Tag Archives:

శ్రీ సుబ్రహ్మణ్య సీస పద్య శతక౦ (Sri Subrahmanya Sisa Padya Satakam)

*** మన పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి నాన్నగారు కీ.శే. బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మ గారు తన తొలి రచనగా వ్రాసినది.***


ఛందస్సు పేరు తరళము (chandas’su pēru taraḷamu):
శరవణోద్భవ! షణ్ముఖేశ్వర! సర్వసంకటనాశకా!
కరుణనేలుము కార్తికేశ్వర! కంజలోచన! శోభనా!
శరణమంచు నుతింతు నిర్మల! సత్త్వరూప శుభప్రదా!
గురుగుహానిజ భక్తపాలక! కూర్మిజూపుము నా పయిన్

Śaravaṇōdbhava! Ṣaṇmukhēśvara! Sarvasaṅkaṭanāśakā!
Karuṇanēlumu kārtikēśvara! Kan̄jalōchana! Śōbhanā!
Śaraṇaman̄chu nutintu nirmala! Sattvarūpa śubhapradā!
Guruguhānija bhaktapālaka! Kūrmijūpumu nā payin

తురగవల్గము (గుఱ్ఱము నడిచే విధంగా ఉంటుంది) – Turagavalgamu:
తురగవల్గమనెడి రగడ తుష్టిమీర వినుతిజేతు
కరుణహృదయు కార్తికేయు కరుణనునేబొంద దలచి
తారాసురాపహార తాపత్రయవన కుఠార
ద్విరదపీన కరసమాన! దివ్యబాహు విలసితాస్త్ర

Turagavalgamaneḍi ragaḍa tuṣṭimīra vinutijētu
karuṇahr̥dayu kārtikēyu karuṇanunēbonda dalachi
tārāsurāpahāra tāpatrayavana kuṭhāra
dviradapīna karasamāna! Divyabāhu vilasitāstra

లాటీవిట వృత్తము (Lāṭīviṭa vr̥ttamu):
సురవందిత నీ చరణాబ్జములన్ సుబ్రహ్మణ్యా! గొల్తునికన్
కరుణాకర హే నత పాలన కృద్గంభీరాభ్ధే పాలయ మాం
నిరతం నిఖిలామర సంస్తుతయో నిత్యానందాయంచు మదిన్
శరకాసన సంభవ నీ భక్తిని సౌఖ్యంబంచెన్నెదన్నెపుడున్

Suravandita nī charaṇābjamulan subrahmaṇyā! Goltunikan
karuṇākara hē nata pālana kr̥dgambhīrābhdhē pālaya māṁ
nirataṁ nikhilāmara sanstutayō nityānandāyan̄chu madin
śarakāsana sambhava nī bhaktini saukhyamban̄chennedannepuḍun

మంగళమహశ్రీ వృత్తము (Maṅgaḷamahaśrī vr̥ttamu):
తారకమహాసుర విదారక శుభాకర సు
దారుణ నతాఘతతి దావ రణచండ గనుదేవా
గారవమునెంచి నిను కావ్యమున గొల్చెదను
కాలచలనాకరణ కార్యతతి నిర్వహణశీలా
భీరుజనభీతిహర! ప్రేమమయమానసని
పీడిత సురౌఘముల పీడలనుబాపు రణధీరా
నేరములనెంచకిక నిశ్చలపు భక్తియు సు
నిష్ఠయునొసంగుము వినీత జన పాల! వరదాతా!

Tārakamahāsura vidāraka śubhākara su
dāruṇa natāghatati dāva raṇachaṇḍa ganudēvā
gāravamunen̄chi ninu kāvyamuna golchedanu
kālachalanākaraṇa kāryatati nirvahaṇaśīlā
bhīrujanabhītihara! Prēmamayamānasani
pīḍita suraughamula pīḍalanubāpu raṇadhīrā
nēramulanen̄chakika niśchalapu bhaktiyu su
niṣṭhayunosaṅgumu vinīta jana pāla! Varadātā!

మానిని(Mānini:)
కారణ కారణ! సంగరచండ! సుకారుణికోత్తమ! షణ్ముఖ! నే
గోరితి నీ పదభక్తిని నిత్యము గూర్మి నొసంగుము కాదనకన్
సార యశోఘన చిత్రవిచిత్ర సుచారు చరిత్ర మహేశ్వరజా
పారము చేరగలేక తపించెడి పాపుడ నన్నిక నేలుమయా!

Kāraṇa kāraṇa! Saṅgarachaṇḍa! Sukāruṇikōttama! Ṣaṇmukha! Nē
gōriti nī padabhaktini nityamu gūrmi nosaṅgumu kādanakan
sāra yaśōghana chitravichitra suchāru charitra mahēśvarajā
pāramu chēragalēka tapin̄cheḍi pāpuḍa nannika nēlumayā!

హళముఖీ (Haḷamukhī);
సత్యసుందర శివకరా
నిత్యనిర్గుణ నిరుపమా
సత్య సౌఖమునొసగుమా
నిత్యమున్నిను గొలిచెదన్

satyasundara śivakarā
nityanirguṇa nirupamā
satya saukhamunosagumā
nityamunninu golichedan

ప్రమాణి (Pramāṇi):
వినంద్వదీయ గాధలన్
కనంద్వదీయ రూపమున్
చనంద్వదీయ క్షేత్రమున్
వినన్ కనన్ చనన్ మహా
త్మ! నాకొనర్పుమా దయన్
సనాతనా జగద్గురూ
సునాస సుందరాంగ నా
మనంబునన్వసింపుమా.

Vinandvadīya gādhalan
kanandvadīya rūpamun
chanandvadīya kṣētramun
vinan kanan chanan mahā
tma! Nākonarpumā dayan
sanātanā jagadgurū
sunāsa sundarāṅga nā
manambunanvasimpumā

సంతానం – సుబ్రహ్మణ్యేశ్వరుడు

పార్వతీ పరమేశ్వరులను దర్శించటానికి అనేక మంది తాపసులు కైలాసానికి వచ్చారట. అందులో దిగంబర ఋషులు ఉండటంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హేళనగా నవ్వాడు, దానికి పార్వతిదేవి కుమారుని మందలించి, మర్మాంగాలు సృష్టి వృద్ధికోసం సృష్టి౦చినవి, జాతికి జన్మ స్థానాలని తెలియజెప్పింది. తల్లి జ్ఞానబోధతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్ప రూపం దాల్చి పాప పరిహారం కోసం తపస్సు ప్రారంభించాడు. జీవ కణాలు పాముల్లా ఉంటాయని మనకు తెలిసిందే. ఆ తరువాత వాటికి అధిపతి అయ్యాడు. సంతానంలేని దంపతులకు సంతానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవటం ద్వారా కలుగుతుందనేది శాస్త్రవచనం.

శ్రీ సుబ్రహ్మణ్య మూల మంత్ర స్తవం (Sri Subrahmanya Moola Mantra Sthavam)

స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click here to listen the Stotram):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Stotram MP3): శ్రీ సుబ్రహ్మణ్య మూల మంత్ర స్తవం (Sri Subrahmanya Moola Mantra Sthavam)

ఓం అఘాగఛ్చ౦ స౦ప్రవక్ష్యామి – మూల మంత్ర స్తవం శివమ్
జపతాం శృణ్వతాం నృణామ్ – భుక్తి ముక్తి ప్రదాయకమ్.

Ōṁ aghāgachham sampravakṣyāmi – mūla mantra stavaṁ śivam
japatāṁ śr̥ṇvatāṁ nr̥ṇām – bhukti mukti pradāyakam.    || 1 ||

సర్వ శత్రు క్షయకరం – సర్వ రోగ నివారణమ్
అష్టైశ్వర్యప్రదం నిత్యం – సర్వలోకైక పావనమ్.

Sarva śatru kṣayakaraṁ – sarva rōga nivāraṇam
aṣṭaiśvaryapradaṁ nityaṁ – sarvalōkaika pāvanam.     || 2 ||

శరారణ్యోద్భవం స్కందం – శరణాగతపాలకమ్
శరణం త్వాం ప్రపన్నస్య – దేహి మే విపులాం శ్రియమ్.

Śarāraṇyōdbhavaṁ skandaṁ – śaraṇāgatapālakam
śaraṇaṁ tvāṁ prapannasya – dēhi mē vipulāṁ śriyam.     || 3 ||

రాజ రాజసఖోద్భూతం – రాజీవాయతలోచనం
రతికోటి సౌందర్యం – దేహి మే విపులాం శ్రియమ్.

Rāja rājasakhōdbhūtaṁ – rājīvāyatalōchanaṁ
ratikōṭi saundaryaṁ – dēhi mē vipulāṁ śriyam.      || 4 ||

వలారిప్రముఖైర్వన్ద్య – వల్లీ౦ద్రాణి సుతాపతే
వరదాశ్రితలోకానాం – దేహి మే విపులాం శ్రియమ్.

Valāripramukhairvandya – vallīmdrāṇi sutāpatē
varadāśritalōkānāṁ – dēhi mē vipulāṁ śriyam.     || 5 ||

నారదాది మహాయోగి – సిద్ధ గంధర్వ సేవితం
నవ వీరై: పూజితా౦ఘ్రి – దేహి మే విపులాం శ్రియమ్.

Nāradādi mahāyōgi – sid’dha gandharva sēvitaṁ
nava vīrai: Pūjitāmghri – dēhi mē vipulāṁ śriyam.   || 6 ||

భగవన్ పార్వతీసూనో – స్వామిన్ భక్తార్తిభంజన
భగవత్పాదాబ్జయోర్భక్తి౦ – దేహి మే విపులాం శ్రియమ్.

Bhagavan pārvatīsūnō – svāmin bhaktārtibhan̄jana
bhagavatpādābjayōrbhaktim – dēhi mē vipulāṁ śriyam.    || 7 ||

వసుధాన్యం యశ: కీర్తిం అవిచ్ఛేదంచ సంతతే:
శత్రునాశనమద్యాశు – దేహి మే విపులాం శ్రియమ్.

Vasudhān’yaṁ yaśa: Kīrtiṁ avichhēdan̄cha santatē:
Śatrunāśanamadyāśu – dēhi mē vipulāṁ śriyam.    || 8 ||

ఇదం షడక్షర స్తోత్రం – సుబ్రహ్మణ్యస్య స౦తత౦
య: పఠేత్తస్య సిద్ధ్య౦తి – సంపదశ్చి౦తితాధికా:

Idaṁ ṣaḍakṣara stōtraṁ – subrahmaṇyasya santatam
ya: Paṭhēttasya sid’dhyanti – sampadaśchintitādhikā:    || 9 ||

హృత్పదేభక్తితో నిత్యం – సుబ్రహ్మణ్య౦ స్మరన్ బుధ:
యో జపేత్ ప్రాతరుత్థాయ – సర్వాన్కామానవాప్నుయాత్.

Hr̥tpadēbhaktitō nityaṁ – subrahmaṇyam smaran budhah
Yō japēt prātarut’thāya – sarvānkāmānavāpnuyāt.    || 10 ||

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

కోటంక సుబ్రహ్మణ్యస్వామి ఆలయం

భక్తుల కోరికలను నెరవేర్చడం కోసం సుబ్రహ్మణ్యస్వామి వివిధ ప్రదేశాల్లో అవతరించాడు. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటి అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ‘కోటంక’ గ్రామంలో ఉంది.. గుంటికింద సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం. ఇక్కడ సమీపంలోని పాటకోట కొండ మీద స్వామి స్వయంభువుగా వెలిశాడు. తూర్పు దిక్కుకు అభిముఖంగా నాగేంద్రుడి ఆకారంలో కనిపించే పెద్ద శిలను భక్తులు షణ్ముఖుడి ప్రతి రూపంగా కొలుస్తారు. దీ౦తో గుండు సుబ్బరాయుడు కాస్తా వాడుకలో గుంటికింద దేవుడిగా వాసికెక్కాడు. స్థల మహత్యం తెలిసిన మహర్షులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ తపస్సు చేసేవారని ప్రతీతి. పూర్వం స్వామి, ఏడూ శిరస్సుల సర్పరూపంలో మహర్షులకు దర్శనమిస్తూ వుండేవాడని చెబుతుంటారు.

ఇక్కడ స్వామివారి మూలవిరాట్టు పాదాలకింద పాతాళగంగ వుంది. ఇందులో నీరు చాల తియ్యగా ఉంటుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఇందులోని నీటి ధార తగ్గకపోవడం విశేషంగా చెప్పుకుంటూ వుంటారు. ఇది స్వామివారి మహిమగా విశ్వసిస్తూ వుంటారు. ఈ నీటిని స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తారు. పాతాళ గంగలోని నీటిని తీర్థంగా స్వీకరించడానికి భక్తులు మరింత ఆసక్తిని చూపుతారు. ఈ నీటిని తీర్థంగా స్వీకరించడం వలన, దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం పడతాయని అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

వివాహం విషయంలోను, సంతాన భాగ్యం విషయంలోను ఆలస్యమవుతున్నప్పుడు, ఈ స్వామిని దర్శించుకుని మనసులో మాట చెప్పుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని అంటారు. ఈ క్షేత్రంలో అడుగుపెట్టడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయనీ, పుణ్యఫలాలు చేకూరతాయని చెబుతారు. విశేషమైన పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఆహ్లాదకరమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది.

పురాణగాథ…

పార్వతీపరమేశ్వరుల ముద్దుల తనయుడు కుమారస్వామిని సర్పరూపంలో కొలవడం వెనుక ఓ పురాణ గాథ ఉంది. ఒకానొక సమయములో, ఈశ్వరుడిని దర్శించుకోవడానికి బ్రహ్మ కైలాసానానికి వచ్చారు. ఆయన గొప్పతనాన్ని గుర్తించకుండా బ్రహ్మను అవమానించాడు కార్తికేయుడు. అది తెలిసి పరమశివుడు కొడుకుని మందలించాడు. తానెంత అపరాధానికి పాల్పడ్డాడో సుబ్రహ్మణ్యుడికి అప్పుడు కానీ అర్థం కాలేదు. చాలా పశ్చాత్తాపపడ్డాడు. సృష్టికర్తను అగౌరవ పరిచిన దోషాన్ని తొలగించుకోవడానికి తనకు తాను ఓ శిక్ష విధించుకున్నాడు. భూలోకానికొచ్చి, నాగుపాము రూపంలో రహదారికి అడ్డంగా పడుకున్నాడు. కాటేయడానికి విషసర్పమేమో అనుకుని జనం రాళ్లతో కొట్టసాగారు. దీ౦తో నిలువెల్లా గాయాలు అయ్యాయి. ఆ విషయం పార్వతీ దేవికి తెలిసి, తన బిడ్డను రక్షించమని ముక్కోటి దేవతలను ప్రార్థి౦చింది. మహర్షుల సూచన ప్రకారం, తనయుడితో షష్ఠి వ్రతం చేయించింది. అలా పాప పరిహారం అయిపోయిందని సుబ్రహ్మణ్యుడు సర్పరూపాన్ని విడిచి పెట్టాడని అంటారు. ఆకారణంగానే, స్వామి సర్పరూపంలో భక్తులకు దర్శనం ఇస్తు౦టాడని చెబుతారు.

విశేష పూజలు…

ఇక్కడ మాఘమాసంలోని నాలుగు ఆదివారాలూ విశేషంగా పూజలు జరుగుతాయి. మూడో ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వరుడికి పంచామృతాభిషేకాలు, ఏకాదశవార రుద్రాభిషేకాలు, రథోత్సవం, తిరునాళ్లు జరుగుతాయి. శ్రావణమాసంలో భక్తులు ఉపవాసదీక్షతో పుట్ట వద్ద దీపాలు వెలిగిస్తారు. ఉసిరి, రావి, వేప, కానుగ చెట్లు ఇక్కడి మరింత ఆహ్లాదభరితం చేస్తున్నాయి. దీంతో కార్తీక వనభోజనాలకు భక్తులు తరలి వస్తుంటారు. ఆదివారాలూ, పర్వదినాల్లో అన్నదానం జరుగుతుంది.

ఎక్కడ ఉన్నది?

రోడ్ ద్వారా:
అనంతపురం – బెంగళూరు జాతీయ రహదారిలో గార్లదిన్నె మండలం కేంద్రం నుంచి 10 కి.మీ.ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇది రాయలసీమ ప్రాంతంలోనిది. కోటంక గ్రామం అనంతపురంకి 15 కి.మీ.ల దూరంలో ఉంది. ఆత్మకూరు, అనంతపురం నుండి బస్సులు అందుబాటులో కలవు.

రైలు ద్వారా:
అతి సమీపంలోని రైల్వేష్టేషన్‌ అనంతపురం.




శ్రీ సుబ్రహ్మణ్య ప్రార్థన (Sri Subrahmanya Prathana) II నాగదోష నివారణకు (Navnag Stotra)

స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Stotram):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Stotram): శ్రీ సుబ్రహ్మణ్య ప్రార్థన (Sri Subrahmanya Prathana) II నాగదోష నివారణకు (Navnag Stotra)

అన౦త౦ వాసుకి౦ శేషం I పద్మనాభ౦ చ కంబలమ్,
శంఖఫాలం ధృతతరాష్ట్ర౦ I తక్షకం కాళీయం తథా II

Anantam Vasukim Shesham I Padmanabham cha Kambalam
Shankhapalam Drutarashtram I Taxakam Kaliyam Tatha

ఏతాని నవ నామాని I నాగానాం చ మహాత్మనాం I
సాయంకాలే పఠేన్నిత్యం I ప్రాతఃకాలే విశేషత: II
తస్మిన్ విషభయం నాస్తి I సర్వత్ర విజయీ భవేత్. II

Etani Nava Navaami Naganancha Mahatmana
Sayamkaale Patenityam Prathahkaale Visheshita
Tasmin Vishabhayam Naasti Sarvatra Vijayi Bhaveth

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******