అరిషడ్వర్గాలను అంతం చేసే షణ్ముఖుడు
షట్ అంటే ఆరు. స్వామి ఆరు ముఖాలు కలవాడు. అందుకే షణ్ముఖుడని పేరు వచ్చినది. సుబ్రహ్మణ్య స్వామి జ్ఞాన స్వరూపము. అందుచేతనే అజ్ఞాన స్వరూపులైన రాక్షసులను హతమార్చినాడు. ఆ జ్ఞానమునకు ఆరు తలలుండును. అరిషడ్వర్గములు అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఆరు దుర్గణములున్న అజ్ఞాన రాక్షసిని ఆరు తలలు ఉంటే తప్ప చంపలేము. స్వామి ఆరుముఖాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గములను నాశనం చేస్తాయి. దైవ సంపదయగు ఆరు తలలు గల్గి అసుర సంపదకు సంభవించిన అరిషడ్వర్గములనెడి ఆరు తలలను త్రుంచి వేయవలెను. ఇదియే షణ్ముఖుని రూప వైశిష్ట్యము.
కుమారస్వామిని ఆరాధించటాన్ని కౌమారం అంటారు. కుమారస్వామి జననమే అపూర్వం. తారకాసుర సంహారం కోసం శివశక్తుల సంగమం అనివార్యమైంది. షణ్ముఖుడైన కుమారస్వామిని సంవత్సరాగ్ని స్వరూపంగా వేదాలు పేర్కొన్నాయి. కాలాగ్ని స్వరూపుడైన తేజమే ఈ సంవత్సరాగ్ని. ఆరు ముఖాలు ఆరు ఋతువులు, పన్నెండు చేతులు 12 మాసాలు. ఇదీ సంవత్సరాగ్ని స్వరూపం. ‘అమోఘమైన శివతేజాన్ని పృధ్వి, అగ్ని, జలం, నక్షత్ర శక్తి (షట్‌కృత్తికలు) ధరించి, చివరకు అలౌకిక మహాగ్ని శరవణం (రెల్లుతుప్ప)లో రూపుదిద్దుకుంది. శరవణ భద్రడయ్యాడు సుబ్రహ్మణ్యుడు. చిత్రాగ్ని అనే నెమలిని వాహనంగా చేసుకున్నాడు. అనేక వర్ణాలను వెదజల్లే కాంతిపుంజమే నెమలిగా చెప్పేయి.
షణ్ముఖుని ఆరుముఖములు…
తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, ఆకాశము, భూమి.
స్వామి ఆరు ముఖాల ప్రత్యేకత…
మొదటిది వెలుగునిస్తుంది.
రెండవముఖం వరాలను ఇస్తుంది.
మూడవ ముఖం యజ్ఞాలను రక్షిస్తుంది.
నాలుగవ ముఖం వేదాల అర్థాన్ని బోధిస్తుంది.
ఐదవ ముఖం దుష్టశక్తులను నాశనం చేస్తుంది.
ఆరవముఖం ధర్మాన్ని ఆచరించాలని అందరికి ప్రబోధిస్తుంది.
ఈయన బ్రహ్మచారి అని కూడా చెబుతారు. ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయమయ్యిందట. జగజ్జనని, “నాయనా! ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించి ఉంది కనుక తాను ఇక ఎవరినీ పెళ్ళాడలేను అనుకుని కార్తికేయుడు బ్రహ్మచారిగా వుండి పోయాడట.
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

Leave a Reply