముఖంలో బ్రహ్మచారికి ఉప్పుకారాలు లేని భోజనం వడ్డిస్తారు. విద్యపై అభిరుచి తప్ప మరే ఇతర రుచులపై బ్రహ్మచారి ఆసక్తి కలిగి ఉండరాదన్నది బ్రహ్మచర్య వ్రతంలో భాగం. స్వామి బ్రహ్మచర్య వ్రతదీక్షను గౌరవిస్తూ భక్తులు ఇలా ఉప్పు, మిరియాలు వదలడం ఆచారంగా వస్తోంది.


       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

Recent Posts

Archives

Categories

Recent Comments