నాగుల చవితి విశిష్టత II పూజా విధానం II నివేదించాల్సిన నైవేద్యాలు
నాగుల చవితి రోజు పుట్టలో పాలు ఎందుకు వేస్తారో తెలుసా?
దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ‘వెన్నుబాము’ అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో “పాము” ఆకారమువలెనే వుంటుందని “యోగశాస్త్రం” చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ‘ సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ‘నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుందని పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు.
నాగుల చవితి పూజా విధానం
నాగులచవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని ఇంట్లో దేవుని వద్ద నువ్వులనూనెతో దీపారాధన చేయాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. తర్వాత పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజామందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకోవాలి. నాగేంద్రస్వామి (పాముపడగ) ప్రతిమనుగానీ, లేదా ఫోటోనుగానీ పూజకు ఉపయోగించాలి. పూజకు మందారపూలు, ఎర్రటి పువ్వులు, కనకాంబరములు, నైవేద్యమునకు చిన్నచిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతిః, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకలసంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో “ఓం నాగేంద్రస్వామినే నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తరువాత దగ్గరలో ఉన్న పుట్టవద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో ఆవుపాలు పోసి పూజ చేయాలి. పూజ అయిన తరువాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం చేయాలి. ఇది వ్రతం ఆచరించే పద్ధతి.
నాగుల చవితి నాడు ఈ మంత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు పొందుతారు
శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ II కరావలంబ స్తోత్రము కోసం ఇచ్చట చూడండి: శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ II కరావలంబ స్తోత్రము
నాగేంద్రునికి నివేదించాల్సిన నైవేద్యాలు || శ్రీ మైలవరపు శ్రీనివాస రావు గారి ప్రవచనం వినుటకు , ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు:
నాగుల చవితి యొక్క ప్రాధాన్యత || డా అనంతలక్ష్మి గారి ప్రవచనం వినుటకు , ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు:
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
Leave a Reply