శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్నం (Sri Subrahmanya Pancharatnam)

[This stotra is about the Lord Subrahamanya who has a temple at Kukke Subrahamanya, which is in the banks of the river Kumaradhara which is about 100 km from Mangalore in Karnataka. Adhi Sankara Bhagawat Pada is known to have camped in this temple for a few days.]

స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click here to listen the Stotram):

video
play-sharp-fill

[/audio]

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Stotram): శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్నం (Sri Subrahmanya Pancharatnam)

షడాననం చందన లేపితాంగం – మహోరసం దివ్యమయూరవాహనమ్,
రుద్రస్యసూనుం సురలోకనాథం – బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే.

ṣaḍānanaṁ chandana lēpitāṅgaṁ – mahōrasaṁ divyamayūravāhanam,
rudrasyasūnuṁ suralōkanāthaṁ – brahmaṇyadēvaṁ śaraṇaṁ prapadyē.
    || 1 ||

ఆరు ముఖములుకలవాడు, శరీరముపై చందనమును ధరించువాడు, రసస్వరూపుడు, నెమలి వాహనముకలవాడు, శివుని తనయుడు, దేవలోకాలకు అధిపతియైన పరబ్రహ్మ స్వరూపునకు ప్రణమిల్లుతూ శరణు వేడుతున్నాను.

I seek refuge with the god, who is Brahman, Who has six faces, Who applies sandal paste, All over his body. Who is the great essence, Who rides on a peacock, Who is the son of Lord Shiva, And who is the lord of the heaven.

జాజ్వల్యమానం సురవృన్దవంద్యం – కుమారధారాతట మందిరస్థమ్,
కందర్పరూపం కమనీయగాత్రం – బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే.

jājvalyamānaṁ suravr̥ndavandyaṁ – kumāradhārātaṭa mandirastham,
kandarparūpaṁ kamanīyagātraṁ – brahmaṇyadēvaṁ śaraṇaṁ prapadyē.
    || 2 ||

దేదీప్యమానంగా భాసిల్లువాడు, సురులచే కొలవబడువాడు, కుమారధార నదీతీరమున ఆలయంలో వెలసినవాడు, ఆకర్షణీయమైన రూపముకలవాడు అయిన పరబ్రహ్మ స్వరూపునకు ప్రణమిల్లుతూ శరణు వేడుతున్నాను.

I seek refuge with the god, who is Brahman, Who shines all over, Who is saluted by all devas, Who has a temple, In the banks of Kumaradhara, Who has an enticing personality, And who has a very attractive body.

ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం త్రయీతనుం శూలమశి౦దధానమ్,
శేషావతారం కమనీయరూపం – బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే.

dviṣaḍbhujaṁ dvādaśadivyanētraṁ trayītanuṁ śūlamaśindadhānam,
śēṣāvatāraṁ kamanīyarūpaṁ – brahmaṇyadēvaṁ śaraṇaṁ prapadyē.
     || ౩ ||

ఆరుజతల చేతులు కలవాడు, ద్వాదశ పవిత్ర నేత్రాలు కలవాడు, త్రినేత్రుని తనయుడు, శూలమును ఆయుధముగా ధరించువాడు, శేషుని అవతారం, చూడముచ్చటైన రూపం కల పరబ్రహ్మ స్వరూపునకు ప్రణమిల్లుతూ శరణు వేడుతున్నాను.

I seek refuge with the god, who is Brahman, Who has two sets of six hands, Who has twelve holy eyes, Who is the son of the three eyed one, Who gave him his weapon “Soola”, Who is the incarnation of Sesha, And who has a very pretty looks.

సురారిఘోరాహవ శోభమానం – సురోత్తమం శక్తిధరం కుమారమ్,
సుధార శక్త్యాయుధ శోభిహస్తం – బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే.

Surārighōrāhava śōbhamānaṁ – surōttamaṁ śaktidharaṁ kumāram,
sudhāra śaktyāyudha śōbhihastaṁ – brahmaṇyadēvaṁ śaraṇaṁ prapadyē.
    || 4 ||

సురారి, దేవతల శత్రువులకు భయము కలిగించే తేజస్సుకలవాడు. దేవతలలో ఉత్తముడు, పార్వతీదేవి తనయుడు, చేతిలోని శక్తితో తేజరిల్లు పరబ్రహ్మ స్వరూపునకు ప్రణమిల్లుతూ శరణు వేడుతున్నాను.

I seek refuge with the god, who is Brahman, Who appears as fearful light, To the enemies of devas, Who is the greatest among devas, Whom Shakthi holds as her on, And who shines with the Shakthi in his hand.

ఇష్టార్థసిద్ధిప్రద మీశపుత్రం – ఇష్టాన్నదం భూసురకామధేనుమ్,
గంగోద్భవం సర్వజనానుకూలం – బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే.
iṣṭārthasid’dhiprada mīśaputraṁ – iṣṭānnadaṁ bhūsurakāmadhēnum,
gaṅgōdbhavaṁ sarvajanānukūlaṁ – brahmaṇyadēvaṁ śaraṇaṁ prapadyē.
    || 5 ||

అడిగిన వరములిచ్చు శివుని కుమారుడు, విప్రులకు అన్ని కోరికలు తీర్చుకామధేనువు, గంగనుండి ఆవిర్భవించి అందరికీ చేయూతనిచ్చే పరబ్రహ్మ స్వరూపునకు ప్రణమిల్లుతూ శరణు వేడుతున్నాను.

I seek refuge with the god, who is Brahman, Who is the son of Lord Shiva, Who grants all that is asked for, Who grants desired food,
Who is the wish giving cow, To all the Brahmins, Who rose out of river Ganga, And who helps all people.

ఫలశ్రుతి: యః శ్లోక పంచమిదం పఠతీహ భక్త్యా – బ్రహ్మణ్యదేవ వినివేశిత మానసః సన్,
ప్రాప్నోతి భోగమఖిలం భువి యద్యదిష్టమ్ – అంతే స గచ్ఛతి ముదా గుహ సామ్యమేవ.

phalaśruti: Yaḥ ślōka pan̄chamidaṁ paṭhatīha bhaktyā – brahmaṇyadēva vinivēśita mānasaḥ san,
prāpnōti bhōgamakhilaṁ bhuvi yadyadiṣṭam – antē sa gacchhati mudā guha sāmyamēva.
   || 6 ||

ఈ ఐదు చరణములు భక్తితో పఠించువారు, తాను పరబ్రహ్మ స్వరూపం అన్న సత్యాన్ని తెలుసుకొన్నవారు తమ అవనీ సంచారంలో అన్ని సుఖములను అనుభవిస్తారు. కడకు సుబ్రహ్మణ్యస్వామి దివ్య పాదములను చేరుకొంటారు.

Those who read these five stanzas with devotion, With mind full of that God, who is Brahman himself, Would enjoy all the pleasures till they are in this earth, And at the end reach the presence of Lord Subrahamanya.

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *