https://www.clickmagick.com/share/1485142037427

Tag Archives:

శ్రీ సుబ్రహ్మణ్య పంచదశాక్షరి మంత్రం (Sri Subrahmanya Panchadasakshari Mantra)

ఓం శ్రీం క్రీం క్లీం ఐ౦ ఈ౦ నం లం సౌ: శరవణభవ (OM Shreem Kreem Kleem Aim Eeem Namm Lam Souh Saravanabhava)

సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే కుజ దోషం కారణంగా ఎదురయ్యే సమస్యలు పరిష్కారమవుతాయని శాస్త్రంలో చెప్పబడి ఉంది.

స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click here to Listen the MP3):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to Download the MP3): శ్రీ సుబ్రహ్మణ్య పంచదశాక్షరి మంత్రం (Sri Subrahmanya Panchadasakshari Mantra)

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ (Sri Subrahmanya Ashtakam)

****** శ్రీ శంకర భగవత్పాద కృత శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రమ్ (Śrī śaṅkara bhagavatpāda kr̥ta śrī subrahmaṇya karāvalamba stōtram) ******

హే స్వామినాథ కరుణాకర దీనబంధో – శ్రీపార్వతీశ ముఖపంకజ పద్మబంధో,
శ్రీశాదిదేవగణపూజిత పాదపద్మ – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.

hē svāminātha karuṇākara dīnabandhō – śrīpārvatīśa mukhapaṅkaja padmabandhō,
śrīśādidēvagaṇapūjita pādapadma – vallīsanātha mama dēhi karāvalambam.
   || 1 ||

హే స్వామినాథ! (స్వామిమలై కొండలపై ఉన్న వాడు స్వామినాథుడు) ! కరుణాకరా! దీనబంధో! కలువ వంటి ముఖము కల పార్వతీ దేవి కుమారా! విష్ణువు మొదలగు దేవతలచే పూజించబడిన పద్మముల వంటి పాదములు కలవాడా! వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

దేవాదిదేవనుత దేవగణాధినాథ – దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద,
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.

dēvādidēvanuta dēvagaṇādhinātha – dēvēndravandya mr̥dupaṅkajaman̄jupāda,
dēvarṣināradamunīndrasugītakīrtē – vallīsanātha mama dēhi karāvalambam.
   || 2 ||

దేవాది దేవుడైన శివునిచే నుతించ బడినవాడా! దేవ గణములకు అధిపతీ! దేవేన్ద్రునిచే పూజించబడిన కలువలవంటి పాదములు కలవాడా! , దేవర్షియైన నారదుడు మొదలైన మునులుచే గానము చేయబడి, నుతించబడిన కీర్తి కలవాడా! వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ – భాగ్యప్రదాన పరిపూరితభక్తకామ,
శృత్యాగమ ప్రణవ వాచ్యనిజస్వరూప – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.

nityānnadāna niratākhila rōgahārin – bhāgyapradāna paripūritabhaktakāma,
śr̥tyāgama praṇava vāchyanijasvarūpa – vallīsanātha mama dēhi karāvalambam. 
    || 3 ||

ప్రతిదినము అన్నమునిచ్చే వాడా! అన్ని రోగములను హరించే వాడా! భక్తులు కోరిన కోరికలన్నీ తీర్చే వాడా! వేదములలో చెప్పబడిన ప్రణవమునకు నిజరూపుడా! వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల – చాపాదిశస్త్రపరిమండితదివ్యపాణే,
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీన్ద్ర వాహ – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.
Kraun̄chāsurēndra parikhaṇḍana śaktiśūla – chāpādiśastraparimaṇḍitadivyapāṇē,
śrīkuṇḍalīśa dhr̥tatuṇḍa śikhīndra vāha – vallīsanātha mama dēhi karāvalambam.
    || 4 ||

క్రౌంచము, రాక్షసుల, దేవేంద్రుని గర్వమును అణచిన వాడా! శక్తి శూలము, పాశము మొదలగు శస్త్రములు శోభతో చేతులయందు కలవాడా! కుండలములు ధరించి, అందమైన మెడ కల నెమలిని అధిరోహించిన వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

దేవాదిదేవ రథమండల మధ్య మేత్య – దేవేంద్ర పీఠనగరం దృఢ చాపహస్తమ్,
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.

dēvādidēva rathamaṇḍala madhya mētya – dēvēndra pīṭhanagaraṁ dr̥ḍha chāpahastam,
śūraṁ nihatya surakōṭibhirīḍyamāna – vallīsanātha mama dēhi karāvalambam.
   || 5 ||

దేవాది దేవా! రథమండలము మధ్యలో యున్న వాడా! దేవేంద్రుని నగరాన్ని కాపాడిన వాడా! హస్తములతో వేగముగా బాణములు వేయగలవాడా! అసురుడైన శూరుని చంపి దేవతలచే పొగడబడిన వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

హారాదిరత్నమణియుక్తకిరీటహార – కేయూరకుండలలసత్కవచాభిరామ,
హే వీర తారక జయామరబృందవంద్య – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.

hārādiratnamaṇiyuktakirīṭahāra – kēyūrakuṇḍalalasatkavachābhirāma,
hē vīra tāraka jayāmarabr̥ndavandya – vallīsanātha mama dēhi karāvalambam.
   || 6 ||

హారములు, మణులతో పొదగబడిన కిరీటమును ధరించిన వాడా! కేయూరములు, కుండలములు, కవచము ధరించి అందముగా యున్న వాడా! వీరుడా! తారకుని జయించి దేవతల బృందముచే మ్రొక్క బడిన వాడా! వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

పంచాక్షరాదిమనుమ౦త్రిత గాంగతోయైః – పంచామృతైః ప్రముదితేన్ద్ర ముఖైర్మునీంద్రైః,
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.

Pan̄chākṣarādimanuma0trita gāṅgatōyaiḥ – pan̄chāmr̥taiḥ pramuditēndra mukhairmunīndraiḥ,
paṭṭābhiṣikta hariyukta parāsanātha – vallīsanātha mama dēhi karāvalambam.
   || 7 ||

పంచాక్షర జపముతో, గంగా నదీ స్నానముతో, పంచామృత స్నానముతో దేవతలు, మునులు కొనియాడి కొలుచు చుండగా దేవేంద్రునిచే సేనాపతిగా అభిషిక్తుడవైన వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా – కామాదిరోగ కలుషీకృతదుష్టచిత్తమ్,
సిక్త్వా తు మామవ కళాధర కాంతకాంత్యా – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.

śrīkārtikēya karuṇāmr̥tapūrṇadr̥ṣṭyā – kāmādirōga kaluṣīkr̥taduṣṭachittam,
siktvā tu māmava kaḷādhara kāntakāntyā – vallīsanātha mama dēhi karāvalambam.
   || 8 ||

కరుణతో నిండిన పూర్ణమైన చూపులతో కామము, రోగము నాశనము చేసి, కలుషితమైన మనస్సును శుభ్రపరిచే ఓ కార్తికేయ! సకల కళలకు నిధీ! శివుని తేజస్సుతో వెలిగే వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

సుబ్రహ్మణ్యాష్టక౦ పుణ్యం యే పఠ౦తి ద్విజోత్తమాః,
తే సర్వే ముక్తి మాయా౦తి సుబ్రహ్మణ్య ప్రసాదతః.

Subrahmaṇyāṣṭakam puṇyaṁ yē paṭhanti dvijōttamāḥ,
tē sarvē mukti māyānti subrahmaṇya prasādataḥ.       || 9 ||

సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్,
కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి.

Subrahmaṇyāṣṭaka midaṁ prātarut’thāya yaḥ paṭhēt,
kōṭijanmakr̥taṁ pāpaṁ tat‍kṣaṇādēva naśyati.  
    || 10 ||

****** ఇతి శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ (This is the end of Sri Subrahmanya Ashtakam)******

***సుబ్రహ్మణ్యాష్టకమును నిత్యమూ పఠించిన యెడల కోటి జన్మల పాపాలు, రాహుకేతు సర్పదోషము లన్నియు నశి౦పబడును.***

***కరావలంబనమంటే చేయూతని అర్ధం. ***

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ (MP3) వినుటకు ఇక్కడ క్లిక్ చేయండి (Please click here to listen the Stotram):

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Stotram): శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ (Sri Subrahmanya Ashtakam)

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

మల్లవరం సుబ్రహ్మణ్య దేవాలయం నుండి సేకరణ

పార్వతీ హృదయాంభోజ (Parvati Hrdayambhoja)

పార్వతీ హృదయాంభోజ చిత్ర భానో మహాతనో
బ్రహ్మణ్య! బ్రహ్మవిద్గణ్య ! సుబ్రహ్మణ్య సురప్రభో
ప్రారబ్ధదవారసంహార షాణ్మాతుర శివంకర
నమః శరవణోద్భూత ధ్యాయేత్వాం సతతం హృది
శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః

Pārvatī hr̥dayāmbhōja chitra bhānō mahātanō
brahmaṇya! Brahmavidgaṇya! Subrahmaṇya suraprabhō
prārabdhadavārasanhāra ṣāṇmātura śivaṅkara
namaḥ śaravaṇōdbhūta dhyāyētvāṁ satataṁ hr̥di
śrīvallī dēvasēnā samēta subrahmaṇyēśvara svāminē namaḥ

సుబ్రహ్మణ్య సేవా ఫలములు…



        ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

అమరకోశం II ఒకనాటి మన జాతీయ పాఠ్యపుస్తకం

అమరసింహుడు నాల్గవ శతాబ్దమునాటి జైనమతస్తుడు. సంస్కృత, భాషాభ్యాసమునకు మహోపకారియగు ఒక నిఘంటువును రచించారు. దానిపేరు నామలింగాను శాసనము. వాడుకలో అమరసింహుని పేరు మీదనే ఈ నిఘంటువు అమరకోశం అని ప్రాచుర్యం పొందింది. తెలుగు వారికోసం దాని వ్యాఖ్యానమును లింగాభట్టు రచించారు. ‘అమరం చదవని వానికి నేను అమరను’ అని సరస్వతి దేవి వచనంగా ప్రచారంలో ఉన్న ‘నామా లింగాను శాసనం’ అనే నిఘంటువు సుమారు రెండు వేల సంవత్సరాలకు పైగా భారత భూమిలో ప్రచారంలో ఉన్నది. బ్రిటీషువారు భారతదేశానికి రాకముందు మన ప్రాచీన గురుకుల పాఠశాలల వ్యవస్థలో పై తరగతుల పిల్లలకి అమరకోశంతో పాటు రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం, కిరాతార్జునీయం, శిశుపాలవధ అనే ఈ అయిదు పుస్తకాలూ తప్పనిసరి వాచకాలుగా నిర్దేశించబడ్డాయి.

సంస్కృతం నేర్చుకునే ప్రతి విద్యార్థి అమరం వల్లెవేయడం ప్రాథమికమని భావించబడిన మహా గ్రంథం ఇది. ఆయుర్వేద మహా శాస్త్రవేత్త ధన్వంతరి కూడా ఈ నిఘంటువు మీద ఆధారపడి తన ధన్వంతరి కోశమనే ఆయుర్వేద నిఘంటువును రచించారు. ఇతడు జైనమతస్తుడయినను, భారతీయ సాంప్రదాయములకు, ఆచారవ్యవహారములకు విరుద్ధుడు కాడు. భాషాసేవయే ముఖ్యమని భావించి స్వాభిప్రాయముల జొప్పించక సంస్కృతమునకు మేలు చేకూర్చాడు. పదిహేను వందల సంవత్సరాల కిందటే చైనా భాషలోకి కూడా అనువాదం పొందిన నిఘంటువు ఇది. ఈ అమరకోశం తనకు పూర్వం రచించబడిన నిఘంటువుల నడుమ మహోజ్వలమై నాటికీ నేటికి ప్రకాశించే కోశరత్నం. ఈనాటికి ప్రతి సంస్కృత విద్యార్థి ‘యస్య జ్ఞాన దయా సింధీ’ అనే ప్రార్థన శ్లోకంతో మొదలు పెట్టి సంస్కృత అధ్యయనాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ విధంగా అమరకోశం సంస్కృత వాజ్మయంలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న విషయం యదార్థం.

అమరసింహుడు అమరకోశముతో పాటు అనేక గ్రంధములను రచించారు. కానీ శంకర భగవత్పాదులతో వాదమునకు దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయారు. అప్పుడు ఆయనకు బాధ కలిగింది. ‘నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను – కాబట్టి నేను రచించిన గ్రంథములన్నీ పనికిమాలినవి అయిపోయాయి’ అని ఆయన తన గ్రంథములనన్నిటిని తగులబెట్టేశారు. ఈ విషయం శంకరులకు తెలిసింది. ఆయన బహు కారుణ్య మూర్తి. ఆయన వచ్చి ‘ఎంత పని చేశావయ్యా! గ్రంథములను ఎందుకు తగులబెట్టావు?’ అని అడిగారు. అప్పటికి ఇంకా ఒకే ఒక గ్రంథము మిగిలిపోయి ఉన్నది. అది అమరకోశము.

అమరకోశము చాలా గొప్ప గ్రంథము. అది మన సనాతన ధర్మమునకు సంబంధించిన నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో, స్మృతులు, పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్త్వికమయిన విషయములను, నామములకు, అనేకమయిన విషయములకు ఉండే అర్థములను అలా ప్రతిపాదన చేసింది. ఏదయినా ఒక విషయమును ప్రతిపాదన చేసేముందు సాధారణంగా ఒకసారి అమరకోశమును చూస్తూ ఉంటారు. అమరకోశంలో కాండ విభాగం బట్టి కానీ వర్గ విభాగం నుంచి చేసిన పధ్ధతి చాలా శాస్త్రీయమైనది. అందువలననే అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ గ్రంధం విస్తృతంగా వ్యాప్తి చెందింది. సంస్కృత భాషను నేర్చుకునే ప్రాధమిక విద్యార్ధికి దీనిని మించిన ఉపయుక్తమైన గ్రంధం లేదు. అమరం అనంతరం అనేక నిఘంటువులు వచ్చినా అవి నిలదొక్కుకోలేక పోయినాయి. కేవలం దీనిలో లేని పదాలను ఉటంకిస్తూ మాత్రమే అవి అస్తిత్వాన్ని నిలుపుకోవలసి వచ్చినాయి. అమరకోశానికి దాదాపు 60 వరకూ వ్యాఖ్యాన గ్రంధాలు ఉన్నాయంటే ఆ సంఖ్యే అమరకోశంగ్రంధం యొక్క ప్రాశస్త్యానికి, ప్రచారానికి అద్దం పడుతుంది.

‘శివ’ అనే శబ్దము చాలా గొప్పది. శివమహాపురాణము శివ శబ్దముతోటే ప్రారంభమయింది. శివ శబ్దమును అమరకోశం వ్యాఖ్యానం చేసింది. ‘శివ’ ‘శివా’ అనే రెండు శబ్దములు మనకి లోకములో వాడుకలో ఉన్నాయి. ‘శివ’ అంటే శంకరుడు. ‘శివా’ అంటే పార్వతీదేవి. ఆయన యొక్క శక్తి స్వరూపము.అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదే. ఎందుచేతనంటే “దేవసేనాపతీ, శూరః, స్వామీ, గజముఖానుజః “ అని అర్ధంగా ఇవ్వబడింది. తరువాత స్వామి అనే పేరు వేరే స్వరూపాలు కూడా తీసుకున్నా, అన్నీ సుబ్రహ్మణ్య స్వరూపాలే అని అనుకోవాలి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలిచినా, కేవలం స్వామీ అని పిలిచినా అది సుబ్రహ్మణ్యుడికే చెందుతుంది అని చెప్పింది అమరకోశం.

అమరంలో అసలేముంది?

ఇందులో మూడు కాండలున్నాయి.

1. ప్రథమకాండ – మంగళాచరణము, పరిభాష, స్వర్గవర్గం, వ్యోమవర్గం, దిగ్వర్గం, కాలవర్గం, ధీవర్గం, వాగ్వర్గం, శబ్దాదివర్గం, నాట్యవర్గం, పాతాళవర్గం, భోగివర్గం, నరకవర్గం, వారివర్గం అనే విభాగాలున్నాయి. మొత్తం శ్లోకాల సంఖ్య రమారమి 330.
2. ద్వితీయకాండ – భూవర్గం, పురవర్గం, శైలవర్గం, వనౌషధివర్గం, సింహాదివర్గం, మనుష్యవర్గం, బ్రహ్మవర్గం, వైశ్యవర్గం, శూద్రవర్గం. మొత్తం శ్లోకాల సంఖ్య రమారమి 750.
3. తృతీయకాండ – విశేష్యనిఘ్నవర్గం, సంకీర్ణవర్గం, నానార్థవర్గం, అవ్యయవర్గం, లింగాదిసంగ్రహవర్గం, పున్నపుంసకలింగశేషం, త్రిలింగశేషం. మొత్తం శ్లోకాల సంఖ్య రమారమి 483.

అమరంలో కుమారస్వామి పేర్లు…

కార్తికేయో మహాసేన శ్శరజన్మా షడాననః
పార్వతీ నందన స్కన్ద స్సేనానీ రగ్ని భూర్గుహః
బాహులేయక స్తారకజి ద్విశ్శాఖ శ్శిఖి వాహనః
షాణ్మాతురః శ్శక్తిధరః కుమారః క్రౌంచ ధారణః

కార్తికేయః = ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు.
మహాసేనః = గొప్ప సేన గలవాడు.
శరజన్మాః = శరవణతటాకము (రెల్లు పొదల) నుండి జన్మించినవాడు.
షడాననః = షట్కృత్తికల స్తన్య పానము చేయుటకై ఆరు మొగములు ధరించినవాడు.
పార్వతీ నందనః = పార్వతీదేవి కుమారుడు.
స్కంధః = శతృవులను శోషింపజేయువాడు, శివుని రేతస్సుచే జనించినవాడు.
సేనానీః – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు.
అగ్నిభూః = అగ్ని వలన జనించినవాడు.
గుహః = సకలజీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు.
బాహులేయః = కృత్తికల కొడుకు.
తారకజిత్ = తారకాసురుని జయించినవాడు.
విశాఖః = విశాఖా నక్షత్రమున జన్మించినవాడు, పక్షియైన నెమలిపై తిరుగువాడు.
శిఖివాహనః = నెమలి వాహనముగాగలవాడు.
షణ్మాతురః = ఆరుగురు తల్లులు గలవాడు.
శక్తిధరః = శక్తి యను ఆయుధము గలవాడు.
కుమారః = ఎల్లపుడు బాలుడుగా కనబడువాడు, కుత్సితులను సంహరించువాడు, భువియండు మన్మధునివలె అందమైన వాడు, ఎల్లపుడును బ్రహ్మచారి.
క్రౌంచ ధారణః = క్రౌంచ పర్వతమును ఉక్కళించినవాడు.

ఇవి పదిహేడున్నూ కుమార స్వామి పేర్లు

స్వామినాథస్వామి ఆలయం II స్వామిమలై

ఆది దంపతులు పరమేశ్వరుడు, పార్వతీదేవిల రెండో తనయుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. దేవసేనానిగా వ్యవహరించి రాక్షసుడు శూరపద్ముడిని సంహరించాడు. ఈ సంహారం కోసం ఆయన పలు రణశిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. వాటిని ఆరు పడై వీడు అంటారు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే వున్నాయి. అవి స్వామిమలై, పళని, పళముదిర్చోళై, తిరుప్పరన్‌కుండ్రం, తిరుచెందూర్, తిరుత్తణి. ప్రస్తుతం మనం స్వామిమలై గురించి తెలుసుకుందాము.

స్వామిమలై అంటే ‘దేవుని పర్వతం’ అని అర్థం మరియు ఈ పవిత్రమైన దేవుని ఉనికి ఈ పట్టణం లోపల మరియు చుట్టూ ఉన్న పరిసరాలలో ప్రభావం చూపుతుంది. స్వామిమలై శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది, రాష్ట్రంలో ఇక్కడ మాత్రమే కాంస్య నాణేల యొక్క కళ బోధించే పాఠశాల ఉన్నది. స్వామిమలై అపారమైన జ్ఞానం. అందరికీ స్వామి అయిన శివునికి ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి ప్రణవ మంత్రం ‘ఓం’ తత్వాన్ని వెల్లడించిన కారణంగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని స్వామినాథ స్వామి అని కొలుస్తారు..

స్వామినాథ అంటే గురు స్వరూపం. అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదే. ఎందుచేతనంటే “దేవసేనాపతీ, శూరః, స్వామీ, గజముఖానుజః “ అని అర్ధంగా ఇవ్వబడింది. తరువాత స్వామి అనే పేరు వేరే స్వరూపాలు కూడా తీసుకున్నా, అన్నీ సుబ్రహ్మణ్య స్వరూపాలే అని అనుకోవాలి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలిచినా, కేవలం స్వామీ అని పిలిచినా అది సుబ్రహ్మణ్యుడికే చెందుతుంది అని చెప్పింది అమరకోశం. అటువంటి మహానుభావుడు స్వామిమలైలో వెలిసి ఉన్నాడు.

ఆలయ విశేషాలు…

ఈ క్షేత్రము అరవై మెట్లు ఉన్న ఒక కొండ మీద ఉంటుంది. పైకి ఎక్కాలంటే విశాలమైన 60 రాతి మెట్లు ఎక్కాలి. ఈ అరవై మెట్లు అరవై తమిళ సంవత్సారాలకి ప్రతీకలనీ, ఆ సంవత్సరాధిదేవతలు ఈ రూపంగా స్వామిని సేవిస్తున్నారనీ అంటారు. ప్రతి మెట్టు దగ్గర గోడమీద ఆ సంవత్సరం పేరు వ్రాసి వుంటుంది తమిళంలో. ఈ మెట్ల దోవ మధ్యలో, 32 మెట్లు ఎక్కగానే కుడివైపున కుమారస్వామి తన తండ్రికి ఉపదేశం ఇస్తున్న అద్భుత శిల్పం కనబడుతుంది. స్వామిమలై ఆలయం మూడు గోపురాలను, మూడు ప్రాకారాలు కలిగి ఉన్నది. ఇక్కడి ఆలయ ప్రాకారాలు విచిత్రంగా ఉంటాయి. మొదటి ప్రాకారం గుట్ట (కొండ అని కూడా పిలుస్తారు) అడుగుభాగంలో ఉన్నది. రెండవ ప్రాకారం గుట్ట మధ్యభాగంలో ఉన్నది. మూడవ ప్రాకారం కొండపై ఆలయం చుట్టూ నెలకొని ఉన్నది. ఇక్కడి ఆలయం బావిని వజ్రతీర్థం అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని కార్తవీర్యార్జునుడు కట్టించాడు. గర్భ గుడి బయట హాల్లో ఈయన విగ్రహాన్ని చూడవచ్చు.

గుడి క్రింది భాగంలో శివుడు పార్వతుల మంటపాలు వున్నాయి. వీరి పేర్లు మీనాక్షీ సుందరేశ్వర్, మీనాక్షి. పాండ్య రాజైన వరగుణుడు ఒకసారి మధుర నుంచి పుణ్యక్షేత్రమైన తిరువిడైమరుదూర్ కు వెళ్తూ ఈ ఆలయంలో ఒక రాత్రి గడిపాడుట. ఆయన కుల దైవమైన మీనాక్షీ సుందరేశ్వరుని ఆరాధించటానికి ఈ మంటపాలనేర్పరచాడు. తర్వాత కీ.శే. అరుణాచల చెట్టియార్ ఇక్కడ రాతి కట్టడాలు కట్టించాడు.

ధ్వజ స్ధంబం దగ్గర వున్న వినాయకుడిగుడి కూడా చాలా మహిమ కలది. ఇక్కడ కుమార తరై, నేత్ర పుష్కరిణి అనే రెండు పుష్కరిణులు వున్నాయి. కొంగు ప్రాంతంనుంచి వచ్చిన పుట్టుగుడ్డి అయిన ఒక భక్తుడు ఈ రెండు పుష్కరిణులలో స్నానం చేసి స్వామి సన్నిధానానికి వస్తుంటే ఈ వినాయకుడి గుడి దగ్గరకు వచ్చేసరికి ఆయనకి కన్నులు కనిపించాయట. అందుకే ఈ వినాయకుణ్ణి నేత్ర వినాయగర్ అంటారు.

స్థల పురాణము…

పూర్వము ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మ గారు కైలాసం వైపు వెడుతూ వుండగా, సదా చిద్విలాసంతో ఉండే నా తండ్రి సుబ్రహ్మణ్యుడు, బ్రహ్మ గారిని ఆపి “ బ్రహ్మమనగా ఏమి?, ప్రణవమునకు అర్ధం తెలుసా? “ అని అడిగారు. చతుర్ముఖ బ్రహ్మ గారు అన్నారు, “ బ్రహ్మము అనగా నేనే “. వెంటనే కార్తికేయుడు, మీరు నాలుగు ముఖములతో వేదములు చెప్తున్నారు కాని, బ్రహ్మము అర్ధం కాలేదు అని బ్రహ్మ గారిని చెరసాలలో బంధించారు. వెంటనే పరమశివుడు వచ్చి, “బ్రహ్మ గారికి జ్ఞానములో కించిత్ దోషం ఉండవచ్చు, అంత మాత్రాన కారాగారములో పెట్టకూడదు. ఆయనని విడిచి పెట్టేయి” అని చెప్పగా, సుబ్రహ్మణ్య స్వామి వారు వెంటనే బ్రహ్మ గారిని విడిచిపెడతారు. అంతే కాక, సుబ్రహ్మణ్యుడు శంకరుడితో అంటారు, “ నేను ఎంత మీ కుమారుడనైనా, బ్రహ్మ గారిని అలా అవమానించకూడదు” అని, దీనికి ప్రాయశ్చిత్తంగా సర్ప రూపం దాల్చి భూలోకంలో వచ్చి ఉన్నారు . అలా ఉండగా పిల్లలూ, అందరూ వచ్చి రాళ్ళతో కొడుతూ ఉంటే, పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి షష్ఠీ వ్రతం చేయించింది. దానితో ఆయన పాపం తొలగి పూర్తి తెజోమయుడైన సుబ్రహ్మణ్య రూపం వచ్చిందని అంటారు పెద్దలు.

పరమశివునికీ ప్రణవ ఉపదేశం…

ఒకానొక సమయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు, పరమశివునికి ప్రణవము ఉపదేశం చేశారు స్వామిగా. ఇది ఎంతో చిత్రంగా ఉంటుంది, శంకరుడు సకల జ్ఞానములకు ఆలవాలము. ఈశానః సర్వ విద్యానాం అంటారు కదా. ఇక్కడ దీని అంతరార్ధము ఏమిటంటే, ఏ తండ్రి అయినా తన కొడుకు చేతిలో ఓడిపోవడం ఇష్టపడతాడు. కొడుకు చేతిలో తండ్రి ఓడిపోతే అది తనకి గొప్ప సన్మానముగా భావిస్తాడు తండ్రి. లోకానికంతటికీ జ్ఞానమునిచ్చే తండ్రికి, తన తేజస్సుతో పుట్టిన పుత్రుడు జ్ఞాన బోధ చేయడం అనేది ఎంతో ఆనందదాయకమైన విషయము. ఇక్కడే అగస్త్య మహర్షికి ద్రవిడ వ్యాకరణం బోధించారు సుబ్రహ్మణ్యుడు. స్వామిమలైలో సుబ్రహ్మణ్య స్వామి వారి మందిరం పైన ఉంటుంది, క్రింద, మీనాక్షీ, సుందరేశ్వరుల మందిరములు ఉంటాయి.

వసతి సదుపాయము…

స్వామిమలై క్షేత్రం కుంభకోణం నుండి చాలా దగ్గరలో ఉండడం వల్ల, వసతి కుంభకోణంలో చూసుకోవడమే ఉత్తమం. స్వామిమలైలో అంత ఎక్కువగా వసతి సదుపాయాలు లేవు. కుంభకోణం కూడా ప్రఖ్యాత పుణ్య క్షేత్రము అవడం వల్ల ఇక్కడ ఎన్నో హోటళ్ళు ఉన్నాయి.

ఆలయంలో ఆర్జిత సేవలు…

స్వామిమలైలో ప్రతీ రోజూ స్వామి వారికి అభిషేకం చేస్తారు. స్వామి వారిని అలంకరణ లేకుండా చిన్న కౌపీనం మాత్రం ఉంచి వేద మంత్రాలు చదువుతూ, పంచామృతాలతో అద్భుతంగా చేస్తారు ఈ అభిషేకం. అభిషేకంలో మన పురుషార్ధంతో ద్రవ్యాలు ఏమైనా ఇచ్చినా వాటితో కూడా చేస్తారు. ఈ అభిషేకం దర్శనం కోసం పదిహేను వందల రూపాయలు టికెట్. ఇక్కడ స్వామినాథ స్వామి చిన్న కౌపీనంతో తన చేతిలో శక్తిఆయుధం పట్టుకుని చిన్న పిల్లవాడిలా ముద్దుగా కనబడతారు. సమయము, అవకాశము ఉన్న వారు తప్పకుండా చూడవలసినది స్వామి వారి అభిషేకం.

ఎక్కడ ఉన్నది?

ఈ క్షేత్రం తమిళనాడు లోని తంజావూర్ జిల్లాలో కుంభకోణం సమీపంలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్ ద్వారా: తిరుచిరాపల్లి నుండి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుచిరాపల్లి, మధురై, చెన్నై, బెంగళూరు నగరాల నుండి అనేక బస్సులు ఉన్నాయి. రైలు ద్వారా: కుంభకోణంలో రైల్వే స్టేషను ఉంది. ఇక్కడ నుండి చెన్నైకి ప్రతీ రోజూ అనేక రైళ్ళు నడుస్తాయి.విమానము ద్వారా: దగ్గరలో విమానాశ్రయములు తిరుచిరాపల్లి ( 90 కి.మీ. ), మధురై ( 234 కి.మీ. ), చెన్నై ( 285 కి.మీ. ), బెంగళూరు ( 438 కి.మీ. ) దూరంలో ఉన్నాయి.

మరిన్ని వివరాలకై ఆలయం వెబ్ సైట్ ఇచ్చట చూడండి: స్వామినాథస్వామి ఆలయం – స్వామిమలై

మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: అరుళ్మిగు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం – స్వామిమలై:

      ****** స్వామి వారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం, శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******