శ్రీ కార్తికేయ ప్రజ్ఞావివర్ధన స్తోత్రమ్ (Sri Kartikeya Prajñāvivardhana Stotram)

స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Stotram):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Stotram): శ్రీ కార్తికేయ ప్రజ్ఞావివర్ధన స్తోత్రమ్ (Sri Kartikeya Prajñāvivardhana Stotram)

శ్రీ గణేశాయ నమః (Śrī gaṇēśāya namaḥ)

Salutations to Ganesa

స్కందఉవాచ: (Skanda’uvāca:)

Lord Subrahmanya told:-

యోగీశ్వరో మహాసేనః కార్తికేయోగ్ని నందన:
స్కందః కుమారః సేనానీః స్వామీ శంకరసంభవ:.

Yōgīśvarō mahāsēnaḥ kārtikēyōgni nandanah
Skandaḥ kumāraḥ sēnānīḥ svāmī śaṅkarasambhavah.
   || 1 ||

Lord of Yogas, great commander, He who was looked after by Karthika stars,
The child of fire, the lad, the commander and the God born out of Shankara.

గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః
తారకారిరుమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః.

Gāṅgēyastāmrachūḍaścha brahmachārī śikhidhvajaḥ
tārakārirumāputraḥ kraun̄chāriścha ṣaḍānanaḥ.
      || 2 ||

Son of Ganga, he who wears brass, bachelor,
One with peacock flag, he who killed Tharaka, son of Parvathi
He who broke Krouncha mountain, God with six faces.

శబ్దబ్రహ్మ సముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహః
సనత్కుమారో భగవాన్ భోగ మోక్ష ఫలప్రదః.

Śabdabrahma samudraścha sid’dhaḥ sārasvatō guhaḥ
sanatkumārō bhagavān bhōga mōkṣa phalapradaḥ.
      || 3 ||

God of the sound of ocean, One with divine powers,
One who is learned, one who removes darkness,
God, One is son of fire, One who grants pleasure as well as salvation.

శరజన్మా గణాధీశః పూర్వజో ముక్తిమార్గకృత్
సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదాయక:.

Śarajanmā gaṇādhīśaḥ pūrvajō muktimārgakr̥t
sarvāgamapraṇētā cha vān̄chitārthapradāyakah.
      || 4 ||

One born because of an arrow, God of good qualities.
One who is the greater, one who shows salvation,
One who is worshiped by all Vedas,
And one who gives whatever is desired.

అష్టావింశతినామాని మదీయానీతి యః పఠేత్
ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో మూకో వాచస్పతిర్భవేత్.

Aṣṭāvinśatināmāni madīyānīti yaḥ paṭhēt
pratyūṣē śrad’dhayā yuktō mūkō vāchaspatirbhavēt.
  || 5 ||

A devotee of mine, who reads these twenty eight names,
Daily at day break with attention,
Would become great, devoid of attachment and a great scholar.

మహామంత్రమయానీతి మమ నామాను కీర్తనమ్
మహాప్రజ్ఞా మవాప్నోతి నాత్ర కార్యా విచారణా.

Mahāmantramayānīti mama nāmānu kīrtanam
mahāprajñā mavāpnōti nātra kāryā vicāraṇā.
    || 6 ||

These names composed by me, If sung,
Would make one extremely intelligent.

****** ఇతి శ్రీరుద్రయమలే ప్రజ్ఞావివర్ధనాఖ్యమ్ శ్రీమత్కార్తికేయ స్తోత్రం సంపూర్ణం ******

****** This prayer of Karthikeya which would increase intelligence comes to an end. ******

(తెలివితేటలను వృద్ధిచేసే మహిమాన్విత స్త్రోత్రమిది. ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగకరం)

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

కార్తికేయుని 28 నామములు –

1. యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి.
2. మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి.
3. కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు.
4. అగ్నినన్దనః – పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంత సేపు భరించినందువల్ల, అగ్ని దేవునికి కూడా తనయుడిగా పిలువబడినవాడు.
5. స్కందః – పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు.
6. కుమారః – కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికే చెందినది.
7. సేనానీః – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు.
8. స్వామీ శంకరసంభవః – శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు.
9. గాంగేయః – పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక, గంగా మాతకి ఇచ్చేస్తే, గంగా మాత కొంత సేపు శివుని తేజస్సును భరిస్తుంది. అందువల్ల, గంగా మాతకి కూడా పుత్రునిగా పిలబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది.
10. తామ్రచూడః – కుక్కుటమును అధిరోహించిన వాడు.
11. బ్రహ్మచారీ – ఎల్లప్పుడూ బ్రహ్మనందు రమించువాడు.
12. శిఖిధ్వజః – అగ్ని ధ్వజముగా కలవాడు.
13. తారకారిః – తారకాసురడనే రాక్షస సంహారము చేయుటకు అవతారం దాల్చిన వాడు, తారకాసురుడిని, ఇతర రాక్షస గణములను సంహరించి దేవతలను రక్షించినవాడు.
14. ఉమాపుత్రః – ఉమాదేవి, అంటే పార్వతీ అమ్మ వారి ముద్దుల తనయుడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారు అచ్చం అమ్మవారి లానే ఉంటారు.
15. క్రౌంచారిః – పర్వత రూపములో ఉన్న క్రౌంచ అనే రాక్షసుడిని సంహరించినవాడు.
16. షడాననః – ఆరు ముఖములు గలవాడు.
17. శబ్దబ్రహ్మసముద్రః – జ్ఞాన స్వరూపుడు, అంటే వేదములు ఏ పరబ్రహ్మ స్వరూపమును గురించి ఘోషిస్తున్నాయో, ఆ వేద శబ్దములచే ప్రతిపాదించబడిన వాడు.
18. సిద్ధః – పరిపూర్ణ సిద్ధ స్వరూపుడు.
19. సారస్వతః – సరస్వతీ స్వరూపము, అంటే జ్ఞాన స్వరూపము.
20. గుహః – సకలజీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు.
21. భగవాన్ సనత్కుమారః – చతుర్ముఖ బ్రహ్మ గారి నలుగురు మానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు. ఈ విషయమే, త్రిపురా రహస్యంలో మాహాత్మ్యఖండంలో వివరించబడినదని, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు.
22. భోగమోక్షఫలప్రదః – ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడానికి అవసరమైన సంపదతో పాటు అంత్యమునందు మోక్షమును కూడా ఇవ్వగలిగినవాడు.
23. శరజన్మా – శరవణతటాకము (రెల్లు పొదల) నుండి జన్మించినవాడు.
24. గణాధీశః – సకల దేవతలకు, గణములకు అధిపతి అయిన వాడు.
25. పూర్వజః – అందరికన్నా ముందున్నవాడు, అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు, కేవలం ఒక అవతారం మాత్రమే కాదు, ఎప్పుడూ ఉండే పరబ్రహ్మ స్వరూపం. ఆయన ఎప్పుడూ ఉన్నవాడు, పుట్టుక లేనివాడు.
26. ముక్తిమార్గకృత్ – ముక్తి మార్గమును బోధించే గురు స్వరూపం. అంత్యమున ముక్తిని ప్రసాదించి, తనలో కలుపుకునే స్వామి.
27. సర్వాగమప్రణేతా – సకల ఆగమములకు మూలము.
28. వాంచితార్ధప్రదర్శనః – అభీష్టములను నెరవేర్చే తండ్రి.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *