****** -: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దండకం :- ******
ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్థూల సూక్ష్మ ప్రదర్శకాయం, ప్రకీర్తిప్రదాయం, భజేదుర్ధరాయం, భజేహం పవిత్రం, భజేశివతేజం, భజేస్థాపకాయం, భజే ప్రసన్నరూపం, భజే దయామయివటంచున్ ప్రభాతంబు, సాయంత్ర మున్నీదు దివ్యనామ సంకీర్తనల్ జేసినన్, నీ రూపు వర్ణించి, నీ మీదనే దండకం బొక్కటిన్ జేయనూహించి, నీ దివ్యగానంబు కీర్తించి, నీ దాసదాసుండనై శివభక్తుండనై నిన్ను నే గొల్చేదన్, నీవు దయాదృష్టిన్ జూచితే వేడుకల్ జేసితే, నా మొరాలించితే, నన్ను రక్షించితే శివపార్వతీ ప్రియపుత్రాయ, నిన్నెంచ నేనెంతవాడన్, కరుణా కటాక్షంబున జూచితే, దాతవై బ్రోచితే, తొల్లి షణ్ముఖుండవై, కార్తికేయుండవై, శివాహ్వానాన్ని మన్నించి, కైలాసమునకున్ బోయి దేవసైన్యాధ్యక్షుండవై, కీర్తిమంతుడవై, చిత్ర బర్హణవాహనుండవై, పార్వతీ పరమేశ్వరాశీస్సులన్ బొంది, కార్యసాధకుండవై, నీ వీరపరాక్రమంబులన్ జూపి, అమరులకున్ అభయమున్నిచ్చి, త్రైలోక్య పూజ్యుండవై, ముప్పది మూడు కోట్ల దేవతలకున్నిష్టు౦డవై, తారకాసుర సంహారివై, శోణిత పురంబుపై , దండయాత్రన్ ప్రారంభించి, పురంబు ముట్టడించి, రణభేరుల్ మ్రోగించ, విశాఖునిన్ రాయబారిగా ఆ యసుర పురంబునకున్ బ౦ప, తారకాసురుండు రెచ్చి౦చి, హెచ్చించి, నాగ్రహంబుతో నీ మీదకున్, దండెత్త, నీవప్పుడే శివపంచాక్షరిన్, జపించి, మంత్రించి, నీ దివ్య తేజంబునన్ జూప తారకాసురుండచ్చెరువంద, అమితోత్సాహుండవై, పాశుపతాస్త్రమున్, ప్రయోగింప, దైత్యులంతటన్ కకావికలైపోవన్నట్టి, సమయంబునన్, తారకాసురన్, దృంచ, నా దుష్టుడన్, పునర్జీవించి, బాధనొందింపగా, నాతని కంఠమునందున్న, శివలింగమున్నీవ చ్ఛేదించి, ఆ యసరునన్ జంప, లోకంబులానందమై యుండ నీ దివ్యతేజంబు సమస్త లోకంబులన్ బ్రసరింప వేల్పులందరున్ వేనోళ్ళ బొగడంగ, త్రిమూర్తులన్ హర్షించి, మోదంబునన్ నీకు కళ్యాణమున్ జేయబోవంగ, దేవసేనిన్ బెండ్లాడి సుఖంబునుండన్, నీవు శ్రీ వల్లినిన్ జూచి మోహింప ఉమామహేశ్వరుడన్నది గ్రహించి వైభవోపేతంబుగా శ్రీ వల్లిన్నిచ్చి వివాహంబుజేయ, శ్రీ శివామోదంబుగా నిన్ను నే సేవించి నా సకల దోష నివారణకున్ నిన్ ప్రార్థింప, ఆమోదంబు దేల్పినన్ బాయవే, అష్టైశ్వర్య సామ్రాజ్యముల్ గల్గవే నీవే సమస్తంబుగా నెంచి యీ దండకంబున్ పఠించుచున్ శివేశ్వరాయంచున్ శివతేజంబునన్, వేల్గుదువో వీర సుబ్రహ్మణ్యేశ్వరా! నీదు నామంబు స్మరించినంతన్ అంగారక, గ్రహదోష, నివారణన్ జేసి నీ దివ్య రూపంబును జూపి, హృదయాంతరంగయటంచున్ నన్నేలు నా స్వామి యో సుబ్రహ్మణ్యేశ్వరా! తారకాసుర సంహారా!, దేవసేన శ్రీ వల్లీస నాధా! నమస్తే నమో సకలదోష నివారకాయ నమస్తే, నమస్తే నమః.
****** -: Sri Subrahmanyeshwara Swamy Dandakam :- ******
Ōṁ śrī subrahmaṇya sthūla sūkṣma pradarśakāyaṁ, prakīrtipradāyaṁ, bhajēdurdharāyaṁ, bhajēhaṁ pavitraṁ, bhajēśivatējaṁ, bhajēsthāpakāyaṁ, bhajē prasannarūpaṁ, bhajē dayāmayivaṭan̄chun prabhātambu, sāyantra munnīdu divyanāma saṅkīrtanal jēsinan, nī rūpu varṇin̄chi, nī mīdanē daṇḍakaṁ bokkaṭin jēyanūhin̄chi, nī divyagānambu kīrtin̄chi, nī dāsadāsuṇḍanai śivabhaktuṇḍanai ninnu nē golchēdan, nīvu dayādr̥ṣṭin jūchitē vēḍukal jēsitē, Nā morālin̄chitē, nannu rakṣin̄chitē śivapārvatī priyaputrāya, ninnen̄cha nēnentavāḍan, karuṇā kaṭākṣambuna jūchitē, dātavai brōchitē, tolli ṣaṇmukhuṇḍavai, kārtikēyuṇḍavai, śivāhvānānni mannin̄chi, kailāsamunakun bōyi dēvasain’yādhyakṣuṇḍavai, kīrtimantuḍavai, chitra bar’haṇavāhanuṇḍavai, pārvatī paramēśvarāśīs’sulan bondi, kāryasādhakuṇḍavai, nī vīraparākramambulan jūpi, amarulakun abhayamunnicchhi, Trailōkya pūjyuṇḍavai, muppadi mūḍu kōṭla dēvatalakunniṣṭumḍavai, tārakāsura sanhārivai, śōṇita purambupai, daṇḍayātran prārambhin̄chi, purambu muṭṭaḍin̄chi, raṇabhērul mrōgin̄cha, viśākhunin rāyabārigā ā yasura purambunakun bampa, tārakāsuruṇḍu recchhinchi, hecchhin̄chi, nāgrahambutō nī mīdakun, daṇḍetta, nīvappuḍē śivapan̄chākṣarin, japin̄chi, mantrin̄chi, nī divya tējambunan jūpa tārakāsuruṇḍacchheruvanda, Amitōtsāhuṇḍavai, pāśupatāstramun, prayōgimpa, daityulantaṭan kakāvikalaipōvannaṭṭi, samayambunan, tārakāsuran, dr̥n̄cha, nā duṣṭuḍan, punarjīvin̄chi, bādhanondimpagā, nātani kaṇṭhamunandunna, śivaliṅgamunnīva cchhēdin̄chi, ā yasarunan jampa, lōkambulānandamai yuṇḍa nī divyatējambu samasta lōkambulan brasarimpa vēlpulandarun vēnōḷḷa bogaḍaṅga, trimūrtulan harṣin̄chi, mōdambunan nīku kaḷyāṇamun Jēyabōvaṅga, dēvasēnin beṇḍlāḍi sukhambunuṇḍan, nīvu śrī vallinin jūchi mōhimpa umāmahēśvaruḍannadi grahin̄chi vaibhavōpētambugā śrī vallinnicchhi vivāhambujēya, śrī śivāmōdambugā ninnu nē sēvin̄chi nā sakala dōṣa nivāraṇakun nin prārthimpa, āmōdambu dēlpinan bāyavē, aṣṭaiśvarya sāmrājyamul galgavē nīvē samastambugā nen̄chi yī daṇḍakambun paṭhin̄chuchun śivēśvarāyan̄chun śivatējambunan, Vēlguduvō vīra subrahmaṇyēśvarā! Nīdu nāmambu smarin̄chinantan aṅgāraka, grahadōṣa, nivāraṇan jēsi nī divya rūpambunu jūpi, hr̥dayāntaraṅgayaṭan̄chun nannēlu nā svāmi yō subrahmaṇyēśvarā! Tārakāsura sanhārā!, Dēvasēna śrī vallīsa nādhā! Namastē namō sakaladōṣa nivārakāya namastē, namastē namaḥ.
****** సంతాన ప్రాప్తికి, రుణవిముక్తికి, జ్ఞానసిద్ధికి, వివాహమునకు, ఉద్యోగమునకు, సకలదోష నివారణకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దండకం.******