శ్రీ సుబ్రహ్మణ్య సీస పద్య శతక౦ (Sri Subrahmanya Sisa Padya Satakam)
*** మన పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి నాన్నగారు కీ.శే. బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మ గారు తన తొలి రచనగా వ్రాసినది.***
ఛందస్సు పేరు తరళము (chandas’su pēru taraḷamu):
శరవణోద్భవ! షణ్ముఖేశ్వర! సర్వసంకటనాశకా!
కరుణనేలుము కార్తికేశ్వర! కంజలోచన! శోభనా!
శరణమంచు నుతింతు నిర్మల! సత్త్వరూప శుభప్రదా!
గురుగుహానిజ భక్తపాలక! కూర్మిజూపుము నా పయిన్
Śaravaṇōdbhava! Ṣaṇmukhēśvara! Sarvasaṅkaṭanāśakā!
Karuṇanēlumu kārtikēśvara! Kan̄jalōchana! Śōbhanā!
Śaraṇaman̄chu nutintu nirmala! Sattvarūpa śubhapradā!
Guruguhānija bhaktapālaka! Kūrmijūpumu nā payin
తురగవల్గము (గుఱ్ఱము నడిచే విధంగా ఉంటుంది) – Turagavalgamu:
తురగవల్గమనెడి రగడ తుష్టిమీర వినుతిజేతు
కరుణహృదయు కార్తికేయు కరుణనునేబొంద దలచి
తారాసురాపహార తాపత్రయవన కుఠార
ద్విరదపీన కరసమాన! దివ్యబాహు విలసితాస్త్ర
Turagavalgamaneḍi ragaḍa tuṣṭimīra vinutijētu
karuṇahr̥dayu kārtikēyu karuṇanunēbonda dalachi
tārāsurāpahāra tāpatrayavana kuṭhāra
dviradapīna karasamāna! Divyabāhu vilasitāstra
లాటీవిట వృత్తము (Lāṭīviṭa vr̥ttamu):
సురవందిత నీ చరణాబ్జములన్ సుబ్రహ్మణ్యా! గొల్తునికన్
కరుణాకర హే నత పాలన కృద్గంభీరాభ్ధే పాలయ మాం
నిరతం నిఖిలామర సంస్తుతయో నిత్యానందాయంచు మదిన్
శరకాసన సంభవ నీ భక్తిని సౌఖ్యంబంచెన్నెదన్నెపుడున్
Suravandita nī charaṇābjamulan subrahmaṇyā! Goltunikan
karuṇākara hē nata pālana kr̥dgambhīrābhdhē pālaya māṁ
nirataṁ nikhilāmara sanstutayō nityānandāyan̄chu madin
śarakāsana sambhava nī bhaktini saukhyamban̄chennedannepuḍun
మంగళమహశ్రీ వృత్తము (Maṅgaḷamahaśrī vr̥ttamu):
తారకమహాసుర విదారక శుభాకర సు
దారుణ నతాఘతతి దావ రణచండ గనుదేవా
గారవమునెంచి నిను కావ్యమున గొల్చెదను
కాలచలనాకరణ కార్యతతి నిర్వహణశీలా
భీరుజనభీతిహర! ప్రేమమయమానసని
పీడిత సురౌఘముల పీడలనుబాపు రణధీరా
నేరములనెంచకిక నిశ్చలపు భక్తియు సు
నిష్ఠయునొసంగుము వినీత జన పాల! వరదాతా!
Tārakamahāsura vidāraka śubhākara su
dāruṇa natāghatati dāva raṇachaṇḍa ganudēvā
gāravamunen̄chi ninu kāvyamuna golchedanu
kālachalanākaraṇa kāryatati nirvahaṇaśīlā
bhīrujanabhītihara! Prēmamayamānasani
pīḍita suraughamula pīḍalanubāpu raṇadhīrā
nēramulanen̄chakika niśchalapu bhaktiyu su
niṣṭhayunosaṅgumu vinīta jana pāla! Varadātā!
మానిని(Mānini:)
కారణ కారణ! సంగరచండ! సుకారుణికోత్తమ! షణ్ముఖ! నే
గోరితి నీ పదభక్తిని నిత్యము గూర్మి నొసంగుము కాదనకన్
సార యశోఘన చిత్రవిచిత్ర సుచారు చరిత్ర మహేశ్వరజా
పారము చేరగలేక తపించెడి పాపుడ నన్నిక నేలుమయా!
Kāraṇa kāraṇa! Saṅgarachaṇḍa! Sukāruṇikōttama! Ṣaṇmukha! Nē
gōriti nī padabhaktini nityamu gūrmi nosaṅgumu kādanakan
sāra yaśōghana chitravichitra suchāru charitra mahēśvarajā
pāramu chēragalēka tapin̄cheḍi pāpuḍa nannika nēlumayā!
హళముఖీ (Haḷamukhī);
సత్యసుందర శివకరా
నిత్యనిర్గుణ నిరుపమా
సత్య సౌఖమునొసగుమా
నిత్యమున్నిను గొలిచెదన్
satyasundara śivakarā
nityanirguṇa nirupamā
satya saukhamunosagumā
nityamunninu golichedan
ప్రమాణి (Pramāṇi):
వినంద్వదీయ గాధలన్
కనంద్వదీయ రూపమున్
చనంద్వదీయ క్షేత్రమున్
వినన్ కనన్ చనన్ మహా
త్మ! నాకొనర్పుమా దయన్
సనాతనా జగద్గురూ
సునాస సుందరాంగ నా
మనంబునన్వసింపుమా.
Vinandvadīya gādhalan
kanandvadīya rūpamun
chanandvadīya kṣētramun
vinan kanan chanan mahā
tma! Nākonarpumā dayan
sanātanā jagadgurū
sunāsa sundarāṅga nā
manambunanvasimpumā
Leave a Reply