శ్రీ త్యాగరాజ స్వామి పంచరత్నకృతులు
పంచరత్న కీర్తనలు…
ఐదు పంచ రత్న కీర్తనలు ఆది తళానికి కూర్చబడ్డాయి. పంచరత్న కీర్తనలు పాడే రాగం వాటి సాహిత్యం మరియు భావాన్ని అనుసరించి ఉంటాయి. ఈ ఐదు కీర్తనలు సంగీత కచేరి లొని రాగం, తానం, పల్లవి పాడేందుకు వీలుగా సంగీత ఉద్ధండులు కల్పనా స్వరాలు పాడేందుకు వీలుగా ఊంటాయి.
త్యాగయ్య వారి పంచ రత్న కీర్తనలు వరుసలో
1. జగదానందకారక – నట రాగం
2. దుడుకుగల నన్నే – గౌళ రాగం
3. సాధించనే ఓ మనసా – అరభి రాగం
4. కనకనరుచిరా – వరాళి రాగం
5. ఎందరోమహానుభావులు – శ్రీ రాగం
పంచరత్న కృతులు పాడే నట గౌళ అరభి వరాళి శ్రీ రాగాలను గాన పంచక రాగాలు అని పిలుస్తారు. వీటికి సంబంధించిన తానం వీణ పై వాయించడానికి చాలా అనువుగా ఉంటాయి. నట వరాళి రాగాలకు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నది.
పంచరత్న కృతుల ప్రత్యేకతలు…
జగదానంద కారక: పంచరత్నాలలో మొదటిది- నాట రాగకృతి. ఇది 36వమేళకర్త రాగమైన చలనాట జన్యం. శారంగదేవుని సంగీత రత్నాకరం పేర్కొన్న గొప్పరాగాలలో ఇది ఒకటి. ఈ రాగంలో షడ్జ, పంచమాలతో పాటు షట్ శృతి దైవతం, కాకలి నిషాదం ఉన్నాయి. ఈ కృతికి ఎన్నుకున్న భాష -సంస్కృతం. భావం:జగదానంద కారకుడైన శ్రీరాముని వర్ణనం. ధీరోదాత్త గుణశోభితుడైన శ్రీరాముని సంబోధనాత్మక కృతి ఇది. నాట రాగ అనువుగా-ఎంతో హృద్యంగా అమరింది.
దుడుకుగల నన్నే: పంచరత్నాలలో రెండవది- గౌళ రాగంలోని కృతి. ఇది 15వ మేళకర్త మాయామాళవగౌళ జన్యం. షడ్జ, పంచమాలతో పాటు శుద్ధ రిషభం ,అంతర గాంధారం ,శుద్ధ మధ్యమం ,శుద్ధ దైవతం ,కాకలి నిషాదం గల రాగం. దీనిలో రిషభం రాగచ్ఛాయగల ఏకశృతిరిషభం. పాడేటప్పుడు దీన్ని ప్రత్యేకంగా పలుకుతారు. కనుక దీనిని గౌళ రిషభం అని అంటారు. సాహిత్యం చూస్తే, దుడుకు చేష్టలున్న అనే పద ప్రయోగం; ఆ వెంటనే ఏ దొర కొడుకు బ్రోచు? అనే పదప్రయోగం నవ్వు పుట్టిస్తాయి. కాని, ఇదొక ఆత్మ విమర్శా జ్ఞానం. దీనిలో చరణాలు కూడా అదే ధోరణిలో సాగుతాయి.
సాధించనే ఓ మనసా: ఇందులో అయిన భగవంతుని యొక్క గొప్పతనన్ని చాలా అందంగా,చక్కగా వర్ణించారు. మొదటి ఐదు చరణాలు శ్రీ కృష్ణుని గొప్పతనాన్ని ,ఆరవ చరణం రాముడి ఘనతను మిగిలిన చరణాలు వేంకటేశ్వర స్వామిని పొగడుతు వ్రాశారు.
కనకన రుచిరా : ఈ కీర్తనను చాల తక్కువగా ఆలాపించటం జరుగుతుంది .దీన్ని గురువు దగ్గర అభ్యసిస్తే గురు శిష్యుల మధ్య భేదభవాలు కలుగుతాయి అని ఒక నానుడి.అందుకనే ఈ కీర్తనను నేర్పించడం చాలా అరుదు.ఇందులో ధ్రువుని కధకి రామయణానికి ఉన్న పొలికలను వర్ణించడం జరిగింది.
ఎందరో మహనుభావులు : ఈ కీర్తనలో త్యాగరాజుల వారు, ప్రపంచములో ఉన్న గొప్పవారందరికి తన వందనాలు తెలిపారు.ఈ కీర్తన చాలా పేరుపొందినది.
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
త్యాగరాజ స్వామి వారి పంచరత్న కృతులు | గురుకులం స్టూడెంట్స్:


Leave a Reply