శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమ్ (Sri Subrahmanya Bhujangam)
స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు: శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమ్ (Sri Subrahmanya Bhujangam)
సదా బాలరూపాపి విఘ్నాద్రిహన్త్రీ – మహాదన్తివక్త్రాపి పంచాస్య మాన్యా |
విధీన్ద్రాదిమృగ్యా గణేశాభిధా మే – విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తిః
sadā bālarūpāpi vighnādrihantrī – mahādantivaktrāpi pan̄chāsya mān’yā |
vidhīndrādimr̥gyā gaṇēśābhidhā mē – vidhattāṁ śriyaṁ kāpi kaḷyāṇamūrtiḥ || 1 ||
ఎల్లప్పుడు బాల రూపమున నున్నను, విఘ్నపర్వతముల భేదించునదియు, గొప్ప గజముఖము గలదైనను పంచాస్యుని (సింహము – శివుడు) ఆదర పాత్రమును, బ్రహ్మ, ఇంద్రుడు మున్నగు వారిచే వెతుక దగినదియు గణేశుడను పేరు గల ఒకానొక మంగళరూపము నాకు సంపదను కలుగజేయు గాక!
నజానామి శబ్దం నజానామి చార్థం – నజానామి పద్యం నజానామి గద్యమ్ |
చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే – ముఖా న్నిస్సర న్తే గిర శ్చాపి చిత్రమ్
Najānāmi śabdaṁ najānāmi chārthaṁ – najānāmi padyaṁ najānāmi gadyam |
chidēkā ṣaḍāsyā hr̥di dyōtatē mē – mukhā nnis’sara ntē gira śchāpi chitram || 2 ||
నేను శబ్దము నెరుగను. అర్థము నెరుగను, పద్యము నెరుగను, గద్యము నెరుగను. ఆరు ముఖములు గల ఒకానొక చిద్రూపము నా హృదయమునందు ప్రకాశించుచున్నది. నోటినుండి చిత్రముగా మాటలు వెలువడుతున్నవి.
మయూరాధిరూఢం మహావాక్యగూఢం – మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ |
మహీదేవదేవం మహావేదభావం – మహాదేవబాలం భజే లోకపాలమ్
mayūrādhirūḍhaṁ mahāvākyagūḍhaṁ – manōhāridēhaṁ mahachhittagēham |
mahīdēvadēvaṁ mahāvēdabhāvaṁ – mahādēvabālaṁ bhajē lōkapālam || ౩ ||
నెమలిని నధిష్టించి యున్నవాడును, వేదాంత మహావాక్యములలో నిగూఢముగా నున్నవాడును, మనోహరమైన దేహము గలవాడును, మహాత్ముల చిత్తమునందు నివసించువాడును, బ్రాహ్మణుల కారాధ్యుడును, వేదములచే ప్రతిపాద్యుడను, మహాదేవుని నందనుడును, లోకపాలకుడు అయిన సుబ్రహ్మణ్యేశ్వరుని సేవించుచున్నాను.
యదా సన్నిధానం గతా మానవా మే – భవామ్భోధి పారం గతా స్తే తదైవ |
ఇతి వ్యంజయ న్సిన్దుతీరే య ఆస్తే – త మీడే పవిత్రం పరాశక్తిపుత్రమ్
yadā sannidhānaṁ gatā mānavā mē – bhavāmbhōdhi pāraṁ gatā stē tadaiva |
iti vyan̄jaya nsindutīrē ya āstē – ta mīḍē pavitraṁ parāśaktiputram || 4 ||
“నా సాన్నిధ్యమును పొందిన వెంటనే మనుజులు సంసార సాగరమును దాటుదురు” అని సూచించుచు, సముద్ర తీరముననున్న పరాదేవత యొక్క పుత్రుడగు పవిత్రుడైన సుబ్రహ్మణ్యుని స్తుతింతును.
యథా బ్ధే స్తరంగా లయం యా న్తితుంగా – స్తథైవా పద స్సన్నిధౌ సేవతాం మే |
ఇతీవోర్మిపంక్తీర్నృణాం దర్శయన్తం – సదా భావయే హృత్సరోజే గుహం తమ్
Yathā bdhē staraṅgā layaṁ yā ntituṅgā – stathaivā pada s’sannidhau sēvatāṁ mē |
itīvōrmipaṅktīrnr̥ṇāṁ darśayantaṁ – sadā bhāvayē hr̥tsarōjē guhaṁ tam || 5 ||
“ఎగసిపడు సముద్ర తరంగములు (ఒడ్డున ఉన్న) నన్ను చేరి లయమగునట్లుగా నా సన్నిధానమున
సేవించు జనుల ఆపదలు నశించిపోవును” అని చెప్పుచున్నట్లుగా మానవులకు సముద్ర తరంగములను చూపుచున్న ఆ కార్తికేయుని నా హృదయపద్మము నందు సదా తలంతును.
గిరౌ మన్నివాసే నరా యే ధిరూఢా – స్తదా పర్వతే రాజతే తే ధిరూఢాః |
ఇతీవ బ్రువ న్గన్థశైలాధిరూఢ – స్సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు
girau mannivāsē narā yē dhirūḍhā – stadā parvatē rājatē tē dhirūḍhāḥ |
itīva bruva n’ganthaśailādhirūḍha – s’sadēvō mudē mē sadā ṣaṇmukhōstu || 6 ||
“నా నివాసస్థానమగు పర్వతము నెక్కిన నరులుకైలాసము నధిష్టించ గలరు అని చెప్పుచున్న వాని వాలే గంధశైలము నధిష్టించియున్న ఆ షణ్ముఖ దేవుడు ఎల్లప్పుడూ నాకు సంతోషము కలిగించు గాక !
మహామ్భోధి తీరే మహాపాపచోరే – మునీన్ద్రానుకూలే సుగంధాఖ్య శైలే |
గుహాయాం వసన్తం స్వభాసా లసన్తం – జనార్తిం హరన్తం శ్రయామో గుహం తమ్
mahāmbhōdhi tīrē mahāpāpachōrē – munīndrānukūlē sugandhākhya śailē |
guhāyāṁ vasantaṁ svabhāsā lasantaṁ – janārtiṁ harantaṁ śrayāmō guhaṁ tam || 7 ||
మహా సముద్రతీరమందున్నదీ, మహా పాపములు హరించునదీ, మునీంద్రులకు కావాసమును నగు గంధశైలమునందు, గుహయందు తన కాంతితో ప్రకాశించుచు నివసించుచున్నవాడను, జనుల బాధలను హరించు వాడను నాగు కుమారస్వామిని సేవింతుము.
లస త్స్వర్ణ గేహే నృణాం కామదోహే – సుమస్తోమ సంఛన్నమాణిక్య మంచే |
సముద్య త్సహస్రార్క తుల్యప్రకాశం – సదా భావయే కార్తికేయం సురేశమ్
Lasa tsvarṇa gēhē nr̥ṇāṁ kāmadōhē – sumastōma san̄chhannamāṇikya man̄chē |
samudya tsahasrārka tulyaprakāśaṁ – sadā bhāvayē kārtikēyaṁ surēśam || 8 ||
మనుజుల కోరికల నొసంగు కనక భవనములనందు పుష్ప సముదాయముచే గప్పబడిన రత్న పీఠముచే ఉదయించుచున్న సహస్రాదిత్యులతో సాటి అయిన వెలుగు గల దేవత శ్రేష్ఠుడైన కుమారస్వామిని నిరంతరం తలంచెదను.
రణద్ధంసకే మంజులే త్యన్తశోణే – మనోహారి లావణ్య పీయూషపూర్ణే |
మనషట్పదో మే భవక్లేశ తప్తః – సదా మోదతాం స్కన్ద ! తే పాదపద్మే
raṇad’dhansakē man̄julē tyantaśōṇē – manōhāri lāvaṇya pīyūṣapūrṇē |
manaṣaṭpadō mē bhavaklēśa taptaḥ – sadā mōdatāṁ skanda! Tē pādapadmē || 9 ||
ఓ కుమారస్వామీ! సంసారము నందలి కష్టములచే తపింప జేయబడిన నా మనస్సనెడి తుమ్మెద –
శబ్దించుచున్న అందెలతో మనోహరమై మిక్కిలి ఎఱ్ఱనిదీ , మనోహరమైన లావణ్యామృతముతో నిండియున్న నీ పాదపద్మమునందు నిరంతరము ఆనందించు గాక!
సువర్ణాభ దివ్యామ్బరై ర్భాసమానాం – క్వణత్కింకిణీ మేఖలా శోభమానామ్ |
లసద్ధేమపట్టేన విద్యోతమానాం – కటిం భావయే స్కన్ద ! తే దీప్యమానామ్
suvarṇābha divyāmbarai rbhāsamānāṁ – kvaṇatkiṅkiṇī mēkhalā śōbhamānām |
lasad’dhēmapaṭṭēna vidyōtamānāṁ – kaṭiṁ bhāvayē skanda! Tē dīpyamānām || 1౦ ||
ఓ కుమారస్వామీ! బంగారము వంటి కాంతి గల దివ్య వస్త్రముల తోను, శబ్దించుచున్న చిరు గంటలు గల మొలనూలుతోను, ప్రకాశించు చున్న బంగారపు పట్టెతోను, ప్రకాశించుచున్న నీ యొక్క కటి ప్రదేశమును ధ్యానింతును.
పులిన్దేశకన్యా ఘనాభోగతుంగ – స్తనాలింగనాసక్త కాశ్మీర రాగమ్ |
నమస్యా మ్యహం తారకారే! తవోర – స్వభక్తావనే సర్వదా సానురాగమ్
Pulindēśakan’yā ghanābhōgatuṅga – stanāliṅganāsakta kāśmīra rāgam |
namasyā myahaṁ tārakārē! Tavōra – svabhaktāvanē sarvadā sānurāgam || 11 ||
తారకాసురుని సంహారించిన సుబ్రహ్మణ్య దేవా ! పుళింద కన్య యగు వల్లీదేవి యొక్క ఉన్నతములైన రొమ్ముల యాలింగనముచే లగ్నమైన కుంకుమచే ఎఱ్ఱనైనదియు, నిజ భక్తుల రక్షణమున నెల్లప్పుడు ఆసక్తిగల నీ వక్షస్థలమును నమస్కరింతును.
విధౌ క్లృప్తదణ్డా న్స్వలీలా ధృతాణ్డా – న్నిర స్తేభశుండా న్ద్విషత్కాలదణ్డాన్ |
హతేన్ద్రారిషండాన్ జగత్రాణశౌండా – న్సదా తే ప్రచణ్డాన్ శ్రయే! బాహుదణ్డాన్
vidhau klr̥ptadaṇḍā nsvalīlā dhr̥tāṇḍā – nnira stēbhaśuṇḍā ndviṣatkāladaṇḍān |
hatēndrāriṣaṇḍān jagatrāṇaśauṇḍā – nsadā tē prachaṇḍān śrayē! Bāhudaṇḍān || 12 ||
విధిని కూడా దందించునవీ, బ్రహ్మాండమును మ్రోయుచున్నవీ, ఏనుగుల తొండములకంటే బలమైనవీ, శత్రువులకు యమదండములైనవీ, రాక్షసులను సంహరించునవీ, లోకములను రక్షించునవీ, ప్రచండములైనవీ, అయిన నీ బాహుదండములను నేను ఎల్లప్పుడూ ఆశ్రయించుచున్నాను.
సదా శారదా షణ్మృగాంకా యది స్యుః – సముద్యన్త ఏవస్థితా శ్చేత్సమన్తాత్ |
సదా పూర్ణబిమ్భా: కళంకై శ్చ హీనా – స్తదా త్వన్ముఖానాం బ్రువే! స్కన్ద! సామ్యమ్
sadā śāradā ṣaṇmr̥gāṅkā yadi syuḥ – samudyanta ēvasthitā śchētsamantāt |
sadā pūrṇabimbhā: Kaḷaṅkai ścha hīnā – stadā tvanmukhānāṁ bruvē! Skanda! Sāmyam || 1౩ ||
ఓ కుమారస్వామీ! చంద్రులు ఎల్లపుడును శరచ్చంద్రులు గాను, ఆరు సంఖ్యగలవారుగను, ఉదయించుచున్నవారుగను , పూర్ణబింబోపేతులుగను, కళంక శూన్యులుగను నుందురేని అపుడు నీ ముఖములతో పోలికను చెప్పుదును.
స్ఫురన్మందహాసై స్సహంసాని చంచ – త్కటాక్షావలీ భృఙ్గా సంఘోజ్జ్వలాని |
సుధాస్యన్ది బిమ్బాధరాణీశసూనో – తవాలోకయే! షణ్ముఖాంభోరుహాణి
Sphuranmandahāsai s’sahansāni chan̄cha – tkaṭākṣāvalī bhr̥ṅgā saṅghōjjvalāni |
sudhāsyandi bimbādharāṇīśasūnō – tavālōkayē! Ṣaṇmukhāmbhōruhāṇi || 14 ||
ఓ శివ కుమారా! చిరునవ్వుల నెడి హంసలతోనూ , చంచలమైన కటాక్షముల (క్రీగంటిచూపులు) నెడి తుమ్మెదలతోనూ, అమృతము స్రవించు దొండపండువంటి పెదవులతో కల నీ ఆరు ముఖలనెడి పద్మములను దర్శింతును.
విశాలేషు కర్ణాన్తదీర్ఘే ష్వజస్రం – దయాస్యన్దిషు ద్వాదశ స్వీక్షణేషు |
మయీ షత్కటాక్ష స్సకృత్పాతిత శ్చే – ద్భవేత్తే దయాశీల! కానామ హానిః
viśālēṣu karṇāntadīrghē ṣvajasraṁ – dayāsyandiṣu dvādaśa svīkṣaṇēṣu |
mayī ṣatkaṭākṣa s’sakr̥tpātita śchē – dbhavēttē dayāśīla! Kānāma hāniḥ || 15 ||
దయాశీలుడా! విశాలములను, కర్ణాంత పర్యంత దీర్ఘములను నగు నీ యొక్క పన్నెండు నేత్రములు దయను వర్షించుచుడంగా , నీ మంద కటాక్షము నాపై నొక పర్యాయము ప్రసరింప జేసిదవేని నీకు హాని యేమి ?
సుతాంగోద్భవో మేఽసి జీవేతి షడ్ధా – జపన్మన్త్ర మీశో ముదా జిఘ్రతే యాన్ |
జగద్భారభృద్భ్యో జగన్నాథ! తేభ్యః – కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః
sutāṅgōdbhavō mēఽsi jīvēti ṣaḍdhā – japanmantra mīśō mudā jighratē yān |
jagadbhārabhr̥dbhyō jagannātha! Tēbhyaḥ – kirīṭōjjvalēbhyō namō mastakēbhyaḥ || 16 ||
కుమారా! చిరంజీవ! అని ఆరు పర్యాయము లుచ్చరించి శివుడు ఆఘ్రూ ణించు ననియు, జగద్బారమును నిర్వహింప సమర్థములును, కిరీటములచే ప్రకాశించుచున్న నీ తలలకు ఓ జగన్నాథా! నమస్కారము.
స్ఫురద్రత్న కేయూర హారాభిరామ – శ్చల త్కుణ్డల శ్రీలస ద్గండభాగః |
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః – పురస్తా న్మమాస్తాం పురారే స్తనూజః
Sphuradratna kēyūra hārābhirāma – śchala tkuṇḍala śrīlasa dgaṇḍabhāgaḥ |
kaṭau pītavāsāḥ karē chāruśaktiḥ – purastā nmamāstāṁ purārē stanūjaḥ || 17 ||
కాంతివంతమైన రత్నకంకణములతో, హారములతో మనోహరమైనవాడును , చలించుచున్న కుండల కాంతిచే ప్రసరించు చెక్కిళ్ళు గలవాడును, నడుమున పీత వస్త్రము, హస్తమున చేతిలో మనోహరమగు శక్తి (ఆయుధము)యు గల శివనందనుడగు కుమారస్వామి నా ఎదుట ఉండుగాక!
ఇహా యాహి! వత్సేతి హస్తా న్ప్రసార్యా – హ్వయ త్యాదరా చ్ఛంకరే మాతు రంకాత్ |
సముత్పత్య తాతం శ్రయన్త౦ కుమారం – హరాశ్లిష్ట గాత్రం భజే బాలమూర్తిమ్
ihā yāhi! Vatsēti hastā nprasāryā – hvaya tyādarā chhaṅkarē mātu raṅkāt |
samutpatya tātaṁ śrayantam kumāraṁ – harāśliṣṭa gātraṁ bhajē bālamūrtim || 18 ||
“బిడ్డా! ఇటు రమ్ము” అని చేతులను చాచి ఆదరముతో శంకరుడు పిలుచుచుండగా తల్లి యొడినుండి దూకి తండ్రి నాశ్రయించి వానిచే కౌగలించు కొనబడిన శరీరము గల బాలసుబ్రహ్మణ్యమూర్తిని సేవింతును.
కుమారేశసూనో! గుహ! స్కన్ద! సేనా – పతే! శక్తిపాణే! మయూరాధిరూఢ |
పులిన్దాత్మజా కాన్త! భక్తార్తిహారిన్! – ప్రభో! తారకారే! సదా రక్ష! మాం త్వమ్
kumārēśasūnō! Guha! Skanda! Sēnā – patē! Śaktipāṇē! Mayūrādhirūḍha |
pulindātmajā kānta! Bhaktārtihārin! – Prabhō! Tārakārē! Sadā rakṣa! Māṁ tvam || 19 ||
కుమారస్వామీ! ఈశ్వరపుత్రా! గుహా! స్కందా! దేవసేనాపతీ! శక్తి యను ఆయుధము హస్తమునందు గలవాడా! నెమలినెక్కినవాడా! వల్లీ నాథా! భక్తుల బాధలను తీర్చునట్టి ప్రభూ ! తారకాసురుని సంహారించిన సుబ్రహ్మణ్యా ! నీవు నన్నెప్పుడూ రక్షించుము.
ప్రశాన్తేన్ద్రియే నష్టసంజ్ఞే విచేష్టే – కఫోద్గారివక్త్రే భయోత్క౦పి గాత్రే |
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం – ద్రుతం మే దయాలో! భవాగ్రే గుహ! త్వమ్
Praśāntēndriyē naṣṭasan̄jñē vichēṣṭē – kaphōdgārivaktrē bhayōtka0pi gātrē |
prayāṇōnmukhē mayyanāthē tadānīṁ – drutaṁ mē dayālō! Bhavāgrē guha! Tvam || 2౦ ||
ఇంద్రియములు చేష్టలుడిగి, స్పృహ తప్పి, ముఖము కఫమును గ్రక్కుచుండ, శరీరము భయముచే కంపించుచుండ దిక్కులేక నేను ప్రాణ ప్రయాణమునకు సిద్ధుడనై యుండగా దయా స్వభావము గల కుమారస్వామీ! నీవు నా యెదుట నుందువు గాక !
కృతాన్తస్య దూతేషు చణ్డేషు కోపా – ద్దహ! చ్ఛిన్ది! భింద్ధీతి మాం తర్జయత్సు |
మయూరం సమారుహ్య మాభై రితిత్వం – పురః శక్తిపాణి ర్మమా యాహి! శీఘ్రమ్
kr̥tāntasya dūtēṣu chaṇḍēṣu kōpā – ddaha! chhindi! Bhind’dhīti māṁ tarjayatsu |
mayūraṁ samāruhya mābhai rititvaṁ – puraḥ śaktipāṇi rmamā yāhi! Śīghram || 21 ||
భయంకరులైన యమదూతలు కోపముతో “కాల్చుము! భేదించుము” అని బెదిరించుచుండగా, శీఘ్రముగా నీవు నెమలి నెక్కి శక్తిని చేతగొని నా యెదుటకు రమ్ము !
ప్రణమ్యా సకృ త్పాదయోస్తే పతిత్వా – ప్రసాద్య ప్రభో! ప్రార్థయేఽనేకవారమ్ |
న వక్తుం క్షమోఽహం తదానీం కృపాబ్ధే! – నకార్యా న్తకాలే మనాగ ప్యుపేక్షా
praṇamyā sakr̥ tpādayōstē patitvā – prasādya prabhō! Prārthayēఽnēkavāram |
na vaktuṁ kṣamōఽhaṁ tadānīṁ kr̥pābdhē! – Nakāryā ntakālē manāga pyupēkṣā || 22 ||
కృపా సముద్రుడా! ప్రభో! అనేక పర్యాయములు నీ పాదములపై బడి నమస్కరించి బ్రతిమాలుకుని ప్రార్థించుచున్నాను. మరణము దరిజేరినప్పుడు నేను మాట్లాడలేను. ఓ కృపాసముద్రుడా! నా మరణకాలమున నీవు కొంచెముకూడ ఉపేక్షించకుము!
సహస్రాణ్డభోక్తా త్వయా శూరనామా – హత స్తారక స్సి౦హవక్త్రశ్చ దైత్యః |
మమాన్తర్హృదిస్థం మనఃక్లేశ మేకం – నహంసి ప్రభో! కింకరోమి క్వ యామి?
Sahasrāṇḍabhōktā tvayā śūranāmā – hata stāraka s’simhavaktraścha daityaḥ |
mamāntar’hr̥disthaṁ manaḥklēśa mēkaṁ – nahansi prabhō! Kiṅkarōmi kva yāmi? || 2౩ ||
ఓ ప్రభో! నీచే అనేక బ్రహ్మాండములను కబళించిన శూరుడను పేరు గల తారకుడు, సింహ ముఖుడు అను రాక్షసులు చంపబడిరి. నా హృదయమునందున్న మానసికబాధ నొక్క దానిని నీవేల నశింపజేయవు? ఏమి చేయుదును ? ఎచటకు పోయెదను ?
అహం సర్వదా దుఃఖభారావసన్నో – భవా దీనబంధు స్త్వదన్యం న యాచే |
భవద్భక్తిరోధం సదా క్లృప్తబాధం – మమాధిం ద్రుతం నాశయోమాసుత! త్వమ్
Ahaṁ sarvadā duḥkhabhārāvasannō – bhavā dīnabandhu stvadan’yaṁ na yāchē |
bhavadbhaktirōdhaṁ sadā klr̥ptabādhaṁ – mamādhiṁ drutaṁ nāśayōmāsuta! Tvam || 24 ||
పార్వతీ నందనా ! నేను ఎల్లప్పుడూ దుఃఖ భారముచే క్రుంగితిని, నీవు దీనబాంధవుడవు. నీకంటే ఇతరులను నేను ప్రార్థించను. నీ భక్తికి ఆటంకమైనదియు, ఎల్లప్పుడు బాధలతో నిండినదియు నగు నా మానసిక వ్యధను నీవు నశింపజేయుము.
అపస్మార కుష్ఠ క్షయార్శః ప్రమేహ – జ్వరోన్మాద గుల్మాది రోగా మహాన్త: |
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం – విలోక్య క్షణాత్తారకారే! ద్రవన్తే
apasmāra kuṣṭha kṣayārśaḥ pramēha – jvarōnmāda gulmādi rōgā mahānta: |
Piśāchāścha sarvē bhavatpatrabhūtiṁ – vilōkya kṣaṇāttārakārē! Dravantē || 25 ||
ఓ తారకాసుర సంహారీ! స్మృతి తప్పుట, కుష్టు, క్షయ, మూలరోగము, ప్రమేహము, జ్వరము, చిత్తచాంచల్యము, గుల్మములు మొదలైన మహారోగములు, సమస్త పిశాచములు, నీ ఆలయములో లభించే పత్రవిభూతిని చూచిన క్షణకాలములో తొలగిపోవును.
దృశి స్కన్దమూర్తి శ్రుతౌ స్కన్దకీర్తి – ర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్ |
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం – గుహే సన్తు లీనా మమాశేషభావా
Dr̥śi skandamūrti śrutau skandakīrti – rmukhē mē pavitraṁ sadā tachharitram |
karē tasya kr̥tyaṁ vapustasya bhr̥tyaṁ – guhē santu līnā mamāśēṣabhāvā || 26 ||
నా దృష్టియందు కుమారస్వామి దివ్యమూర్తి, చెవులయందు స్కందుని కీర్తి, నోటియందు ఎల్లప్పుడూ పవిత్రమైన స్వామి చరిత్ర, చేతులయందు ఆయన సేవ ఉన్నవై, శరీరము ఆయనకు దాసియై నా ఆలోచనలన్నీ ఆ గుహునియందు లీనమూలగుగాక!
మునీనా ముతాహో! నృణాం భక్తిభాజా – మభీష్టప్రదా! స్సన్తి సర్వత్ర దేవాః |
నృణా మన్త్యజానా మపి స్వార్థదానే – గుహాద్దేవ మన్యం నజానే నజానే
munīnā mutāhō! Nr̥ṇāṁ bhaktibhājā – mabhīṣṭapradā! S’santi sarvatra dēvāḥ |
nr̥ṇā mantyajānā mapi svārthadānē – guhāddēva man’yaṁ najānē najānē || 27 ||
మునులకు గాని లేక భక్తి పరులగు నరులకు గాని వాంఛితముల నొసంగు దేవులంతట గలరు. కాని అంత్యవర్ణ సంజాతులగు మానవులకు గూడ నిజాభీష్టముల నొసంగుటయందు కుమారస్వామి కంటె వేరు దైవమును నేనెరుంగను, నే నెరుంగను.
కలత్రం సుతా బన్దువర్గః పశుర్వా – నరో వా ధ నారీ గృహే యే మదీయాః |
యజన్తో నమన్త: స్తువంతో భవన్త౦ – స్మరన్తశ్చ తే సన్తు సర్వే కుమార!
kalatraṁ sutā banduvargaḥ paśurvā – narō vā dha nārī gr̥hē yē madīyāḥ |
yajantō namanta: Stuvantō bhavanta0 – smarantaścha tē santu sarvē kumāra! || 28 ||
ఓ కుమారస్వామీ! నా భార్య, బిడ్డలు, బంధువులు, పశువుగాని మా ఇంటియందున్న నా వారందరూ, మగవాడుగాని, ఆడదిగాని, అందరు నిన్ను పూజించువారుగను, నీకు నమస్కరించువారుగను, నిన్ను స్తుతించువారుగను, నిన్ను స్మరించువారుగను నుందురుగాక!
మృగాః పక్షిణో దంశకా యే చ దుష్టా – స్తథా వ్యాధయో బాధకా యే మదంగే |
భవచ్ఛక్తి తీక్ష్ణాగ్రభిన్నా స్సుదూరే – వినశ్యన్తు తే చూర్ణిత క్రౌఞ్చశైల!
Mr̥gāḥ pakṣiṇō danśakā yē cha duṣṭā – stathā vyādhayō bādhakā yē madaṅgē |
bhavachhakti tīkṣṇāgrabhinnā s’sudūrē – vinaśyantu tē chūrṇita krauñchaśaila! || 29 ||
క్రౌంచ పర్వతమును చూర్ణము చేసిన కుమారస్వామీ! నా శరీరమును బాధించు మృగములు గాని, పక్షులు గాని, దుష్టములైన అడవి ఈగలు గాని. వ్యాధులు గాని, నీ దగు శక్తియనెడి ఆయుధము యొక్క వాడి అయిన కొనచే భేదింప బడినవై మిక్కిలి దూరముగ నశించుగాక!
జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం – సహేతే నకిం దేవసేనాధినాథ! |
అహం చాతిబాలో భవాన్ లోక తాతః – క్షమస్వాపరాధం సమస్తం మహేశ!
Janitrī pitā cha svaputrāparādhaṁ – sahētē nakiṁ dēvasēnādhinātha! |
Ahaṁ chātibālō bhavān lōka tātaḥ – kṣamasvāparādhaṁ samastaṁ mahēśa! || ౩౦ ||
ఓ దేవ సేనాపతీ! తల్లి గాని, తండ్రి గాని తన బిడ్డా యొక్క అపరాధమును మన్నింపరా ? నేను మిక్కిలి బాలుడను. నీవు లోకములకే తండ్రివి. కావున మహాప్రభూ ! నా సమస్తాపరాధములను క్షమించుము!
నమః కేకినే శక్తయే చాపి తుభ్యం – నమ శ్ఛాగ! తుభ్యం నమః కుక్కుటాయ |
నమ స్సిన్ధవే సింధుదేశాయ తుభ్యం – పునః స్కన్ధమూర్తే! నమస్తే నమోస్తు
Namaḥ kēkinē śaktayē chāpi tubhyaṁ – nama śchhāga! Tubhyaṁ namaḥ kukkuṭāya |
nama s’sindhavē sindhudēśāya tubhyaṁ – punaḥ skandhamūrtē! Namastē namōstu || ౩1 ||
కుమారస్వామీ! నీ వాహన మగు నెమలికి, నీ శక్తి ఆయుధమునకు, నీకు, నీ మేకపోతునకు, నీ ధ్వజమగు కోడిపుంజునకు నమస్కారము. నీవు వసించు సింధు దేశమునకు, సముద్రమునకున్ను నమస్కారము. ఓ స్కందుడా! నీకు మరల మరల నమస్కారము.
జయానన్ధభూమ జయాపారధామ – జయా మోఘకీర్తే! జయానందమూర్తే! |
జయానన్ధసిన్ధో! జయాశేషబన్ధో! – జయ! త్వం సదా ముక్తిదా నేశసూనో
Jayānandhabhūma jayāpāradhāma – jayā mōghakīrtē! Jayānandamūrtē! |
Jayānandhasindhō! Jayāśēṣabandhō! – Jaya! Tvaṁ sadā muktidā nēśasūnō || ౩2 ||
ఆనందముతో నిండినవాడా! అపారమైన తేజస్సు గలవాడా! అమోఘమైన కీర్తి కలవాడా! ఆనంద రూపుడా, ఆనంద సముద్రుడా, అందరికీ బంధువైనవాడా! ఎల్లప్పుడు ముక్తినిచ్చు శివకుమారా ! నీకు జయము జయము.
భుజంగాఖ్య వృత్తేన క్లృప్తం స్తవం యః – పఠేద్భక్తి యుక్తో గుహం సంప్రణమ్య |
స పుత్రా న్కలత్రం ధనం దీర్ఘమాయు – ర్లభేత్స్కన్ధ సాయుజ్య మన్తే నర స్స:
bhujaṅgākhya vr̥ttēna klr̥ptaṁ stavaṁ yaḥ – paṭhēdbhakti yuktō guhaṁ sampraṇamya |
sa putrā nkalatraṁ dhanaṁ dīrghamāyu – rlabhētskandha sāyujya mantē nara s’sa: || ౩౩ ||
ఎవడు భక్తితో సుబ్రహ్మణ్యేశ్వరుని నమస్కరించి భుజంగవృత్తముతో నున్న యీ స్తవమును పఠించునో ఆ మనుజుడు భార్యను, బిడ్డలను, ధనమును, దీర్ఘాయువును పొంది అంత్యకాలమున స్కంద సాయుజ్యము నొందు గాక !
****** గమనిక
శ్రీ శంకర భగవత్పాద కృత శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమ్
ప్రవచన కర్త: ‘సమన్వయ సరస్వతి’ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ
CD వివరాలకై సంప్రదించండి: WWW.rushipeetham.org
వెల – 50 రూపాయలు మాత్రమే.
******
మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”
లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******
From “The Hindu” news paper & Published on 19 Nov 2018
బాగుంది
Thanks for launching this Fantastic site.
Bhujanga Stotram pathinchina teeru adbhutam.
Ravikanth gariki krutajnatalu.