తిరుపతి వెంకటేశ్వర స్వామిని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిగా ఎందుకు ఆరాధిస్తారు?

తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి మూర్తి స్వరూపంలో శివ, విష్ణు, శక్తి, సుబ్రహ్మణ్య అంశలు నాలుగు యిమిడి న్నాయి. బాలాజీ అన్న పేరు బాలసుబ్రహ్మణ్యంకు నిదర్శనం.

స్వామి తలపై జడ, నాగాబరణాలు, బిల్వపత్రపూజ, శివస్వరుపానికి సాక్ష్యాలు. శంఖ చక్ర కిరీటాలు శ్రీమహావిష్ణువు చిహ్నములు. వెలుపలి ప్రాకారంలో, సింహశిల్పం శక్తి స్వరూపాన్ని ప్రకటించేది.

ఈ విధముగా శ్రీ వెంకటేశ్వర స్వామి శివ, కేశవ, బాలసుబ్రహ్మణ్య సమన్యయమూర్తి. ఆవిధంగానే ఆ దేవుని భావించడం సమంజసం. శివ కేశవ మొదలగు భేదాలు దానిలో లేవు.

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు యజ్ఞ తత్వమునకు ప్రతీక, అలాగే శ్రీ మహావిష్ణువు కూడా యజ్ఞపురుషుడిగానూ, యజ్ఞతత్వమునకు ప్రతీక గానూ విష్ణు సహస్ర నామాలలో అభివర్ణించబడినది. అందులోనే శ్రీమహావిష్ణువుకి “స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః” అనే నామాలు ఉన్నాయి, అంటే స్కందుడు అన్నా, సుబ్రహ్మణ్యుడు అన్నా, మహావిష్ణువు అన్నా ఒకటే తత్వం అని అర్ధం.

సేనాపతే పాలయమాం..
ఆ కథ ద్వారా సుబ్రహ్మణ్యమంత్రశక్తి ఆవిర్భవించి సుబ్రహ్మణ్యుడు సేనాపతియై ఎలాగయితే దేవతాశక్తులన్ని కూడదీసుకుని అసురశక్తులని నిర్ములన చేసాడో అలా రాముడు దేవతాంశలతో పుట్టిన సుగ్రీవ, హనుమ, అంగదాది దేవతా శక్తులని ప్రోవిచేసుకొని అసురశక్తులైన రావణకుంభకర్ణులుని సంహరించాడు.

భారతంలో అనుకూలశక్తులు పాండవుల్ని, ప్రతికూలశక్తులు దుర్యోధనుడ్ని ఆధారం చేసుకుంటే వారందర్ని కలిపి సేనాపతిలా నడిపించినవాడు కృష్ణపరమాత్మ. రామాయణానికి, భారతానికి కూడా సుబ్రహ్మణ్యశక్తి అవసరమైంది. అలా దేశంలో అసురశక్తులు విజృంభణ సమయములో సుబ్రహ్మణ్యశక్తి రావాలి. సమస్త హై౦దవధర్మానికి సుబ్రహ్మణుడే రక్ష.

మనలో ఉన్న అసురశక్తులు భగవత్ జ్ఞానాన్ని తెల్సుకోనివ్వకుండా అడ్డుకొంటుంటే వాటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించడానికి మన ఇంద్రియసేనలకి, బుద్ధికి సేనాపతియై నడిపించమని సుబ్రహ్మణ్యుని ప్రార్థించాలి.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనము నుంచి…


       ****** శివశక్త్యాత్మక శ్రీశక్తిధర అవనతోస్మిమామవ శరవణభవ! ******

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *