సుబ్రహ్మణ్య షష్టి రోజు ఇలా చేయండి
మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా ఆచరిస్తారు. ‘సుబ్రహ్మన్యోగ్o ‘ అని వేదం కార్తికేయుని స్తుతించింది. బ్రహ్మవిద్యకు, సంతాన భాగ్యానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు. ‘నీవంటి దైవమును షడానన, నేనెందు కాననురా’ అని త్యాగారాజాదులు ఈ స్వామిని కీర్తించారు. సులభప్రసన్నుడైన కుమారస్వామిని ఈరోజున అర్చించి అభీష్టసిద్ధిని పొందుతారు. సర్పరూపంగా భావించి పుట్టలు పాలు పోయడం కూడా ఈరోజున కొన్నిచోట్ల ఆచారం. ‘షష్ఠి’ కుమారుని జన్మదినం. స్వామికి ప్రీతిపాత్రమైన తిథి. కొందరు ఉపవాసాది నియమాలతో కూడా స్వామివారిని అర్చిస్తారు. ఏ విధంగానైన ఈ రోజు షణ్ముఖుని పూజించడం సర్వోత్తమం. సర్వారిష్ట పరిహారకం.
ప్రశ్న: సుబ్రహ్మణ్య షష్టి రోజు ఏమి చెయ్యాలి?
పూజ్య గురువులు ‘సభా సామ్రాట్’ బ్రహ్మశ్రీ చిర్రావూరి కృష్ణ కిషోర్ శర్మ గారి సమాధానం వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు:
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన పుష్పాలు ఏమిటి? ఏ పుష్పంతో పూజిస్తే ఫలితం లభిస్తుంది?
ప్రశ్న: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన పుష్పాలు ఏమిటి? ఏ పుష్పంతో పూజిస్తే ఫలితం లభిస్తుంది?
పూజ్య గురువులు ‘సభా సామ్రాట్’ బ్రహ్మశ్రీ చిర్రావూరి కృష్ణ కిషోర్ శర్మ గారి సమాధానం వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు:
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
kurinji andavar పుష్పం:

శ్రీ శివ ప్రదక్షిణ విధానము?
మీరు శివాలయంకి వెళ్ళినపుడు అన్ని ఆలయాలకి చేసిన విధంగానే ప్రదక్షిణ చేస్తున్నారా? ఇకపై అలా చేయకండి…
శివుడికి ప్రదక్షిణ చేయటం అంటే ప్రణవం చేయటం లాంటిది. అత్యంత విశిష్టమయినది. శివ మహా పురాణంలో శివుడికి అభిషేకం చేసి, మహా నివేదన చేసి , హారతి ఇచ్చిన తరువాత అపరాదాన్ని క్షమించమని ప్రదక్షిణ చేయాలి. 108 సార్లు ప్రదక్షిణ చేస్తే శివుడు సంతుష్టుడు అవుతాడు. సకల పాపాల్ని తుడిచేయగల ఫలితం ప్రదక్షిణ ఇస్తుంది. ప్రణవం చేయటం వలన , ఓంకారం చేయటం వలన ఎలాంటి పుణ్యం వస్తుందో అలాంటి పుణ్యం కేవలం శివుడికి ప్రదక్షిణ వలన వస్తుంది. శివుడికి ప్రదక్షిణ చేయటం వలన షోడసోపచార పూజ చేసిన పుణ్యం వస్తుంది. సకల పూజ చేయలేని వారు శివుడికి ప్రదక్షిణ చేయడం వలన అనంతమయిన పుణ్యం వస్తుంది.
అలాగే చాలా మంది ఏ దేవాలయంలో అయిన తెలియక చేసే పొరపాటు గర్భగుడి వెనుక భాగాన్ని తాకి నమస్కారం చేస్తారు. అలా చేయకూడదు. గర్భగుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారు వారిని నిద్ర లేపినట్లు అవుతుంది తాకితే. మరో విషయం ఏమిటంటే, విగ్రహనికి ఎదురుగా నిలబడి ఏ దేవుడు లేదా దేవత దర్శనం చేసుకోకూడదు. ఎందుకంటే విగ్రహం నుండి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి. వాటి శక్తి మనం భరించలేం కనుక ప్రక్కన నిలబడి దర్శనం చేసుకోవాలని పెద్దలు చెప్తారు.
ప్రాణ కళారూప ధరుడు పశుపతి. ఆయన “నీలలోహితుడు” అని తాంత్రికం చెబుతోంది. అంటే, ప్రాణరూపమైన పాశంతో జీవుల్ని కట్టివేస్తున్నవాడు. పశుపతి పంచ ముఖుడు. నాలుగు ముఖాలు నాలుగు దిక్కుల్లో ఉంటాయి. అయిదోది ఆ నాలుగింటి పైనా ఉంటుంది. తూర్పు ముఖం తత్పురుషం. పశ్చిమ ముఖం సద్యోజాతం. ఉత్తర ముఖం వామదేవం. దక్షిణంలో ఉండేది అఘోరం. పైన కనిపించేది ఈశానం. శ్రీదక్షిణామూర్తి విజ్ఞానమయ రూపుడు. కళారూపమైన వాక్కుకు ఆ భూతేశుడే ఆధారప్రాయుడు.
శివాలయంలో గృహస్తు ప్రదక్షిణ ఏవిదంగా చేయాలి?…
1. శివాలయంలో ధ్వజస్థంభం వద్ద ప్రదక్షిణ ప్రారంభించి, ధ్వజస్థంభం నుండి చండీశ్వరుని వరకూ ప్రదక్షిణ చేసి చండీశ్వరుని వద్దకు వెళ్ళి నమస్కరించవలెను.
2. అక్కడ నుండి మళ్లీ వెనక్కి తిరిగి ధ్వజస్థంభం దగ్గరకు వచ్చి ఒక్క క్షణం ఆగి మరలా ప్రదక్షిణ మొదలు పెట్టి సోమసూత్రం (అభిషేక జలం బయటకు పోవు దారి) వరకు వరకు వెళ్ళవలెను.
3. తిరిగి ధ్వజస్థంభం దగ్గరకు వద్దకు వచ్చి నమస్కరించుకొని (అలా వస్తే ఒక్క ప్రదక్షిణ పూర్తి అవుతుంది) చండీశ్వరుని చేరవలెను.
4. మరల ధ్వజస్తంభము మీదుగా (మధ్యలో ఆగకుండా) సోమసూత్రమును చేరవలెను.
5. అదే విధంగా, ధ్వజస్తంభము మీదుగా (మధ్యలో ఆగకుండా) చండీశ్వరుని చేరి నమస్కరించవలెను.
6. మరల, ధ్వజస్తంభము వద్దకు వచ్చి నమస్కరించుకోనిన ప్రదక్షిణ పూర్తి యగును.
ధ్వజస్తంభము లేని యడల, నందీశ్వరుని నుండి ఈ ప్రదక్షిణ చేయవచ్చును. ఈవిదంగా చేసే ప్రదక్షిణకే చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని పేరు.
శివ ప్రదక్షిణలో సోమసూత్రం దాటరాదు ఎందుకంటే ఆయనకు అభిషేకం చేసిన జలం సోమసూత్రం నుండి పోతుంది. అంతేకాక అక్కడ ప్రమధగణాలు కొలువై ఉంటారు. అందుకే వారిని దాటితే శివుని కోపానికి గురి అవుతారు. ఈ విధంగా చేసే ప్రదక్షిణం సాధారణంగా చేసే పది వేల ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడింది. ఇలా మూడు ప్రదక్షిణలు చేయాలి. అయితే నందికి శివునికి మధ్యలో నడవకూడదు ఎందుకంటే సదా ఆయన చూపులు శివుని మీదే ఉంటాయి. ఏ పూజలు చేయలేనివారు ఎన్ని ప్రదక్షిణలు చేస్తే అంత పాపాలని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఈ జన్మలో పూర్వజన్మలో చేసిన పాపాలని కూడా మనం ప్రదక్షిణలు చేయడం ద్వారా పరిహరించుకోవచ్చు. ప్రదక్షిణ చేసేటప్పుడు మన అడుగుల చప్పుడు వినపడకూడదు, అంత నెమ్మదిగా చెయ్యాలి.
శివాలయంలో బ్రహ్మచారి ప్రదక్షిణ ఏవిదంగా చేయాలి?…
బ్రహ్మచారి సోమసూత్రం దాటవచ్చును కాబట్టి ఎడమ ప్రక్కన నుంచి మొదలు పెట్టి గుండ్రంగా ప్రదక్షిణ చేసి శివునికి ఎదురుగా రావాలి.
శివాలయంలో సన్యాసి ప్రదక్షిణ ఏవిదంగా చేయాలి?…
సన్యాసి కుడి ప్రక్కనుంచి మొదలు పెట్టి పూర్ణ ప్రదిక్షణ చెయ్యాలి.
పురాణగాథ…
పుష్పదంతుడు అనబడే ఒక గంధర్వుడు ఉండేవాడు. ఆయనకు ఒక అలవాటు ఉండేది. రోజూ ఈశ్వరుడిని అనేక రకాల పువ్వులతో పూజించేవాడు. ఆయన వేరువేరు తోటల నుంచి పువ్వులును దొంగతనంగా సేకరించేవాడు. అలా రోజూ ఒక రాజుగారి తోటలోని పూలను దొంగతనంగా కోసుకుని వెళ్ళేవాడు. ఆ రాజు ఎలా అయినా దొంగని పట్టుకోవాలి అనుకున్నాడు. తోటకి కాపలాగా భటులను పెట్టాడు. రాత్రిపూట వాళ్ళు చూస్తుండగానే పువ్వులు మాయమయ్యేవి. ఆ విషయం భటులు రాజుగారికి చెప్పారు, అదివిన్న రాజు ఇది ఖచ్చితంగా మానవుల పనికాదని ఎవరో “మాయావి” కావాలని చేస్తున్న పని అని అర్ధమైనది. “శివనిర్మాల్యం తొక్కితే ఎంతటి దివ్యశక్తి అయినా నశించిపోతుంది” అని తెలిసిన ఆ రాజు శివునికి పూజ చేసిన పువ్వులను తెప్పించి, ఆ తోట మొత్తం చల్లించాడు.
అది తెలియక పుష్పదంతుడు యధావిధిగా పువ్వుల కోసం తోటలోకి వెళ్ళాడు. అక్కడ చల్లిన శివ- నిర్మాల్యాన్ని తెలియక తొక్కాడు. అప్పుడు ఆయనకు ఉన్న దివ్యత్వం పోయి సాధారణ మానవునిగా భటుల కళ్ళకు కనిపించాడు. పుష్పదంతుడిని బంధించి రాజుగారి దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అప్పుడు పుష్పదంతుడు ఎంతో గొప్పది, శక్తివంతమైన “శివమహిమ్న స్తోత్రము” చేశాడు. విశేష ప్రాచుర్యం పొందిన శివస్త్రోత్రాల్లో శివ మహిమ్నస్తోత్రమ్ ఒకటి. అప్పుడు పుష్పదంతుడి దివ్యత్వం తిరిగివచ్చి గంధర్వుడిగా మారి రాజుని క్షమాపణ కోరి తనలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. శివమహిమ్న స్తోత్రమ్ 31 శ్లోకాల చిన్న స్తోత్రమే కానీ, చాలా ప్రసిద్ధి పొందింది. ‘మహిమ్నః’ అనే శ్లోకంలో మొదలవుతుంది కనుక, దీన్ని శివమహిమ్న స్తోత్రం అని అంటారు.
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనము నుంచి…

తిరుపతి వెంకటేశ్వర స్వామిని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిగా ఎందుకు ఆరాధిస్తారు?
తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి మూర్తి స్వరూపంలో శివ, విష్ణు, శక్తి, సుబ్రహ్మణ్య అంశలు నాలుగు యిమిడి న్నాయి. బాలాజీ అన్న పేరు బాలసుబ్రహ్మణ్యంకు నిదర్శనం.
స్వామి తలపై జడ, నాగాబరణాలు, బిల్వపత్రపూజ, శివస్వరుపానికి సాక్ష్యాలు. శంఖ చక్ర కిరీటాలు శ్రీమహావిష్ణువు చిహ్నములు. వెలుపలి ప్రాకారంలో, సింహశిల్పం శక్తి స్వరూపాన్ని ప్రకటించేది.
ఈ విధముగా శ్రీ వెంకటేశ్వర స్వామి శివ, కేశవ, బాలసుబ్రహ్మణ్య సమన్యయమూర్తి. ఆవిధంగానే ఆ దేవుని భావించడం సమంజసం. శివ కేశవ మొదలగు భేదాలు దానిలో లేవు.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు యజ్ఞ తత్వమునకు ప్రతీక, అలాగే శ్రీ మహావిష్ణువు కూడా యజ్ఞపురుషుడిగానూ, యజ్ఞతత్వమునకు ప్రతీక గానూ విష్ణు సహస్ర నామాలలో అభివర్ణించబడినది. అందులోనే శ్రీమహావిష్ణువుకి “స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః” అనే నామాలు ఉన్నాయి, అంటే స్కందుడు అన్నా, సుబ్రహ్మణ్యుడు అన్నా, మహావిష్ణువు అన్నా ఒకటే తత్వం అని అర్ధం.
సేనాపతే పాలయమాం..
ఆ కథ ద్వారా సుబ్రహ్మణ్యమంత్రశక్తి ఆవిర్భవించి సుబ్రహ్మణ్యుడు సేనాపతియై ఎలాగయితే దేవతాశక్తులన్ని కూడదీసుకుని అసురశక్తులని నిర్ములన చేసాడో అలా రాముడు దేవతాంశలతో పుట్టిన సుగ్రీవ, హనుమ, అంగదాది దేవతా శక్తులని ప్రోవిచేసుకొని అసురశక్తులైన రావణకుంభకర్ణులుని సంహరించాడు.
భారతంలో అనుకూలశక్తులు పాండవుల్ని, ప్రతికూలశక్తులు దుర్యోధనుడ్ని ఆధారం చేసుకుంటే వారందర్ని కలిపి సేనాపతిలా నడిపించినవాడు కృష్ణపరమాత్మ. రామాయణానికి, భారతానికి కూడా సుబ్రహ్మణ్యశక్తి అవసరమైంది. అలా దేశంలో అసురశక్తులు విజృంభణ సమయములో సుబ్రహ్మణ్యశక్తి రావాలి. సమస్త హై౦దవధర్మానికి సుబ్రహ్మణుడే రక్ష.
మనలో ఉన్న అసురశక్తులు భగవత్ జ్ఞానాన్ని తెల్సుకోనివ్వకుండా అడ్డుకొంటుంటే వాటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించడానికి మన ఇంద్రియసేనలకి, బుద్ధికి సేనాపతియై నడిపించమని సుబ్రహ్మణ్యుని ప్రార్థించాలి.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనము నుంచి…
****** శివశక్త్యాత్మక శ్రీశక్తిధర అవనతోస్మిమామవ శరవణభవ! ******

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి గురుగుహా అనే నామం యొక్క విశిష్ఠత ఏమిటి?
“గురుగుహా” అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్న అనంత నామాలలో ఒకటి. గురుగుహ అనే నామానికి స్థూల సూక్ష్మ కారణ అర్ధాలు మూడు ఉన్నాయి.
మొదటి స్థూల అర్ధము…
గురుగుహా ఒక అర్ధం చెప్పాలంటే, మన హృదయ గుహలోనే ఉన్న గురు స్వరూపమైన సుబ్రహ్మణ్యుడు అని. ఇక్కడ గుహా అంటే మన హృదయ గుహ – హృదయాంతరాళము అని అన్వయించుకోవచ్చు.
శాస్త్రీయ సంగీత త్రయములో ఒకరు, ప్రఖ్యాత వాగ్గేయకారుడు, సుబ్రహ్మణ్యానుగ్రహ పాత్రుడు అయిన శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ చేసిన కీర్తనలు అన్నీ ‘గురుగుహా’ అనే మకుటంతో ఉంటాయి. అది ఏ దేవతా స్వరూపాన్ని ఉద్దేశించి చేసిన కీర్తన అయినా సరే, గురుగుహా అనే నామం ఉంటుంది. ముత్తుస్వామి దీక్షితార్ గారి జీవితంలో ఆయన గురువైన చిదంబరనాథ శాస్త్రి గారిని కాశీ పట్టణంలో విశ్వేశ్వరుని సన్నిధిలో ఐదు సంవత్సరాలు పాటు గురు సేవ చేస్తూ, అటు రోజూ విశ్వేశ్వరుని దర్శనం చేస్తూ గురువు వద్ద సంగీతం అభ్యసించారు. ఒకనాడు, ఈయన గురుభక్తికి మెచ్చిన వారి గురువు గారు, ఒకనాడు గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు, శిష్యుడైన ముత్తుస్వామి దీక్షితార్ గారిని పిలిచి, కళ్ళుమూసుకుని, నదిలో మునిగి, చేతికి తగిలిన వస్తువు తీసుకోమని చెప్తారు.
అప్పుడు దీక్షితార్ గారికి నదిలో ఒక అద్భుతమైన వీణ లభిస్తుంది, గురు అనుగ్రహం కలగడం చేత గంగా నది ఆయనకి ఆ వీణ బహూకరించినది. ముత్తుస్వామి దీక్షితార్ గారికి దొరికిన ఆ వీణ చాలా విలక్షణమైనది, అందులో యాళి పైకి ఉంటుంది. ఇక అలాంటి వీణ మరెక్కడా లేదు. ఇది జరిగిన తర్వాత ఆయన గురువు గారు శరీరం విడిచి, శివ సాయుజ్యం పొందుతారు. చివరలో ఆయన గురువైన శ్రీ చిదంబరనాథ శాస్త్రి గారు, తదనంతరం ముత్తుస్వామి దీక్షితార్ ని తిరుత్తణి వెళ్లమని ఆదేశిస్తారు.
అప్పుడు ముత్తుస్వామి దీక్షితార్ దక్షిణదేశం బయలుదేరి తిరుత్తణి అనే ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రం చేరుకుంటారు. తిరుత్తణి ఆలయ ప్రాంగణంలో కూర్చుని ఉండగా, అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారే అక్కడికి వచ్చి ….”ముత్తుస్వామి దీక్షితార్!! ముత్తుస్వామి దీక్షితార్!! ఏదీ నీ నోరు తెరు…” అని ఆయన నోటిలో పటిక బెల్లం వేస్తారు. ముత్తుస్వామి దీక్షితార్ గారు కళ్ళు తెరిచి చూసే సరికి అక్కడ ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చిన సుబ్రహ్మణ్యుడు కనబడడు. అంతే అప్పుడు వెంటనే సుబ్రహ్మణ్యానుగ్రహంతో ఆయన నోటి నుండీ సుబ్రహ్మణ్యుడిపై అద్భుతమైన కీర్తనలు వచ్చాయి.
వాటినే తిరుత్తణి కీర్తనలు అంటారు. ఇలా సుబ్రహ్మణ్య అనుగ్రహం ప్రత్యక్షంగా పొందినందుకు, ఆయన కీర్తనలన్నిటిలోనూ, ‘గురుగుహా’ అనే మకుటం వేసి కీర్తనలు చేశారు దీక్షితార్. దీక్షితార్ గారు కాశీలో ఆయన చేసిన గురు శుశ్రూషకి మెచ్చిన సుబ్రహ్మణ్యుడు దీక్షితార్ కి అఖండమైన సంగీత పరిజ్ఞానాన్ని కటాక్షించాడు. అందుకే ముత్తుస్వామి వారు తిరువారూర్ లో చేసిన పంచలింగ కృతులలో ఒక కృతిలో ఇలా అంటారు..”జ్ఞాన ప్రదాన గురుగుహ రూప చిదానందనాథ స్వరూప ప్రకాశేన” అని. అంటే ఆయన గురువు చిదానందనాథ స్వామి వారే గురుగుహుడు అని.
గురు స్వరూపమైన సుబ్రహ్మణ్యుడు, సర్వ జీవుల హృదయములో కొలువై ఉన్న సుబ్రహ్మణ్యుడు, ఆయనయే గురు స్వరూపం. సుబ్రహ్మణ్యుడు గురువుగా కేవలం ముత్తుస్వామి దీక్షితార్ గారికే కాదు, సాక్షాత్తు శంకరుడికి కూడా గురువుగా ప్రణవార్ధం బోధించాడు. అందుకే ఆయనని స్వామినాథ అని కూడా అంటారు. ఇక్కడ శంకరుడికి తెలియదా ప్రణవార్ధం, సుబ్రహ్మణ్యుడు బోధించాడు అంటే అది శంకరుడికి అవమానం కదా అని అనుకోకూడదు. ఏ తండ్రికైనా తన పుత్రుడి చేతిలో పొందిన ఓటమి మరింత ఆనందాన్నిస్తుంది. పుత్రాదిచ్ఛేత్ పరాజయం అన్నారు కదా. ఆ విధంగా సుబ్రహ్మణ్యుడు సంపూర్ణ గురు తత్త్వంతో కూడిన సర్వ జీవుల హృదయాలలో ఉన్నవాడు కనుక “గురుగుహ”.
రెండవ సూక్ష్మ అర్ధము…
గురు అంటే బాగా పెద్దదైన, గుహా అంటే చాలా చిన్నది సూక్ష్మమైనది. అంటే ఈ సృష్టిలో అన్నిటికన్నా పెద్దదైన వాడూ ఆయనే, అన్నిటికన్నా చిన్నదైన పరమాణువు స్వరూపం ఆయనే, అంటే సుబ్రహ్మణ్యుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అని అర్ధం, దీనినే అణుర్బృహత్కృశస్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అని విష్ణుసహస్రంలో ఉంది, అన్నిటికనా బాగా పెద్దది, బాగా చిన్నది, బాగా చిక్కినది, బాగా లావైనది, అన్ని గుణములు కలవాడు, ఏ గుణములు లేనివాడు అని కదా. అంటే పరబ్రహ్మ తత్త్వాన్ని చెప్పడం. దీనినే భగవద్గీతలో “కవిం పురాణమనుశాసితారం అణోరణీయఁసమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్యరూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్” అని కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు కదా.
మూడవ సూక్ష్మ అర్ధము…
గురుగుహా అంటే – గురు అంటే నిర్గుణమైన పరమశివునికి సంకేతం, గుహా అంటే గుహ్య శక్తి అయిన అమ్మవారికి సంకేతం, అమ్మ అయ్యవార్ల క్రీడా ఫలితం గురుగుహా. ఈ విశ్వం అంతా కూడా నిర్గుణమైన పరమశివుని మరియు గుహ్యమైన శక్తి స్వరూపిణి యొక్క క్రీడగా వర్ణించారు. అమ్మ అయ్యల క్రీడయే గురుగుహా, అందుకే స్కందః అని కూడా అన్నారు స్వామిని, స్కంద అంటే జారి పడినది అని అర్ధం. ఇక్కడ జారి పడడం అంటే source కి, destination కి లింక్ తెగిపోదు, ఉదాహరణకి సూర్య కిరణాలు. సూర్యుని కిరణాలు సూర్యుని నుంచి బయలు దేరి భూమిని తాకుతాయి, అంతే కానీ అక్కడ ఒక కిరణం బాణంగా బయలుదేరి భూమిమీద పడదు. సూర్య కిరణాలు ప్రసరిస్తాయి. అందుకే ఆదిత్య హృదయంలో కూడా శివః స్కందః ప్రజాపతిః అని సూర్యుని నామాలలో కూడా స్కంద నామం వచ్చింది.