Tag Archives:

కుమారస్వామీ వందనం (Kumaraswami Vandanam)

భజనలు (Bhajans)

Composed by: శ్రీ గణపతి సచ్చ్చిదానంద స్వామీజి, అవధూత దత్తపీఠం (Sri Ganapathy Sachchidananda Swamiji, Avadhoota Datta Peetham)

భజన వినుటకు మరియు డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయగలరు (Please click here to Listen and Download the Bhajana MP3): శ్రీ సుబ్రహ్మణ్య భజన (Murugan Bhajana) II కుమారస్వామీ వందనం (Kumaraswami vandanam)

          ****** -: కుమారస్వామీ వందనం II భజన సాహిత్యం:- ******

పల్లవి:
కుమారస్వామీ వందనం
శివకుమారా నీకు వందనం

చరణం:
విల్లమ్ములు దాల్చి చేత
శూలమ్మును బట్టి యెదుట
వచ్చి నిలచి కాపాడే బాలరూపా
వెలుగులిచ్చి దయచూచే విశ్వదీపా    || 1 ||


పెల్లుబికే పెను భక్తికి
ప్రత్క్ష్యక్ష ఫలము లిచ్చి
సిరిసంపద లొనగూర్చే సిద్ధపాలా
పరతత్వము బోధించే నిత్యబాలా    || 2 ||


పొరలెరుగని మనసులలో
స్థిరదీపముగా వెలసి
ఇహపరముల చూపించే దివ్యతేజా
బహుముఖముల వెలుగొందే దేవరాజా  || 3 ||


ఆ వల్లి దేవసేన
లిరు వంకల కులుకుచుండ
మునివంద్యుడ వౌ నిత్యబ్రహ్మ చర్యా
ఘనవిద్యా బోధ చతుర ధీరవర్యా  || 4 ||


వర యాగావళులను
బ్రహ్మణ్యా హ్వానమందు
ఓంకారా హుతుడవౌ ఉమానందా
కింకరులను పాలించే సచ్చిదానందా  || 5 ||


****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download?) ******

మొబైల్ (Mobile) ద్వారా:
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్(Laptop) ద్వారా:
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******