Sri Subrahmanya Dandakam|| శ్రీ సుబ్రహ్మణ్య దండకం
స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): Sri Subrahmanya Dandakam || శ్రీ సుబ్రహ్మణ్య దండకం
****** ॥ శత్రు సంహరణ శ్రీ సుబ్రహ్మణ్య దండకం ॥ ******
****** ॥ శ్రీ శత్రుసంహరణ సుబ్రహ్మణ్యదణ్డకమ్ ॥ ******
కార్తికేయం మహాభాగం | మయూరోపరిసంస్థితం ||
తప్తకాంచనవర్ణాభం | శక్తిహస్తం వరప్రదం ||
ద్విషడ్భుజం శత్రుహంతారం | నానాలంకారభూషితం ||
ప్రసన్నవదనం దేవం | కుమారమ్ పుత్రదాయకమ్ ||
జయ భుజబలనిర్జితానేక విద్యాణ్డభీకారిసంగ్రామ
కృత్తరకావాప్త గీర్వాణభీడ్వాన్త మార్తాణ్డ షడ్వక్త్ర
గౌరీశ ఫాలాక్షి సమ్జాత తేజసముర్భూత దేవాపగా
పత్మషణ్డోథిత స్వాకృతే, సూర్యకోటి ద్యుతే భూసురాణాంగతే,
శరవణభవ కృత్యకాస్తన్యపానాప్తషడ్వక్త్రపత్మాద్రిజాతాకరాంభోజ
సంలాళనాతుష్ట కాళీసముత్పన్న వీరాగ్ర్యసంసేవితానేకబాలోచిత
క్రీడితాకీర్ణవారాశిభూభృద్వనీసంహతే, దేవసేనరతే దేవతానాం వతే,
సురవరనుత దర్శితాత్మీయ దివ్యాస్వరూపామరస్తోమ సమ్పూజ్య,
కారాగృహావాప్తకజ్జాతస్తుత్యాశ్చర్యామాహాత్మ్య
శక్త్యగ్రసంభిన్న శైలేన్ద్ర దైతేయ సంహార సన్తోషితామార్త్య
సంకౢప్త దివ్యాభిషేకోన్నతే, తోషితశ్రీపతే,
సుమశరసమదేవరాజాత్మ భూదేవసేనాకర గ్రాహసమ్ప్రాప్త
సంమోదవల్లీ మనోహారి లీలావిశేషేన్ద్రకోదణ్డభాస్వత్కలాపోచ్య
బర్హీన్ద్ర వాహాధిరూఢాతిదీనం కృపాదృష్టిపాతేన మాంరక్ష
తుభ్యం నమో దేవ తుభ్యం నమో దేవ తుభ్యం నమో దేవ తుభ్యం నమః ॥
****** ॥ శ్రీ సుబ్రహ్మణ్య దణ్డకం సంపూర్ణమ్ ॥ ******
****** ॥ Śatru Sanharaṇa Śrī Subrahmaṇya Daṇḍakaṁ ॥ ******
****** ॥ Śrī Satrusanharaṇa Subrahmaṇya Daṇḍakam ॥ ******
kārtikēyaṁ mahābhāgaṁ | mayūrōparisansthitaṁ ||
taptakān̄chanavarṇābhaṁ | śaktihastaṁ varapradaṁ ||
dviṣaḍbhujaṁ śatruhantāraṁ | nānālaṅkārabhūṣitaṁ ||
prasannavadanaṁ dēvaṁ | Kumāram putradāyakam||
jaya bhujabalanirjitānēka vidyāṇḍabhīkārisaṅgrāma
Kr̥ttarakāvāpta gīrvāṇabhīḍvānta mārtāṇḍa ṣaḍvaktra
Gaurīśa phālākṣi samjāta tējasamurbhūta dēvāpagā
Patmaṣaṇḍōthita svākr̥tē, sūryakōṭi dyutē bhūsurāṇāṅgatē,
Śaravaṇabhava kr̥tyakāstan’yapānāptaṣaḍvaktrapatmādrijātākarāmbhōja
Sanlāḷanātuṣṭa kāḷīsamutpanna vīrāgryasansēvitānēkabālōcita
Krīḍitākīrṇavārāśibhūbhr̥dvanīsanhatē, dēvasēnaratē dēvatānāṁ vatē,
Suravaranuta darśitātmīya divyāsvarūpāmarastōma sampūjya,
Kārāgr̥hāvāptakajjātastutyāścaryāmāhātmya
Śaktyagrasambhinna śailēndra daitēya sanhāra santōṣitāmārtya
Saṅkaౢpta divyābhiṣēkōnnatē, tōṣitaśrīpatē,
Sumaśarasamadēvarājātma bhūdēvasēnākara grāhasamprāpta
Sammōdavallī manōhāri līlāviśēṣēndrakōdaṇḍabhāsvatkalāpōcya
Bar’hīndra vāhādhirūḍhātidīnaṁ kr̥pādr̥ṣṭipātēna mānrakṣa
Tubhyaṁ namō dēva tubhyaṁ namō dēva tubhyaṁ namō dēva tubhyaṁ namaḥ ॥
****** ॥ Śrī subrahmaṇya daṇḍakaṁ sampūrṇam ॥ ******
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******
వినాయకుడూ సుబ్రహ్మణ్యుడూ బ్రహ్మచారులా?
గణపతి – సిద్ధిబుద్ధి, కుమారస్వామి – వల్లీదేవసేనలను భార్యాభర్తలుగా అన్వయించడానికి వీలులేదు. శక్తులకు సంకేతం. అందుకే దీనిని భ్రాంతిమాత్రదాంపత్యం అంటారు. దాంపత్యం వంటిదే తప్ప దాంపత్యం కాదు. ఇది ఉపాసనాపరమైన మర్మం.
గణపతికి సిద్ధిబుద్ధి భార్యలు, పుత్రులు క్షేముడు, లాభుడు. ఇవి సంకేతములు మాత్రమే. దేవతా విషయంలో స్త్రీలు అని చెప్పినప్పుడు శక్తులు అని అర్థం. గణపతి కార్యసిద్ధిని కలిగించే దేవత. అందుకే సిద్ధివినాయకుడు అంటాం. ఏ కార్యమైనా మనకి పరిపూర్ణఫలం ఇవ్వాలంటే రెండు లక్షణాలు ఉండాలి – కార్యానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి, చిట్టచివరికి ఆ కార్యం మనకి సిద్ధింపబడాలి. అందుకే కార్యానికి కావలసిన జ్ఞానము బుద్ధి, కార్యము యొక్క ఫలము సిద్ధి. ఈ రెండింటినీ శక్తులుగా కలిగినటువంటి కార్యసాధక శక్తి ఏదైతే ఉన్నదో ఆయన గణపతి. కార్యానికి అవసరమైన సాధన బుద్ధి, కార్యం యొక్క ఫలం సిద్ధి. ఈ రెండింటినీ ఇచ్చేవాడు విఘ్నసంహారకుడైన గణపతి. ఇవి లభిస్తే మనకు లభించేది క్షేమము, లాభము. క్షేమం పరమార్థానికి సంబంధించినది, లాభం భౌతికమైన ఇహజీవితానికి సంబంధించినది. ఈ రెండూ గణపతి వల్ల మనకు లభిస్తున్నాయి కాబట్టి పుత్రస్థానాలుగా చెప్పారు. అంతేకానీ భార్యలని, పుత్రులని భౌతికంగా, లౌకికంగా, దేవతారూపంగా కూడా భావించడం తగని విషయం. అయితే ఉపాసనాపరంగా వాటి బీజములు వాటికి ఉన్నాయి గనుక మంత్రబీజం అంటూ ఉంటే దేవతాకృతి అంటూ ఉంటుంది గనుక సిద్ధీబుద్ధీయుత గణపతిని ఉపాసించడం అనే మంత్రశాస్త్రవిషయం వేరు. అది పౌరాణిక కథలకు అన్వయించడానికి లేదు.
యోగపరంగా చెప్పుకుంటే యోగియైన సాధకుడికి ఋతంభరా అయినటువంటి ప్రజ్ఞ లభిస్తుంది. సృష్టికి ఆధారమైనటువంటి సత్యాలకి కూడా ఏవి ఆధారమైనవో ఆ సత్యాలను ఋతములు అంటారు. ఆ ఋతములు తెలుసుకోగలిగే ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో దానిని ఋతంభరా ప్రజ్ఞ అంటారు. యోగియైన సాధకుడికి ఋతంభరా ప్రజ్ఞ సమృద్ధిగా ఉంటుంది. ఆ ఋతంభరా ప్రజ్ఞాస్వరూపుడే గణపతి. అయితే ఈ ప్రజ్ఞాలాభం కలిగినప్పుడు బుద్ధి, సిద్ధి మనకి వశ్యం అవుతాయి. ఆ ప్రజ్ఞ కలుగకుండా అడ్డుకునేవి బుద్ధి, సిద్ధి. మన బుద్ధి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. బుద్ధి రకరకాలుగా ఆలోచనలు చేసి మేధాపరమైన భావనలు తెచ్చేటప్పటికీ బుద్ధికి కూడా అతీతమైనటువంటి ఋతంభరా ప్రజ్ఞను చేరుకోవడానికి బుద్ధియే ఆవరోధం అవుతోంది.
యోగంలో అణిమ, మహిమ మొదలైన రకరకాల సిద్ధులు వస్తూ ఉంటాయి. ఆ సిద్ధులు వచ్చినప్పుడు లోభపడిపోయి పడిపోతాం. ఋతంభరా ప్రజ్ఞకు వెళ్ళడానికి బుద్ధి, సిద్ధి కూడా అవరోధాలు అవుతూ ఉంటాయి. ఋతంభరా ప్రజ్ఞా స్వరూపుడైన గణపతిని ఆరాధన చేసినప్పుడు ఆయన బుద్ధి సిద్ధులను తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడు. బుద్ధి సిద్ధులు వశమై ఉంటాయి ఋతంభరా ప్రజ్ఞ కలిగిన వారికి. అందుకు బుద్ధిసిద్ధులు పత్నులుగా చెప్పబడుతున్నారు. వాటిని వశం చేసుకున్నవాడే సర్వ విఘ్నములనూ తొలగించుకున్నావాడై పరమార్థాన్ని పొందగలడు. అందుకే విఘ్నసంహారకుడు అని పేరు.
కుమారస్వామి, వల్లీ దేవసేన అని చెప్పినప్పుడు వల్లి అనగా లత అని అర్థం. కుండలినీ శక్తియే ఈ లత(వల్లి) అని చెప్పబడుతున్నది. విశ్వంలో ఉన్న ప్రకృతి శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవసేనలు. దివ్యశక్తులన్నింటినీ సమీకరించి నడిపించే ఈశ్వర చైతన్యమే దేవసేనాపతియైన సుబ్రహ్మణ్యుడు.
గణపతిని, కుమారస్వామిని నైష్టిక బ్రహ్మచారులు అంటారు. అందుకే గణపతి ఆరాధనలోను, సుబ్రహ్మణ్య ఆరాధనలోను బ్రహ్మచారి (వటువు) పూజ ప్రత్యేకించి చెప్పారు. ఈ వటుపూజయే తెలియజేస్తుంటుంది వాళ్ళు నిత్యబ్రహ్మచారులు అని.
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******