Tag Archives:

శ్రీ సుబ్రహ్మణ్య జననము (Sri Subrahmanya Jananam)

ప్రవచనము పేరు (Title):  శ్రీ సుబ్రహ్మణ్య జననము (Sri Subrahmanya Jananam)

వ్యాఖ్యానం (Given By):  బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు (Brahmasree Chaganti Koteswara Rao garu)

జరిగిన సంవత్సరము (Year): Nov 2003

మొత్తం ప్రవచనం సమయము (Total Audio Duration): 1 గంట, 57 నిమిషములు (1 hour(s), 56 minute(s))

ప్రవచనమును డౌన్లోడ్ చేయుటకు (Please Click here to Download): శ్రీ సుబ్రహ్మణ్య జననము (Sri Subrahmanya Jananam)

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

కుమారస్వామి, సుబ్రమణ్యస్వామి ఒకరేనా?

కృత్తికలు ఆరుగురూ ఏకకాలమునందు పాలివ్వడానికి సిద్ధపడ్డారు. మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడిందని ఆరు ముఖములతో ఆ పిల్లవాడు ఏక కాలమునందు పాలు తాగేశాడు. కాబట్టి “షణ్ముఖుడు” అయ్యాడు.

పిల్లవాడు కృత్తికల పాలు త్రాగాడు కాబట్టి ఈ పిల్లవాడిని “కార్తికేయుడు” అని పిలుస్తారు అన్నారు.

మహానుభావుడు సనత్కుమారు ఇలా జన్మించాడు కాబట్టి, గర్భము జారి పడిపోతే పూర్ణంగా గర్భం పన్నెండు నెలలు లేకుండానే బయటకు వచ్చాడు కాబట్టి ఆయనను “స్కందుడు” అని పిలుస్తారు.

ఆరుగురు కృత్తికల స్తనములను ఏకకాలమునందు పానము చేసినవాడు కనుక ఆయనకు “షడాననుడు”, “షణ్ముఖుడు” అని పేరు వచ్చింది.

పరమశివుని తేజస్సులోంచి శంకరుడికే ఒక కొడుకు పుడితే ఒక కుటుంబం కాదు, ఒక లోకం కాదు సమస్త ప్రపంచం ఆనంద సాగరంలో మునిగిపోయింది. కనుక ఆ పిల్లవాడిని “కుమారా” అని పిలిచారు. అందుకని కుమారా శబ్దము ఈశ్వర పుత్ర సంబందమై శివుని కుమారుడిని ఉద్దేశించిందిగా ఉంటుంది.

అగ్ని దేవుడు పరమశివుని తేజస్సుని తనయందు ఉంచుకొని గంగయందు ప్రవేశపెట్టిన కారణము చేత ఆ పిల్లవానిని “పావకి” అని పిలిచారు.

ఒకేసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యూవనంలో ఉన్న “కుమారస్వామిగా” మారిపోయారు.

ఉత్తరక్షణం ఈయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజు నాడే దేవతలందరూ అయనను దేవసేనాధిపతిగా అభిషేకం చేసేశారు. కాబట్టి “సేనాని” అని పేరు పొందాడు.

ఈయనకే “గుహ” అని పేరు ఉంది.

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

శ్రీ సుబ్రహ్మణ్య ధ్యానం (Sri Subrahmanya Dhyanam) II ధ్యాయేత్ బాలార్క (Dhyayet Balaarka)


ధ్యాయేత్ బాలార్క కాంతి శరవణజనితం పార్వతీప్రీతి పుత్రం
ధ్యానప్రేమం కృపాలుం వరద మధుహారం పుణ్యరూపం పవిత్రం
నిత్యానందం వరేణ్యం రజతగిరి వరోత్తుంగ, శృ౦గాధివాసం
నిత్యం దేవర్ష వంద్యం భవహరమమలం వేదేద్యం పురాణాం II

dhyāyēt bālārka kānti śaravaṇajanitaṁ pārvatīprīti putraṁ
dhyānaprēmaṁ kr̥pāluṁ varada madhuhāraṁ puṇyarūpaṁ pavitraṁ
nityānandaṁ varēṇyaṁ rajatagiri varōttuṅga, śr̥ungādhivāsaṁ
nityaṁ dēvarṣa vandyaṁ bhavaharamamalaṁ vēdēdyaṁ purāṇāṁ II

****** శ్రీ సుబ్రహ్మణ్య ధ్యానం సంపూర్ణం (This is the end of Sri Subrahmanya Dhyanam) ******

        ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య శ్లోకములు (Sri Subrahmanya Sloka)


శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివ రూపిణే
యధా తరం నవశ్యామితే నతౌ దిశత: శివమ్

śivāya viṣṇu rūpāya viṣṇavē śiva rūpiṇē
yadhā taraṁ navaśyāmitē natau diśata: Śivam    || 1 ||

అనాదిమధ్యనిధనమేతత్ అక్షరమవ్యయమ్
తదేవతే ప్రవక్ష్యామి రూపం హరిహరాత్మకం

anādimadhyanidhanamētat akṣaramavyayam
tadēvatē pravakṣyāmi rūpaṁ hariharātmakaṁ     || 2 ||

యో విఘ: సతువైరుద్రో యో రుద్ర: సపితామహా:
ఏకామూర్తి స్త్రయోదేవా రుద్ర విఘ్న పితామహా:
సమేత్య ఋషిభిస్సర్వై: స్తుతి సాతి మహర్షిభి
వ్యాసేన వేదవిదుషా నారదేన చ ధీమతా:
భరద్వాజేన గర్గేణ విశ్వామిత్రేన వైతధా
అగస్త్యేన పులస్త్యేన దౌమ్యేనతు మహాత్మనా

yō vigha: Satuvairudrō yō rudra: Sapitāmahā:
Ēkāmūrti strayōdēvā rudra vighna pitāmahā:
Samētya r̥ṣibhis’sarvai: Stuti sāti maharṣibhi
vyāsēna vēdaviduṣā nāradēna cha dhīmatā:
Bharadvājēna gargēṇa viśvāmitrēna vaitadhā
agastyēna pulastyēna daumyēnatu mahātmanā     || 3 ||

        ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య ప్రార్థన (Sri Subrahmanya Prathana) II నిత్యాన్నదాన (Nityannadana)

నిత్యాన్నదాన నిరతం I సచ్చిదానంద విగ్రహం I
సర్వరోగహరం దేవం I శ్రీ సుబ్రహ్మణ్యముపాస్మహే II

Nityānnadāna nirataṁ I saccidānanda vigrahaṁ I
sarvarōgaharaṁ dēvaṁ I śrī subrahmaṇyamupāsmahē II

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******