శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ చేసిన అనేకమైన స్తోత్రములలో, కీర్తనలలో బాగా ప్రాశస్త్యం పొందిన స్తోత్రం స్కంద షష్ఠి కవచం. ఈ కవచం తమిళ నాట చాలా ప్రసిద్ధి పొందిన స్తోత్రము. ఈ కవచమును వ్రాసిన వారు శ్రీ దేవరాయ స్వామి వారు. ఈ స్కంద షష్ఠి కవచమును ప్రతీ సంవత్సరము స్కంద షష్ఠి ఉత్సవాలు జరిగే రోజులలో ప్రత్యేకించి చదువుతారు.
ఈ కవచమును శ్రద్ధతో ప్రతీ రోజూ పఠించిన భక్తులకు సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహము లభిస్తుంది, ఆ షణ్ముఖుని శక్తి ఆయుధము మనకు ఒక కవచమై ఎల్లప్పుడూ రక్షిస్తుంది, అంతేకాక సర్వ వ్యాధి నివారణ, ఐశ్వర్య ప్రాప్తి, చేసే పనులలో విజయం కలగడం, సర్వ గ్రహ, శత్రు, కలి బాధలు హరింపబడతాయి, ఎటువంటి భూత ప్రేతములు దరి చేరలేవు, ఇహములో ఎన్నో సౌఖ్యములను కలుగజేసి, చివరకు స్కంద సాయుజ్యమును కలుగ చేయగల స్తోత్రం ఈ స్కంద షష్ఠి కవచం. ఈ కవచం పఠించిన వాళ్లకి అన్నిటా విజయం లభిస్తుంది.
ప్రత్యేకించి తమిళనాట ఎంతో మంది మహా భక్తులు ఈ కవచం యొక్క అద్భుత ఫలితములను అనుభవించారు. జీవితములో తీరని సమస్యలు, కోరికలు (ధర్మబద్ధమైనవి) నెరవేరుతాయి, సంతానము లేని వారికి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది, దీనిని నమ్మి పఠించిన వారి ఇల్లు సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది. మనం ఈ జన్మలోనూ, పూర్వ జన్మలలోనూ తెలిసీ, తెలియక అనేక పాపములు చేసి ఉంటే, వాటి ఫలితములను ఘోర రూపములో అనుభవించవలసి ఉంటే, ఈ స్కంద షష్ఠి కవచం పఠించడం వల్ల, షణ్ముఖ కటాక్షం కలిగి, మనకు కవచమై, మనల్ని రక్షించగలదు.
****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******
మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”
లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.
భగవాన్ రమణ మహర్షి స్వయముగా చేసిన అరుణాచలేశ్వరుని స్తుతి ఈ “అరుణాచల అక్షరమణమాల”. భగవాన్ ఒకరోజు గిరి ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆసువుగా, ఆయన నోటి ఉండి వచ్చిన అరుణాచలేశ్వరుని స్తుతి. భగవాన్ రమణులు చేసిన ఈ స్తుతిని అక్షరమణమాలై అని అంటారు, అది తమిళంలో ఉంటుంది. కానీ శ్రీరమణాశ్రమం వారు, భగవాన్ ఇచ్చిన ఈ అద్భుతమైన స్తుతిని తెలుగులో అనువదింపజేశారు.
This “Arunachala Aksharamanamalai” composed by Bhagavan Sri Ramana Maharshi for the lord Arunachaleswara. One day while Bhagavan was doing giri pradakshina,he chanted Arunachaleswara sloka sponteneously. This slokha by Bhagavan Ramana is called Aksharamanamalai, which is in Tamil originally. Later Sri Ramanasramam, translated this wonderful script of Bhagwan in other languages.
అరుణాచలమనేది సాధారణ జీవికి ఒక కొండ. భగవాన్ రమణుల అనుభవం మాత్రం భిన్నం. కరుణాసముద్రుడైన శివుడే, ఘనీభవించిన కొండయై నిలిచాడన్న అనుభూతి వారిది. తనకు, అరుణాచలానికి తేడా ఏమీ లేదన్న అభేద, అద్వైత స్థితి. ద్వైత స్థితిలో అరుణాచలాన్ని రమణులు సంబోధించిన పరమాద్భుత కవితావైఖరి ఆపాతమధురం. మణమాల అంటే కళ్యాణమాల. అది నాశమెరుగని, వసివాడని జీవాత్మ పరమాత్మల బంధమైతే, అదే అక్షరమణమాల! ఇదొక దివ్యసాధనామార్గం. ద్వైతంతో ప్రారంభమై అద్వైతంగా ముగిసే అందమైన భావగీతం అక్షరమణమాల. లోతుగా అధ్యయనం చేసి, అనుభూతి చెందగలిగితే, అది సుషుమ్నా గీతం. అహం నశిస్తే తప్ప సోహం స్థితి లభించదని చెప్పే సాధనాగీతం. రమణుల సాలోక్య, సామీప్య, సాన్నిధ్య, సాయుజ్య స్థితులను ఆవిష్కరించే రమణీయ హృదయగానాన్ని విందాం!
Arunachalam is simply a hill to a normal human being. But the experience of Bhagwan Ramana is a bit different. His feeling is that the merciful Lord Shiva is in the form of a frozen hill in Arunachalam. His opinion is that there is no difference between Arunachalam and Advaita. Being a great poet of expressions bhagavan ramana addressed Arunachalam is in a dual state. Manamala means kalyanamala. If it is undiminished and enriched with the life of the souls and bounded to Paramatma, then it is Aksharamanamala! This is a great ordeal practice. This beautiful lyrical Aksharamanamala starts with dwaita and ends with adwaita. Studying deeply, If you can feel it, it is a song for life. The lyrical of this song aims to tell that unless one let go of ones ego one cannot attain Moksha. To find solace and proximity listen to this well versed poetry by bhagavan ramana to your heart’s content.
స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click here to listen the Stotram):
స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): వల్లీశ దేవసేనేశ (Vallisa Devasenesa)