Tag Archives:

ముత్తుస్వామి దీక్షితార్

సంగీత త్రిమూర్తులు…

త్యాగరాజు కాలం (1767 – 1847) లోనే సంగీతంలో అనేకమంది ప్రజ్ఞావంతులు ప్రపంచం నలుమూలలా జన్మించారు. తంజావూరు రాజ్యంలో 1700 – 1850 కాలంలోనూ, దక్షిణాదిన కొన్ని రాజ్యాల్లోనూ కర్ణాటక సంగీతం వెల్లి విరిసింది. కర్ణాటక సంగీతానికొక రూపూ, పద్ధతీ వచ్చిందీ ఆ కాలంలోనే. త్యాగరాజు జన్మించిన కాలంలోనే తిరువారూర్లో మరో ఇద్దరు సంగీత దిగ్గజాలు పుట్టారు. ఒకరు శ్యామ శాస్త్రి, రెండో వారు ముత్తుస్వామి దీక్షితార్. త్యాగరాజుతో కలిపి ఈ ముగ్గుర్నీ ‘సంగీత త్రిమూర్తులు’ (మ్యూజికల్ ట్రినిటీ) అని అంటారు. శ్యామశాస్త్రి 1762 లో పుడితే, 1776 లో ముత్తుస్వామి దీక్షితార్ పుట్టారు. ఇందులో చిత్రం ఏమిటంటే ఈ ముగ్గురు వాగ్గేయకారులూ తిరువారూర్లోనే పుట్టారు. దాదాపు ఒకే సమయంలోనే జీవించారు.

ముత్తుస్వామి దీక్షితార్…

కర్ణాటక సంగీతంలో దీక్షితార్ కుటుంబానికొక ప్రత్యేక స్థానం వుంది. సంగీత త్రిమూర్తుల్లో ఒకరుగా చెప్పుకుంటున్న ముత్తుస్వామి దీక్షితార్ తండ్రి రామస్వామి దీక్షితార్ ప్రముఖ సంగీత విద్వాంసుడు. ఈయన ‘అష్టోత్తర శత రాగ రత్నమాలిక’ అనే అతి పెద్ద కృతిని స్వరకల్పన చేసారు. ఇది రాగయుక్తంగా ఆలాపనలతో పాడడానికి ఓ రోజు పైగా పడుతుందని అంటారు. అటువంటి సంగీత విద్వాంసుడింట 1776 లో జన్మించారు ముత్తుస్వామి దీక్షితార్. హైదరాలీ అకృత్యాలతో తంజావూరు చుట్టుపక్కల వూళ్ళన్నీ ధ్వంసమయిపోతే, రామస్వామి దీక్షితార్ స్వస్థలమైన విరించిపురం వదిలి తిరువదమర్దూరు మకాం మార్చారు. అక్కడ నుండి తిరువారూర్ వచ్చి స్థిరపడ్డారు.

ఓసారి మనాలి ముత్తుకృష్ణ ముదలియార్ అనే ఒక యతీంద్రుడు వచ్చినపుడు ఆయన కోరికపై ముత్తుస్వామి దీక్షితార్ని పదిహేడేళ్ళ వయసులో మిగతా కొడుకులిద్దరితోనూ తండ్రి కాశీ పంపించాడు. సుమారు పదేళ్ళు దీక్షితార్ అక్కడే గడిపారు. అప్పటికే ముత్తుస్వామి దీక్షితార్ పెళ్ళయ్యింది. అన్నలిద్దరూ, చిన్న స్వామి దీక్షితార్, బాలస్వామి దీక్షితార్ ఏడాదిలో తిరువారూరు వెనక్కి తిరిగొచ్చేసినా ముత్తుస్వామి దీక్షితార్ మాత్రం కాశీ లోనే ఉండిపోయాడు. కేవలం గాయకుడు మాత్రమే కాదు, ముత్తుస్వామి దీక్షితార్ మంచి వైణికుడు కూడా.

సుమారు 1801 ప్రాంతంలో తిరిగి తిరువారూరొచ్చారు. అప్పటికే బాలుస్వామి, చిన్నస్వామిలిద్దరూ జంట విద్వాంసులుగా ప్రసిద్ధి చెందారు. వీరికి మదురై ఆస్థానం నుండి పిలుపు రావడంతో అక్కడకి వెళిపోయారు. అక్కడుండగానే చిన్నస్వామి దీక్షితార్ చనిపోయాడు. అన్నగారి మరణంతో కలత చెందిన బాలుస్వామి కొంతకాలం తీర్థయాత్రలు చేసి ఎత్తియపురం రాజాస్థానంలో చేరాడు. అప్పటివరకూ అవివాహితుడుగానున్న బాలస్వామికి ఎత్తియపురం రాజుగారు దగ్గరుండి పెళ్ళి జేసారు. ఈ వార్త ముత్తుస్వామి దీక్షితార్ చెవినపడి అన్నగార్ని చూడ్డానికని వెళ్ళాడు. అన్నగార్ని కలిసాక ఎత్తియపురం ఆస్థానంలో సంగీత కచేరీ చేసే అవకాశం ముత్తుస్వామి దీక్షితారుకొచ్చింది.

ముత్తుస్వామి దీక్షితార్ తమిళ, సంస్కృత భాషల్లో ప్రవీణుడు. ఈయన స్వరపరిచిన కృతులన్నీ సంస్కృతంలోనే ఉంటాయి. ఒక్క రచనా తెలుగులో లేదు. ముత్తుస్వామి దీక్షితార్ సముదాయ కృతులెక్కువగా రచించాడు. సముదాయ కృతులంటే ఒక స్థలాన్ని కానీ, ఒక ప్రదేశాన్ని కానీ, ఒక దైవాన్ని కానీ వుద్దేశించి రచించినవి. ఇవి గుంపుగా 5 లేదా 6 కృతులు కలిపుంటాయి. నవగ్రహ కీర్తనలు, నవరత్న కీర్తనలూ, పంచలింగ స్థల కృతులూ వీటిలో కొన్ని చెప్పుకోదగ్గవి.

ముత్తుస్వామి దీక్షితార్ కృతి ముద్ర – ‘గురు గుహ’. సాధారణంగా కృతుల ఆఖరి చరణంలో వాగ్గేయకారుల ముద్ర కనిపిస్తుంది. కానీ ముత్తుస్వామి దీక్షితార్ కృతుల్లో మాత్రం ఈ ముద్ర పల్లవిలో కానీ, అనుపల్లవిలో కానీ, చరణంలో కానీ వుంటుంది. ముత్తుస్వామి దీక్షితార్ కొన్ని కృతుల్లో ‘త్యాగరాజ’ అన్నది కనిపిస్తుంది. ఇది చూసి వాగ్గేయకారుడు త్యాగరాజు పై గౌరవంతో రాసిందిగా కొందరు అపోహపడే అవకాశముంది. ఇక్కడ త్యాగరాజు అంటే తిరువారూర్ గ్రామ దైవం ‘త్యాగరాజ స్వామి’ నుద్దేశించని అనుకోవాలి.

ముత్తుస్వామి దీక్షితార్ పై పశ్చిమదేశ సంగీత ప్రభావం కూడా వుంది. దీక్షితార్ అన్నయ్య బాలుస్వామి కచేరీల్లో పక్క వాయిద్యంగా వయులిన్ వాడకాన్ని ప్రవేశపెట్టాడు.తిరుక్కడైయూర్ భారతి, తేవూర్ సుబ్రహ్మణ్యయ్యర్, శుద్ధ మద్దాళం తంబియప్ప, వీణ వెంకట్రామయ్యర్, కోర్నాడ్ రామస్వామి, తిరువారూర్ అయ్యస్వామి, తంజావూరు చతుష్టయం పొన్నయ్య, చిన్నయ్య, శివనందం, వడివేలు, తిరువారూర్ కమలం, వళ్ళలార్ కోయిల్ అమ్మణి ఈయనకున్న శిష్యగణం. 1935 లో యత్తియపురం రాజ బంధువుల వివాహానికెళ్ళి అక్కడే దీక్షితార్ చనిపోయారు. ఎ.ఎం.చిన్నస్వామి ముదిలియార్ ‘ఓరియంటల్ మ్యూజిక్’ అనే పుస్తకంలో ఇలా రాస్తారు. “త్యాగరాజ కృతులు చెవిన పడగానే ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. ముత్తుస్వామి దీక్షితార్ కృతులలాకాదు. ఒకటికి పదిమార్లు విని, శోధిస్తే కానీ ఆ కృతుల్లో గొప్పదనం తెలీదు”.

సర్వదేవతలనూ కీర్తించి సర్వక్షేత్రములలోనున్న దేవతలను తన సంగీతంతో పరవశింపజేసి అనుగ్రహాన్ని పొందిన మహానుభావులు దీక్షితుల వారు. సంగీత మూర్తిత్రయంలో ఒకరు ఆయన. మహోపాసకులు. పైగా దక్షణామూర్తి విద్యయైనటువంటి శ్రీవిద్యలో ఉద్దండుడు. పరదేవతయైనటువంటి ఆ తల్లి ఆయనకు వీణను ప్రదానం చేసింది. వీణ అంటే దక్షిణామూర్తి స్వరూపమే. అంతేకాక వారిద్దరి బిడ్డ, బ్రహ్మవిద్యా స్వరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారినోట్లో కలకండ పెట్టాడు. వెంటనే “స్వామినాథ పరిపాలయా సుమాం శ్రీ గురుగుహతారయాసుమాం” అంటూ గురుగుహ ముద్రతో ఎన్నో కీర్తనలు అందించాడు మహానుభావుడు.

ఆయన నుతించని దేవత లేదు. ప్రతి కీర్తన మనం పలికేటప్పుడు, వినేటప్పుడు అందులోని దేవత కనిపిస్తాడు. అంత దివ్యంగా అందించిన ఆయన దక్షణామూర్తిమీద చాలా కీర్తనలు రచించారు. ఆయనా పెద్ద ఉపాసకుడు, తత్త్వవేత్త. పైగా శంకరాచార్యులపై కూడా ఒక సంకీర్తన రచించారు ఆయన. అంటే శంకరాద్వైత సిద్ధాంతాన్ని తన హృదయంలో నింపుకున్న వాడాయన.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనము నుంచి…

ముత్తుస్వామి దీక్షితార్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మీద ఎన్నో కీర్తనలు రాసారు. అందులో కొన్ని ఇక్కడ అందజేస్తున్నాము.

1 . స్వామినాథ పరిపాలయ:

2 . పురహర నందన:

3 . వల్లీ దేవసేనాపతే:

4. ముత్తుస్వామి దీక్షితార్ మరో కీర్తన:

మరిన్ని వివరాలకై ఇచ్చట చుడండి: ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలు ۞♫

మరిన్ని వివరాలకై ఇచ్చట చుడండి: ముత్తుస్వామి దీక్షితార్ వికీపీడియా

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

ముత్తుస్వామి దీక్షితార్ గారి చిత్రం…

ముత్తుస్వామి తపాలా బిళ్ళ…

అరుణాచల మాహాత్యం – రమణ తత్త్వం II ప్రవచనము

        ****** భగవాన్‌ శ్రీ రమణ మహర్షి (శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అవతారం) ******

ప్రవచనము పేరు:  అరుణాచల మహాత్మ్యం II రమణ తత్త్వం

వ్యాఖ్యానం:    బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు

జరిగిన సంవత్సరము: 2011

భాగము 1 of 8 ప్రవచనమును వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click on the ► icon to Listen Part 1 of 8):

ప్రవచన సమయం = 01:38:20..


ప్రవచనమును డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి: అరుణాచల మహాత్మ్యం II రమణ తత్త్వం II Part1

video
play-sharp-fill

భాగము 2 of 8 ప్రవచనమును వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click on the ► icon to Listen Part 2 of 8):
ప్రవచన సమయం = 01:40:00..


ప్రవచనమును డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి: అరుణాచల మహాత్మ్యం II రమణ తత్త్వం II Part2

video
play-sharp-fill

భాగము 3 of 8 ప్రవచనమును వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click on the ► icon to Listen Part 3 of 8):
ప్రవచన సమయం = 01:23:20..


ప్రవచనమును డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి: అరుణాచల మహాత్మ్యం II రమణ తత్త్వం II Part3

video
play-sharp-fill

భాగము 4 of 8 ప్రవచనమును వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click on the ► icon to Listen Part 4 of 8):
ప్రవచన సమయం = 01:45:00..


ప్రవచనమును డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి: అరుణాచల మహాత్మ్యం II రమణ తత్త్వం II Part4

video
play-sharp-fill

భాగము 5 of 8 ప్రవచనమును వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click on the ► icon to Listen Part 5 of 8):
ప్రవచన సమయం = 01:45:00..


ప్రవచనమును డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి: అరుణాచల మహాత్మ్యం II రమణ తత్త్వం II Part5

video
play-sharp-fill

భాగము 6 of 8 ప్రవచనమును వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click on the ► icon to Listen Part 6 of 8):
ప్రవచన సమయం = 01:28:50..


ప్రవచనమును డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి: అరుణాచల మహాత్మ్యం II రమణ తత్త్వం II Part6

video
play-sharp-fill

భాగము 7 of 8 ప్రవచనమును వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click on the ► icon to Listen Part 7 of 8):
ప్రవచన సమయం = 01:14:10..


ప్రవచనమును డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి: అరుణాచల మహాత్మ్యం II రమణ తత్త్వం II Part7

video
play-sharp-fill

భాగము 8 of 8 ప్రవచనమును వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click on the ► icon to Listen Part 8 of 8):
ప్రవచన సమయం = 01:46:40..


ప్రవచనమును డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి: అరుణాచల మహాత్మ్యం II రమణ తత్త్వం II Part8

video
play-sharp-fill

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

అన్నామలైశ్వరుడు – అరుణాచలము

వినాయకునికి వందనములు. కుమారస్వామికి వందనములు.

జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దివ్యక్షేత్రం. అరుణాచలం

        అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలా I
        అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలా I I

తిరువణ్ణామలై (అరుణాచలం) స్మరణ మాత్రం చేత ముక్తినిచ్చే క్షేత్రం. తిరు అనగా “శ్రీ”, అణ్ణామలై అనగా “పెద్దకొండ”. దీనినే “అరుణాచలము” అంటారు. అరుణాచలము అనగా అరుణ – ఎర్రని, అచలము – కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ = పాపములను పరిహరించునది అని అర్ధము.

ఇది భూమండలములో అన్నిప్రదేశాల కంటే పురాతనమైనదనీ, ఇది సమస్త భూమండలానికి మధ్యన ఉండి, దాని హృదయం వంటిదనీ చెప్పుకొంటారు.

భూరంభాంస్యనలో నిలోమ్బర మహార్నాథో హిమాంశుః పుమాన్‌ �ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్‌ �నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః �తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే’’

జగద్గురు ఆదిశంకరాచార్య చెప్పిన దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక పాదం ఇది. దీని అర్థమేమంటే.. అంతటా నిండి నిబిడీకృతమైన శివ చైతన్యం కంటికి కనపడే విధంగా అష్టమూర్తి తత్వంగా ప్రకాశిస్తుంది అని. ఈ ప్రపంచంలో మనం శివుడిని ఎనిమిది రూపాల్లో చూడగలమట. ఆయన తత్వమంతా ఎనిమిది అంకెమీదే నడుస్తుంది. పృథ్వి, అగ్ని, జలం, వాయు, ఆకాశములు పంచ భూతాలు.. ఈ ఐదుతో పాటు సూర్యచంద్రులు, జీవుడు. ఈ ఎనిమిది శివస్వరూపాలు. వీటిని శివ స్వరూపాలుగా నిర్థారణ చేయడం కోసమే ఈ ఎనిమిది లింగాలు మనకు దర్శనమిస్తున్నాయి.

అవి కంచిలో పృథ్వి లింగం, జంబుకేశ్వరంలో జల లింగం, అరుణాచలంలో అగ్ని లింగం, చిదంబరంలో ఆకాశ లింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్క్‌లో సూర్య లింగం, సీతాకుండంలో చంద్ర లింగం, కాఠ్‌మాండులో యజమానలింగం.

ఈ తిరువణ్ణామలై క్షేత్రం తమిళనాడులో ఉన్నది. అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నాడు. అగ్ని అంటే జ్వాల. మిగిలిన పంచభూత లింగాల మాదిరిగా ఇక్కడి శివుడు అగ్నిరూపంలో దర్శనమివ్వడు. కేవలం రాతి లింగంగానే ఉంటాడు. అరుణాచలం పరిసర ప్రాంతాలతో పోలిస్తే ఆలయంలో విపరీతమైన వేడి ఉంటుంది. అది జ్ఞానాగ్ని వల్ల వచ్చే వేడి అంటారు. జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వారి కర్మలు దగ్ధమవుతాయి. దాని వలన మళ్లీ జన్మించాల్సిన అవసరం లేకుండా పాపాలన్నీ పోతాయి. అందుకే అరుణాచలాన్ని జ్ఞానస్వరూపమైన అగ్నిలింగం అంటారు.

పురాణగాథ…

పూర్వం బ్రహ్మ, మహా విష్ణువుల్లో ఎవరు గొప్ప అనే దానిపై ఇరువురు కలహించుకొన్నారట. సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికారుడైన విష్ణువు శివమాయకు వశం కావడం ఈ కలహానికి కారణమైంది. శివ మాయా మోహితులైన వీరిని మాయా మేఘం కమ్మేసింది. దీంతో ఇరువురి మధ్య అహంకారం ప్రజ్వరిల్లి కలహానికి దారితీసిందట. ‘నేను సృష్టికర్తను. నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది’ అని బ్రహ్మ.. ‘నేను స్థితికారుడను. అన్నీ సవ్యంగా సాగడానికి కారణం నేనే కనుక నేనే గొప్ప’ అని విష్ణువు అనడం ఇద్దరి మధ్య ఎడతెగని చర్చకు, వాదోపవాదానికి దారితీసిందట. ఏ మాయవల్ల వారు కలహానికి దిగారో అది తెలియాలని ఇరువురి మధ్య పరమశివుడు ఒక పెద్ద జ్యోతి స్తంభంగా వెలిశాడట. అనంతరం బ్రహ్మ, విష్ణువులిద్దరినీ ఈ జ్యోతిస్తంభం ఆది, అంతములు తెలుసుకొని రమ్మన్నాడట.

వరాహమూర్తియై శ్రీమహావిష్ణువు జ్యోతిర్లింగం ఆదిని తెలుసుకోవడానికి భూమిని తవ్వుకొంటూ పాతాళలోకం దాటి వెళ్లిపోగా, పైన ఉన్న కొనభాగాన్ని తెలుసుకోవడానికి హంసనెక్కి చతుర్ముఖ బ్రహ్మ.. వూర్థ్వముఖానికి వెళ్లారట. అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు వారు ప్రయాణం చేశారట. బ్రహ్మకు అలసట రావడంతో ఓ చోట ఆగిపోయారట. ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలిపువ్వును పట్టుకుని అడిగారట.. ‘నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు?’ అని. అప్పుడు మొగలిపువ్వు ‘నేను శివుడి తలపై నుంచి కింద పడుతున్నా’ అని సమాధానమిచ్చిందట. ఈ శివలింగం పైభాగం ఇంకెంత దూరం ఉందని ఆ కేతకీపుష్పాన్ని బ్రహ్మ అడగగా, అందుకు అది సమాధానమిస్తూ ‘నేను ఇలా పడటం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములు అయింది’ అని చెప్పిందట.

ఆద్యంత రహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలిపువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడట. శివలింగం పై భాగం నుంచి నేనే నిన్ను తీసుకొచ్చానని శివుడికి చెప్పాలి అనడంతో అందుకు ఆ కేతకీపుష్పం అంగీకరించిందట. అప్పుడే అక్కడకు వచ్చిన కామధేనువును కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడట. దీంతో ఆ రెండింటినీ తీసుకుని పరమశివుడి వద్దకు చేరాడట బ్రహ్మ. అప్పటికే మాయమేఘం వీడిపోయిన శ్రీమహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజం ఒప్పుకొన్నాడట. అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని అందుకు మొగలిపువ్వు, కామధేనువులే సాక్షి అని చెప్పాడట బ్రహ్మ. మొగలిపువ్వు అవును అని సమాధానమివ్వగా, కామధేనువు తలతో ఔనని, తోకతో కాదు అని సమాధానమిచ్చిందట.

అందుకు ఆగ్రహించిన శివుడు ‘నువ్వు భూలోకంలో పూజాదికాలు లేకుండా ఉండుగాక’ అని బ్రహ్మను శపించాడట. అసత్యాన్ని పలికిన మొగలిపువ్వును పూజకు పనికి రావనీ, సగం నిజం, సగం అబద్ధం చెప్పిన ఆవు ముఖానికి పూజలేకుండా కేవలం పృష్టానికి మాత్రమే పూజలందుకుంటావనీ శపించాడట. ఆనాడు అలా వెలసిన అగ్నిస్తంభాన్ని బ్రహ్మ ప్రార్థన చేశాడట. ‘మా అహంకారం పోయింది. అసలు పరబ్రహ్మ స్వరూపమేదో, ఆద్యంతములు లేనిదేదో తెలిసింది. ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసిన మీరు భూలోకంలో అజ్ఞానాన్ని పోగొట్టేందుకు అరుణాచలంలో అగ్నిలింగమన్న పేరుతో భక్తులను అనుగ్రహించాలి’ అని ప్రార్థన చేశారు. ఆ కారణంతోనే పరమశివుడు అరుణాచలంలో అగ్నిలింగంగా వెలశాడన్నది పురాణగాథ.

అరుణాచలం ఎందరో సిద్ధ పురుషులకు ఆలవాలం. దేవతలు కూడా ఎప్పుడూ ప్రదక్షిణ చేస్తుంటారు. పర్వతం మొత్తం శివ స్వరూపం. అరుణాచలంలో ఒక మినహాయింపు ఉంది. ఆ పర్వతం చుట్టుపక్కల 24మైళ్ల దూరం దాని తేజస్సు పడుతుందట. అక్కడ ఏ దీక్షా అవసరం లేదట. ఇందుకు రమణ మహర్షి జీవితంలో జరిగిన ఓ ఘటనను ఉదాహరణగా చెబుతారు. భగవాన్‌ రమణ మహర్షి (శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అవతారం) అరుణాచలం పర్వతంపై గల విరూపాక్ష గుహలో తెల్లటి కౌపీనం ధరించి ఉన్నారట. ఆ సమయంలో శృంగగిరి పీఠం నుంచి ఓ పండితుడు వచ్చి.. ‘అయ్యా! మీరు అన్నీ విడిచిపెట్టేశారు. ఏ బంధనాలు లేవు. ఇలా తెల్లటి గోచి పెట్టుకుని ఉండటం కన్నా సన్యాసం స్వీకరించి, కాషాయ వస్త్రాలు ధరిస్తే బాగుంటుంది. సన్యాసం కాదంటే ఓ కాషాయ కౌపీనం ధరిస్తే బాగుంటుంది’ అని సలహా ఇచ్చారట.

అందుకు రమణ మహర్షి ఏ సమాధానం ఇవ్వలేదట. తాను మళ్లీ వస్తానని మనసు మార్చుకుంటే చెప్పండి అని ఆ పండితుడు వెళ్లిపోయారట. కొద్దిసేపటికి ఓ వృద్ధుడు పుస్తకాల సంచీతో అక్కడి వచ్చి ‘నేను స్నానం చేయలేదు. ఈ మూట చూస్తూ ఉండు’ అంటూ రమణ మహర్షికి చెప్పి వెళ్లిపోయాడట. పుస్తకాల మూటను విప్పి చూసిన రమణులు అందులో పైనున్న పుస్తకాన్ని తెరచి చూశారు. అది సంస్కృతంలో ఉన్న ‘అరుణాచల మహత్యం’ అనే పుస్తకం. గిరి పర్వతం చుట్టుపక్కల 24 మైళ్ల వరకూ ఏ దీక్షా నియమాలు ఉండవని అందులో రాసి ఉందట. పరమ శివుడే వృద్ధుడి రూపంలో వచ్చి రమణ మహర్షికి పుస్తకాలను అందజేశారని చెబుతారు. ఆ పుస్తకాన్ని చూపితే పండితుడు మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడట.

పర్వత గుహలో దక్షిణామూర్తి

అరుణాచలం పర్వతం లోపల మధ్యలో ఓ పెద్ద గుహ ఉందట. అక్కడ ఓ పెద్ద మర్రిచెట్టు ఉంటుందని దాని కింద దక్షిణామూర్తి స్వరూపుడై సిద్ధయోగిగా పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని నమ్మకం. అయితే అక్కడకు వెళ్లాలని ప్రయత్నించిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరకు వెనుతిరిగి వచ్చేశారట. అలా దక్షిణామూర్తిని దర్శించాలని బయలుదేరి వెనుదిరిగిన వారిలో రమణ మహర్షి కూడా ఉన్నారట. అరుణాచలం పరమ సత్యమైన క్షేత్రం. శివుడు లింగరూపంలో ఆవిర్భవించిన తర్వాత అక్కడ నిర్వహించవలసిన పూజాది కార్యక్రమాలు ఎలా చేయాలనే విషయాన్ని నిర్ణయించమని, గౌతమ మహర్షిని ఆదేశించారట.

అరుణాచలంలో ఏయే సేవలు ఉండాలి.. ఏ ఆలయాలు ఉండాలి.. ఏ పూజలు చేయాలి.. అని నిర్ణయం చేసిన వారు గౌతమ మహర్షి. ఈ క్షేత్రానికి కాల భైరవుడు క్షేత్రపాలకుడు. స్థల వృక్షం ఇప్ప చెట్టు. అబిత కుచాంబ అనే పేరుతో అమ్మవారు ఇక్కడ ఉంటారు. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, పాతాళ లింగ కూడా ఉంటాయి.

ముఖ్య ఉత్సవాలు…

అరుణాచలంలో ముఖ్యంగా మూడు ఉత్సవాలు జరుగుతాయి. ఆలయంలో వలయాకారపు మండపం ఉంటుంది. అక్కడ అమ్మవారికి గాజుల్ని సమర్పించుకుంటారు.

కార్తీక మాసంలో జరిగే మరో గొప్ప ఉత్సవం… దీపోత్సవం. దీనిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

ఇక కనుల పండువగా జరిగే ఉత్సవం పార్వతీ పరమేశ్వరుల మధ్య వచ్చే ప్రణయ కలహోత్సవం. ఎందుకు వారి మధ్య ప్రణయ కలహం వచ్చిందటే.. ఇందుకు ఓ పురాణగాథను చెబుతారు. ప్రమధ గణాల్లో భృంగి ఒకడు. ఆయన శివుడికి మాత్రమే భక్తుడు. కేవలం ఆయనకు మాత్రమే ప్రదక్షిణ చేసేవాడు. ఇలా రోజూ చేస్తుండటంతో ఓ రోజు అమ్మవారికి ఆగ్రహం వచ్చిందట. ఏం చేస్తాడో చూద్దామని భృంగి వస్తుంటే అమ్మవారు పరమశివుడి వామార్ధం (ఎడమభాగం)లోకి వెళ్లిపోయి అర్ధనారీశ్వర రూపాన్ని ధరించారట. అదే సమయానికి అక్కడకు వచ్చిన భృంగి తేనెటీగలా మారిపోయి పరమ శివుడికి, అమ్మవారికీ మధ్య రంధ్రం చేసి ప్రదక్షిణ చేశాడట.

దీంతో ఆయన భక్తికి మెచ్చిన శివుడు మోక్షం ఇస్తాననీ, ఇవ్వకూడదని అమ్మవారూ… ఇరువురూ కలహించుకొన్నారని గాథ. ఆదిదంపతుల గాథను స్ఫూర్తిగా తీసుకొని అర్చకులు అరుణాచలంలో అత్యంత వైభవంగా ప్రణయ కలహోత్సవం చేస్తారట. ఈ సందర్భంగా పరమశివుడు భృంగికి మోక్షం ఇవ్వడం, దీంతో పార్వతీ దేవికి కోపం వచ్చి అబిత కుచాంబ ఆలయంలోకి వెళ్లి తలుపేసుకుంటుంది. పరమశివుడు ఒక్కడే గిరి ప్రదక్షిణకు వెళ్తే దొంగలు దోచుకుంటారు. ఇప్పటికీ ఈ దొంగలతోపును ఆనవాయితీగా చేస్తున్నారు.

గోపురాల విశిష్టత

అరుణాచల దివ్య క్షేత్రానికి ఎంత గొప్ప పేరుందో అక్కడి గోపురాలకు అంతే విశిష్టత ఉంది. అందుకు సంబంధించి కొన్ని కథలూ ప్రచారంలో ఉన్నాయి. తూర్పు వైపు గోపురం శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. అదో అద్భుత కట్టడం. ఇక ఉత్తర దిక్కున ఉన్న గోపురాన్ని ఓ మహిళ కట్టించారట. ఆమె పేరు అమ్మణి అమ్మన్‌. పరమశివుడి అనుగ్రహం వల్ల యోగశక్తిలో సిద్ధహస్తురాలయ్యారు. ఆమె ప్రతీ ఇంటికి వెళ్లి ‘గోపురం కడుతున్నాం దానం చేయండి’ అని అర్థించేవారట. డబ్బులు లేవు అని చెబుతారేమోనని వారి ఇళ్లలోని ఇనుప పెట్టెలు ఎక్కడ ఉన్నవి.. అందులో ఎంత సొమ్ము ఉన్నదీ చెప్పేసేవారట. దీంతో భయపడి విరాళం ఇచ్చేవారని వాటితోనే ఆమె ఉత్తర గోపురాన్ని కట్టారని చెబుతుంటారు.

        ****** ఓం సర్వం శ్రీ రమణార్పణమస్తు ******








అరుణచలేశ్వరుల దేవాలయము – ముఖ్యస్థానములు

ArunachalamuDevalyaMukhyasthanamulu

శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే

ఆరు ముఖములను, పన్నెండు చేతులను కలిగి నెమలి వాహనారూఢుడై దివ్య తేజస్సుతో వెలుగొందుతూ ఉన్న శివపార్వతుల గారాల బిడ్డ, దేవసేనల ప్రభువు, కేవలం కావడి మొక్కులను సమర్పించినంతనే భక్తులకు వంశాభివృద్ధిని, బుద్ధి సమృద్ధిని ప్రసాదించే భక్తసులభుడైన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు జన్మించిన పవిత్ర పర్వదినం ‘శ్రీ సుబ్రహ్మణ్య షష్టి’. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారం. ఈ పర్వదినానికి సుబ్బరాయషష్టి, కుమారషష్టి, స్కందషష్టి, కార్తికేయషష్టి, గుహప్రియా వ్రతం వంటి పేర్లున్నాయి.

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి పుట్టుక…

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన గాథలు పురాణాల్లో కనిపిస్తాయి. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు బలగర్వితుడై సకల లోకవాసులను హింసిస్తూ ఉండడంతో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు అందుకు ”శివుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. శివుడు తపస్సు మానేసి పార్వతీదేవిని పరిణయమాడునట్టు చేస్తే వారికి జన్మించే కుమారుడు తారకాసురుడిని అంతమొందిస్తాడు” అని ఉపాయం చెప్పాడు. ఈ మాటలను విన్న దేవతలు, శివుడు తపస్సు మాని పార్వతీదేవిని వివాహం చేసుకునేలాగా చేసేందుకు మన్మథుడిని పంపగా శివుడు తన మూడవ నేత్రం తెరిచి మన్మథుడిని దహించి వేశాడు. అయితే తారకాసురుడిని అంత మొందించవలసిన అవసరాన్ని గుర్తించిన శివుడు తనకు పరిచర్యలు చేస్తూ ఉన్న పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ శృంగారంలో తేలియాడుతూ ఉన్న సమయంలో శివుడి రేతస్సు పతనమై భూమిపై పడింది. దానిని భూమి భరించలేక అగ్నిలో పడవేసింది.

అగ్నిదానిని భరించలేక గంగలో వదలగా దానిని గంగ తన తీరంలోని శరవణమునకు తోసివేసింది. అక్కడే శ్రీకుమారస్వామి జన్మించాడు. అంతేకాకుండా గంగానదిలో పడిన రేతస్సు ఆరు భాగాలుగా ఏర్పడింది. ఆ ఆరు భాగాలు అలల తాకిడికి ఏకమై ఆరు ముఖములు, పన్నెండు చేతులుతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. అందువల్ల ఆయనకు ‘షణ్ముఖుడు’ అనే పేరు ఏర్పడింది. ఈ విధంగా ఆవిర్భవించిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పెంచేందుకు శ్రీమహావిష్ణువు ఆరు కృత్తికలను నియమించారు. వారు పెంచి పెద్ద చేశారు. ఆరు కృత్తికల చేత పెంచబడడం వల్ల స్వామికి ‘కార్తికేయుడు’ అనే పేరు ఏర్పడింది. ఈ విధంగా కృత్తికల చేత పెంచబడిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడిపై దండెత్తి తారకాసురుడిని అంతమొందించి దేవతలను ప్రజలను రక్షించినట్లు కథనం.

బ్రహ్మనే బంధించిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి…

త్రిమూర్తులలో లయకారుడైన శివుడికి కుమారుడిగా జన్మించి స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు నియమించిన కృత్తికల చేత పెంచబడిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని బాల్యంలోని బందించినట్లు పురాణాలు చెప్తున్నాయి. సుబ్రహ్మణ్యస్వామి పసివాడుగా తల్లి పార్వతీదేవి ఒడిలో ఉన్న సమయంలో ఒకసారి శివుడు పార్వతీదేవికి ప్రణవ మంత్రార్థాన్ని వివరించారు. బాలుడుగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి దానిని విని ఆకళింపు చేసుకున్నాడు. ఒకసారి బ్రహ్మదేవుడు కైలాసానికి రాగా బాలుడుగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ప్రణవమంత్రార్థాన్ని చెప్పాల్సిందిగా అడిగాడు. బ్రహ్మ సరిగ్గా చెప్పకపోవడంతో సుబ్రహ్మణ్యస్వామి బ్రహ్మదేవుడుని బంధించాడు. శివుడు జోక్యం చేసుకుని విడిపించాడు.

నెమలి వాహనం,కోడి ధ్వజం…

తారకాసురుడి సోదరుడైన శూరపద్ముడు దేవతలను ఇబ్బందిపాలు చేస్తూ ఉండడంతో సుబ్రహ్మణ్యస్వామి శూరపద్ముడుపై దండెత్తి యుద్ధం చేశాడు. యుద్ధంలో ఆరవరోజు శూరపద్ముడు పక్షి రూపాన్ని ధరించి తలపడ్డాడు. సుబ్రహ్మణ్యస్వామి శూలాయుధం ప్రయోగించడంతో పక్షి రెండుగా ఖండింపబడింది. ఆ రెండిటిలో ఒకటి నెమలిగా, మరొకటి కోడిపుంజుగా మారి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని శరణు వేడుకోవడంతో….నెమలిని వాహనంగా, కోడిని ధ్వజంగా చేసుకుంటున్నట్లు పురాణ కథనం.

వల్లీ…దేవసేనలు…..

శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి ఇద్దరు దేవేరులున్నారు. శ్రీవల్లీదేవి, శ్రీదేవసేనలు. వారు తారకాసురుడిని అంతమొందించిన తర్వాత దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్యస్వామికిచ్చి వివాహం చేయగా, తిరుత్తణి ప్రాంత పాలకుడైన నందిరాజు కుమార్తె వల్లీదేవిని వేటగాడి రూపంలో వెళ్ళి వివాహం చేసుకున్నట్లు పురాణ కథనం.

కావడి మొక్కులంటే ఇష్టం…

పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్ళే సమయంలో శివుడు రెండు కొండలను బహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి కొలవవలసిందిగా తెలిపారు. వాటిని స్వీకరించిన అగస్త్యుడు వాటిని ఇదంబుడు అనే శిష్యుడికిచ్చి తన వెంట వాటిని తీసుకుని రావలసిందిగా తెలిపాడు. ఇదంబుడు కావడిని కట్టుకుని రెండు పర్వతాలను అందులో ఉంచుకుని అగస్త్యుడి వెంట నడవసాగాడు. కొంత దూరం అంటే పళని వచ్చేసరికి ఆయాసం అధికమై కొంత సేపు విశ్రాంతికి ఆగాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కావడిని ఎత్తగా ఒకవైపు పైకి లేచింది. మరోవైపు లేకపోవడంతో వెనుతిరిగి చూడగా దానిపై సుబ్రహ్మణ్యస్వామి నిలబడి ఉన్నాడు. కొండ దిగి వెళ్ళిపోమన్నాడు. పోకపోవడంలో వారిద్దరి మధ్యా యుద్ధం జరిగి చివరకు ఇదంబుడు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకుని అగస్త్యుడు ప్రార్థించడంతో స్వామి తిరిగి బతికించారు. ఈ విషయం ఇదంబుడి భార్యకు తెలిసి కావడిలో పాలను తీసుకువెళ్ళి కృతజ్ఞతగా స్వామివారికి సమర్పించింది. అప్పటి నుంచి కావడి మొక్కులను సమర్పించడం ఆచారమైంది. కాగా, కావడిని ఉపయోగించే బద్ద ‘బ్రహ్మదండం’ అనీ కర్కోటక అనే అష్టనాగులకు ప్రతీకలని చెప్పబడుతూ ఉంది.

సుబ్రహ్మణ్య షష్టి నాడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ దినమంతా ఉపవాస వ్రతం పాటించి మరుసటిరోజు తిరిగి పూజ చేసి భోజనం చేసి ఉపవాసంను విరమించాలి. అంతేకాకుండా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారిని సర్పంగా కూడా ఆరాధిస్తూ ఉండడం ఆచారం. కనుక పుట్ట వద్దకు వెళ్ళి పూజ చేసి పుట్టలో పాలుపోయడం కూడా సత్ఫలితాలను ఇస్తుంది. దీనికి తోడు గ్రహదోషాలతో బాధపడేవారు ముఖ్యంగా రాహు, కేతు, సర్ప, కుజదోషములున్న వారు కఠినమైన ఉపవాసం ఉండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ఫలితాలుంటాయని చెప్పబడుతూ ఉంది.

బ్రహ్మచారికి పూజ…

సుబ్రహ్మణ్యషష్టినాడు బ్రాహ్మణ బ్రహ్మచారిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి రూపంగా భావించి పూజించి పులగం, క్షీరాన్నం వంటి వంటలను చేసి భోజనం పెట్టి, పంచలసాపు,దక్షిణలను తాంబూలమందు ఉంచి ఇచ్చి నమస్కరించాలి. ఈ విధంగా చేయడం వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి. వీటికి తోడు ఈరోజు “శరవణభవ” అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ విధంగా సుబ్రహ్మణ్యషష్టి జరుపుకోవడం వల్ల వంశాభివృద్ధి, విజ్ఞానాభివృద్ధి, బుద్ధి సమృద్ధి కలుగుతాయి.

శ్రీ సుబ్రహ్మణ్య గీతం (Sri Subrahmanya Geetam) II ఉమామహేశ్వర కుమార (UmaMaheswara Kumara)


ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్య౦
హరోంహర భక్తజన ప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్య౦
సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ షణ్ముఖనాథా సుబ్రహ్మణ్య౦
సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ షణ్ముఖనాథా సుబ్రహ్మణ్య౦
సుబ్రహ్మణ్య౦ మాంపాహి షణ్ముఖనాథా మాంపాహి
సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ శరవణభవనే సుబ్రహ్మణ్య౦
సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ వేలాయుధనే సుబ్రహ్మణ్య౦
సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ గజముఖ సోదర సుబ్రహ్మణ్య౦
సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ పళనీవాసా సుబ్రహ్మణ్య౦
సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ వల్లీసనాథా సుబ్రహ్మణ్య౦
సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ పార్వతి పుత్రా సుబ్రహ్మణ్య౦
సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ శరవణభవనే సుబ్రహ్మణ్య౦
సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ శివ గురునాథా సుబ్రహ్మణ్య౦
సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ అయ్యప్ప సోదర సుబ్రహ్మణ్య౦
సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ గురువన గురవే సుబ్రహ్మణ్య౦
వేల్ వేల్ మురుగా వట్టివేల్ మురుగా
వట్టివేల్ మురుగా వేల్ వేల్ మురుగా

Umāmahēśvara kumāra guravē uḍipi subrahmaṇyam
harōnhara bhaktajana priya paṅkajalōchana bāla subrahmaṇyam
subrahmaṇyam subrahmaṇyam ṣaṇmukhanāthā subrahmaṇyam
subrahmaṇyam subrahmaṇyam ṣaṇmukhanāthā subrahmaṇyam
subrahmaṇyam māmpāhi ṣaṇmukhanāthā māmpāhi
subrahmaṇyam subrahmaṇyam śaravaṇabhavanē subrahmaṇyam
subrahmaṇyam subrahmaṇyam vēlāyudhanē subrahmaṇyam
subrahmaṇyam subrahmaṇyam gajamukha sōdara subrahmaṇyam
Subrahmaṇyam subrahmaṇyam paḷanīvāsā subrahmaṇyam
subrahmaṇyam subrahmaṇyam vallīsanāthā subrahmaṇyam
subrahmaṇyam subrahmaṇyam pārvati putrā subrahmaṇyam
subrahmaṇyam subrahmaṇyam śaravaṇabhavanē subrahmaṇyam
subrahmaṇyam subrahmaṇyam śiva gurunāthā subrahmaṇyam
subrahmaṇyam subrahmaṇyam ayyappa sōdara subrahmaṇyam
subrahmaṇyam subrahmaṇyam guruvana guravē subrahmaṇyam
vēl vēl murugā vaṭṭivēl murugā
vaṭṭivēl murugā vēl vēl murugā

        ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******